ప్రతీకాత్మక చిత్రం
రంగారెడ్డి జిల్లా కోర్టులు : ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసగించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 7 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ. 2500 జరిమానా విధిస్తూ 2వ స్పెషల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఇన్‌చార్జి జడ్జీ మంగళవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీరాంరెడ్డి కథనం ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన యువతికి 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహానంతరం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది.
మహేశ్వరంలో టైలరింగ్ పనిచేస్తూ జీవనాన్ని గడుపుతోంది. అదే గ్రామానికి చెందిన మహ్మద్ హజీం ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఆ యువతికి పరిచయం అయ్యాడు. ఆ యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను శారీరకంగా అనుభవించాడు. 2013 జూన్, 6 పెళ్లి చేసుకోమంటూ హజీంను కోరగా అతను తిరస్కరించాడు.
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 14వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ వరప్రసాద్ పైవిధంగా తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment