women complaint
-
యువతిని మోసం చేసిన వ్యక్తికి ఏడేళ్ల జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు : ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసగించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 7 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ. 2500 జరిమానా విధిస్తూ 2వ స్పెషల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఇన్చార్జి జడ్జీ మంగళవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీరాంరెడ్డి కథనం ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన యువతికి 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహానంతరం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. మహేశ్వరంలో టైలరింగ్ పనిచేస్తూ జీవనాన్ని గడుపుతోంది. అదే గ్రామానికి చెందిన మహ్మద్ హజీం ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఆ యువతికి పరిచయం అయ్యాడు. ఆ యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను శారీరకంగా అనుభవించాడు. 2013 జూన్, 6 పెళ్లి చేసుకోమంటూ హజీంను కోరగా అతను తిరస్కరించాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 14వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ వరప్రసాద్ పైవిధంగా తీర్పు చెప్పారు. -
షాకింగ్ : నేను స్నానం చేస్తుంటే గవర్నర్ చూశారు..!
సాక్షి, చెన్నై : ‘నేను స్నానం చేస్తుండగా గవర్నర్ బాత్రూమ్లోకి తొంగి చూశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోండి’ అంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ‘ఆ పెద్దమనిషి చర్య నన్ను షాక్‌కు గురిచేసిందం’ని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సమస్యలను తెలుకునే ఉద్దేశంతో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం కడలూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశాల అనంతరం.. వీధివీధి, ఇల్లిల్లూ తిరుగుతూ పరిస్థితులను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటిలోకి వెళుతూ.. పక్కనున్న మరుగుదొడ్డిలోకి తొంగిచూశారు. లోపల ఓ మహిళ స్నానం చేస్తుండటంతో క్షణంలో వెనుకడుగువేశారు. అయితే, గవర్నర్ చర్యకు షాక్ తిన్న మహిళ కాసేపటికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించిన గవర్నర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో గవర్నర్ వెంట కడలూరు కలెక్టర్, అధికార ఏఐడీఎంకేకి చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారు. మరోవైపు గవర్నర్ పర్యటనను నిరసిస్తూ ప్రతిపక్ష డీఎంకే కడలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించింది. మహిళ ఫిర్యాదుపై గవర్నర్‌గానీ, రాజ్‌భవన్‌గానీ ఇంకా స్పందించాల్సిఉంది. కాన్వాయ్ ఢీకొని ఇద్దరి మృతి గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ భద్రతా సిబ్బంది వాహనం ఢీకొని ఇద్దరు మృతిచెందారు. కడలూరు-చెన్నై మార్గంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. -
'లంచంతో నా శాడిస్టు భర్తకు క్లీన్ చిట్ ఇచ్చారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త పోలీసు బాస్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆయన బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 'మీ డిపార్ట్ మెంట్ అధికారులు లంఛం తీసుకొని వేధింపులకు పాల్పడుతున్న తన భర్తను వదిలేశారంటూ' ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. సోమవారం ఢిల్లీ కొత్త పోలీసు కమిషనర్ గా బస్సీ స్థానంలో అలోక్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన అలా తీసుకున్నారో లేదో ఓ మహిళ తన ఒడిలో రెండు నెలల చంటి బిడ్డను తీసుకొని పోలీసు బాస్ కార్యాలయం వద్దకు వచ్చి కూర్చుంది. అక్కడే కుప్పలుగా మీడియా ప్రతినిధులు ఉన్నారు. తన అత్తమామలు, భర్త కలిసి తన బిడ్డను తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె రోధించడం ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్ కు చెందిన అరిఫా అనే మహిళ పోలీసు కమిషనర్ బాధ్యతలు తీసుకునే సమయంలో గేటు వద్దకు వచ్చింది. పోలీసు అధికారులు.. తనను వేధిస్తున్న భర్త వద్ద లంఛం తీసుకొని అతడికి క్లీన్ చిట్ ఇచ్చారని, ఈ విషయం పోలీసు కమిషనర్ కు చెప్తానని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పింది. అయితే, లోపలికి అనుమతించకపోవడంతో మీడియాను ఆశ్రయించి అన్ని వివరాలు తెలిపింది. కమిషనర్ బిజీ కార్యక్రమాల వల్ల ఆమె ఆయనతో సమస్య చెప్పుకోలేకపోయింది.