
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గజల్ శ్రీనివాస్(లేటెస్ట్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : యువతిపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ ‘గజల్’ శ్రీనివాస్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కొంతకాలంగా శ్రీనివాస్ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు చర్యలకు ఉపక్రమించినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.
ఆమె రేడియో జాకీ : లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలు.. ఆలయవాణి అనే వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తున్నారు. ఈ వెబ్ రేడియో గజల్ శ్రీనివాస్‌దే కావడం గమనార్హం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ప్రాధమిక దర్యాప్తు జరిపిన వెంటనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
వీడియో ఆధారాలు?: ఆథ్యాత్మికత, దేశభక్తి, మహిళల భద్రత తదితర అంశాలపై ఎన్నో కళారూపాలు చేసిన గజల్ శ్రీనివాస్ లైంగికవేధింపుల కేసులో అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేసుకు సంబంధించి వీడియోలు, ఆడియోలు వంటి పూర్తి ఆధారాలతోనే బాధితురాలు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment