ప్రతీకాత్మక చిత్రం
రాయగడ : జిల్లాలో ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడినట్లు కేసు రుజువు కావడంతో ముద్దాయికి 7సంవత్సరాల కఠినకారాగార శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ రాయగడ జిల్లాకోర్టు ఆవరణలో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మెజిస్ట్రేట్ డాక్టర్ ఇందుశర్మ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6నెలలు కారగారశిక్ష విధిస్తూ తీర్పులో స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
2017లో జనవరి 4వ తేదీ రాత్రి 11గంటల సమయంలో జిల్లాలోని కుంబీకోట అవుట్‌పోస్టు పరిధి నకిటి గ్రామ పంచాయతీ ఉల్క తొండ గ్రామానికి 34సంవత్సరాల వయస్సు గల మహిళ తన ఇంటిముందర ఆరుబయట బాత్రూమ్‌కు వచ్చింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కుశ ఉల్క కుమారుడు శాంత ఉల్క (35) చూసి ఆమెపై దాడి చేసి ఊరిపొలిమేరలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు ఆ మహిళ కుంబీకొట అవుట్‌పోస్టులో ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ జరిపి బాధిత మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం శాంత ఉల్కను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి 9మంది సాక్షులను విచారించిన పిదప స్పెషల్ ట్రాక్ కోర్టు మెజిస్ట్రేట్ డాక్టర్ ఇందుశర్మ తీర్పునిచ్చారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రొబిప్రసాద్ మహపాత్రో బాధితురాలి తరఫున, సుశాంత్‌కుమార్ కొశాల ముద్దాయి తరఫున వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment