Seven years prison
-
అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు
సాక్షి, తిరుపతి: ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తిరుపతి రూరల్ జీవకోన క్రాంతినగర్‌కు చెందిన కుసునూరు చరణ్‌కుమార్‌కు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి రాంగోపాల్ మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము రూ.25 వేలులో రూ.20వేలు బాధిత యువతికి చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కోర్టు మానిటరింగ్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్ రమేష్ కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలానికి చెందిన 19 సంవత్సరాల యువతి స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాలలోని డీఎంఎల్టీ సెకండ్ ఇయర్ కోర్సు చదువుతూ స్థానిక ఎమ్మార్‌పల్లెలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్లో ఉండేవారు. చరణ్‌కుమార్ అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదివి మధ్యలో చదువు ఆపేశాడు. ఆ యువతి వెంట ఇతడు ప్రేమ పేరుతో రోజూ వెంటపడేవాడు. 2011 ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 8.45 ప్రాంతంలో ఆ యువతి కళాశాలకు నడిచి వెళుతుండగా చరణ్‌కుమార్ క్రైమ్ పోలీసు స్టేషన్ సమీపంలో వెంబడించాడు. తన ఇంట్లో పూజా కార్యక్రమం ఉందని, తనతో రావాలని తిరిగి వదిలి పెడతానని చెప్పాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. అయితే అతడు మాయమాటలు చెప్పి బలవంతంగా ద్విచక్ర వాహనంలో టౌన్ క్లబ్ సమీపంలోని ఇంటిలోకి ఆమెను తీసుకెళ్లాడు. ఆ ఇంటి యజమాని టీ గిరి, అతని బంధువు కే నాగరాజ సహాయంతో ఆమెకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు గంటల తర్వాత మత్తు వదలిన ఆ యువతిని గిరి ఆటోలో హాస్టల్‌కు పంపాడు. బాధితురాలు ఈ సంఘటన విషయాలను ఇద్దరు స్నేహితురాళ్లకు, హాస్టల్ వార్డన్‌కు తెలిపింది. తరువాత కూడా నిందితుడు చరణ్‌కుమార్ బాధిత యువతికి ఫోన్‌చేసి విషయాన్ని ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. బాధితురాలు ఈ మేరకు స్థానిక వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు గిరి, నాగరాజపై నేరం రుజువుకాకపోవడంతో వారిపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు చరణ్కుమార్పై అత్యాచారం కింద కేసు నిరూపణ కావడంతో అతనికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
యువతిని మోసం చేసిన వ్యక్తికి ఏడేళ్ల జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు : ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసగించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 7 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ. 2500 జరిమానా విధిస్తూ 2వ స్పెషల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఇన్చార్జి జడ్జీ మంగళవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీరాంరెడ్డి కథనం ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన యువతికి 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహానంతరం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. మహేశ్వరంలో టైలరింగ్ పనిచేస్తూ జీవనాన్ని గడుపుతోంది. అదే గ్రామానికి చెందిన మహ్మద్ హజీం ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఆ యువతికి పరిచయం అయ్యాడు. ఆ యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను శారీరకంగా అనుభవించాడు. 2013 జూన్, 6 పెళ్లి చేసుకోమంటూ హజీంను కోరగా అతను తిరస్కరించాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 14వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ వరప్రసాద్ పైవిధంగా తీర్పు చెప్పారు. -
లైంగికదాడి కేసులో ఏడేళ్ల జైలు
రాయగడ : జిల్లాలో ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడినట్లు కేసు రుజువు కావడంతో ముద్దాయికి 7సంవత్సరాల కఠినకారాగార శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ రాయగడ జిల్లాకోర్టు ఆవరణలో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మెజిస్ట్రేట్ డాక్టర్ ఇందుశర్మ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6నెలలు కారగారశిక్ష విధిస్తూ తీర్పులో స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 2017లో జనవరి 4వ తేదీ రాత్రి 11గంటల సమయంలో జిల్లాలోని కుంబీకోట అవుట్‌పోస్టు పరిధి నకిటి గ్రామ పంచాయతీ ఉల్క తొండ గ్రామానికి 34సంవత్సరాల వయస్సు గల మహిళ తన ఇంటిముందర ఆరుబయట బాత్రూమ్కు వచ్చింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కుశ ఉల్క కుమారుడు శాంత ఉల్క (35) చూసి ఆమెపై దాడి చేసి ఊరిపొలిమేరలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు ఆ మహిళ కుంబీకొట అవుట్‌పోస్టులో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ జరిపి బాధిత మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం శాంత ఉల్కను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి 9మంది సాక్షులను విచారించిన పిదప స్పెషల్ ట్రాక్ కోర్టు మెజిస్ట్రేట్ డాక్టర్ ఇందుశర్మ తీర్పునిచ్చారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రొబిప్రసాద్ మహపాత్రో బాధితురాలి తరఫున, సుశాంత్‌కుమార్ కొశాల ముద్దాయి తరఫున వాదించారు. -
వాట్సాప్ రచ్చ ఏడేళ్ల జైలు శిక్ష
సాక్షి, చెన్నై : వాట్సాప్‌లో ఇటీవల కాలంగా సంచలన సమాచారంతో పాటుగా, అసభ్యకరమైన వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై కొరడా ఝుళిపించేందుకు నగర పోలీసు యంత్రాంగం సిద్ధం అయింది. అసభ్యకర ఫొటోలు, వీడియోలు, ఎస్ఎంఎస్లు వాట్సాప్ ద్వారా పంపిన పక్షంలో ఏడేళ్లు జైలు శిక్ష తప్పదని చెన్నై పోలీసుల కమిషనరేట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆధునిక యుగంలో టెక్నాలజీ విస్తరించే కొద్ది సరికొత్త సోషల్ నెట్ వర్క్‌లు పుట్టుకు వస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రాచుర్యంలో ఉండగానే వాట్సాప్ రంగంలోకి దిగింది. ఆండ్రాయిడ్, తదితర మొబైల్స్‌లోని సదుపాయాల మేరకు కొత్త రకంగా సమాచారం, సోషల్ నెట్ వర్కింగ్ వ్యవహారాలు సాగుతున్నాయి. అయితే, వీటిని కొందరు అసభ్యకర సంకేతాలకు ఉపయోగించే పనిలో పడ్డారు. అయితే, ఇన్నాళ్లు వీటి మీద పెద్దగా దృష్టి పెట్టని నగర పోలీసు కమిషనరేట్ వర్గాలు, తాజాగా కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయ్యాయి. ఇందుకు కారణం, తమ పోలీసు అధికారి ఫోన్లో ప్రేమ లీల హల్చల్ చేసింది వాట్సాప్‌లో కాబట్టే. మరో మహిళా అధికారి బెదిరింపు వ్యవహారం వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతోంది. ఎక్కడి నుంచి ఎవరు పంపిస్తున్నారో ఏమోగానీ, తమ మీద బురదజల్లే రీతిలో వాట్సాప్‌లో ప్రచారాలు సాగుతుండడంతో ఇక, అసభ్యకర సందేశాలు, ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌లో ప్రత్యక్షమైనా, ఎవరైనా ఫిర్యాదు చేసినా కొరడా ఝుళిపించే విధంగా పోలీసు బాసులు నిర్ణయించారు. ఏడేళ్లు జైలు శిక్ష : వాట్సాప్‌లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై కన్నెర్ర చేయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఎవరి వాట్సాప్ నెంబర్లకైనా అసభ్యకర సందేశాలు, ఫొటోలు, వీడియోలు వచ్చినా తమకు ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పిలుపునిస్తున్నారు. ఒకరి వ్యక్తిగత విషయాలు, ఒకరి ఫొటోలను మరొకరు వాట్సాప్‌లలో పంపించడం, తదితర చర్యలకు పాల్పడ్డ పక్షంలో సైబర్ క్రైంను తక్షణం ఆశ్రయించాలని సూచిస్తున్నారు. తమకు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా తదుపరి చర్యల అనంతరం సంబంధిత వ్యక్తులపై ఏడేళ్ల జైలు శిక్ష విధించే రీతిలో కేసులు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంగా ఓ పోలీసు అధికారి పేర్కొంటూ, వాట్సాప్‌లలో వాయిస్ రికార్డులు, వీడియోలు, ఇలా తమ వాళ్లను టార్గెట్ చేసి ఇష్టా రాజ్యంగా ప్రచారాలు సాగుతుండడాన్ని తీవ్రంగా పరిగణించామని పేర్కొనడం గమనార్హం. ఏదేని అసభ్యకరంగా వ్యవహరించే సందేశాలు, ఫొటోలు, వీడియోలు ప్రత్యక్షమైతే చాలు చర్యలు తప్పదని హెచ్చరించారు.