చేయి చాచితే సంకెళ్లే.. | Special Story On International Anti-Corruption Day In Sakshi | Sakshi
Sakshi News home page

చేయి చాచితే సంకెళ్లే..

Published Mon, Dec 9 2019 10:30 AM | Last Updated on Mon, Dec 9 2019 10:30 AM

Special Story On International Anti-Corruption Day In Sakshi

సాక్షి : సంగారెడ్డి : ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పనుల నిమిత్తం, బిల్లుల కోసం లంచాలు డిమాండ్‌ చేసే అధికారులు, సిబ్బందిపై కొరడా ఝులిపించడానికి మేమున్నామంటూ భరోసానిస్తూ అండగా నిలుస్తున్నారు. ఏసీబీ నజర్‌తో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టుకుంటోంది. నేడు(డిసెంబర్‌ 9) ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మూడు నుంచి అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో వారోత్సావాలు నిర్వహిస్తున్నారు.  

ఎవరికి ఫిర్యాదు చేయాలి? 
ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునేవారు అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే పెండింగ్‌ బిల్లులకు డబ్బులు డిమాండ్‌ చేయడం, రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే బెనిఫిట్‌ల కోసం ఇబ్బందికి గురిచేస్తే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. ఈ నంబర్‌ హైదరాబాద్‌ ఏసీబీ కార్యాలయంలో ఉంటుంది. అక్కడి నుంచి ఉమ్మడి 10 జిల్లాల్లోని ఏసీబీ డీఎస్పీ స్థాయి అధికారి లేదా కార్యాలయానికి సమాచారం అందుతుంది. నేరుగా డీఎస్పీ లేదా ఇన్‌స్పేక్టర్లకు ఫిర్యాధు చేయవచ్చు. ఫిర్యాదు అధారంగా ఎంక్వయిరీ చేస్తారు. ఆరోపణలు నిజం అని తెలిస్తే ఫిర్యాదుదారిడి నుంచి ఏసీబీ అధికారులు డబ్బులు తీసుకొని వాటికి కెమికల్‌ కలిపి ఇస్తారు. అవినీతి అధికారికి వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. ముందస్తు ప్లానింగ్‌ ప్రకారం అదుపులోకి తీసుకొంటారు. ఫిర్యాదుదారుడి డబ్బులు ఒక్క రుపాయి మినహాయించకుండా కేసు నడుస్తుండగానే 30 లేదా 45 రోజుల్లో వాపసు ఇస్తారు. 

వారోత్సవాల కార్యక్రమాలు ఇలా.. 
► ఉమ్మడి జిల్లాలో అవినీతి వారోత్సాల సందర్భంగా డీఎస్పీ రవికుమార్‌ ఆధ్వర్యంలో ఈనెల 3న ఎన్‌జీఓల ద్వారా ఆర్టీఐ యాక్టివిస్ట్స్‌ అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు.  
►4న మెదక్‌ పట్టణంలో ఐటీ నుంచి రాందాస్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 5న ‘అవినీతి నిర్మూలనలో ప్రజల పాత్ర’ అనే అంశంపై ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు, కాలేజీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.  
►6న డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన నిర్వహించారు.  
►7న వ్యాసరచన పోటీ, మూల్యంకనం, 8న వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి పేర్ల ప్రకటన, 9న ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భం వారోత్సావాల ముగింపు సందర్భంగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారు. ఏసీబీ కేసుల పిర్యాధుదారులకు బహుమతులు అందజేస్తారు. 

ఉమ్మడి జిల్లా అవినీతి నిరోధక శాఖ అడ్రస్‌ 
ఉమ్మడి మెదక్‌ జిల్లా అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయం సంగారెడ్డి బైపాస్‌ రోడ్డులో ఉంది. డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇద్దరు ఇన్‌ స్పెక్టర్లు, ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ప్రజలు డీఎస్పీ రవికుమార్‌ మొబైల్‌ నం.94404 46149 నంబర్‌కు కాల్‌ చేయాలి. లేదా 83329 75590, 83329 75591, 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కైనా ఫో¯Œ  చేసి తెలపాలి. కేసులు పెండింగ్‌లో ఉండకుండా తగు చర్యలు తీసుకుంటారు.  

జహీరాబాద్‌లో పట్టుబడిన వీఆర్వో
జహీరాబాద్‌ టౌన్‌ : మొగుడంపల్లి మండలంలోని మన్నాపూర్‌ వీఆర్వో అయూబ్‌ ఈ ఏడాది మేలో తహసీల్దార్‌ కార్యాలయంలో పట్టపాస్‌ పుస్తకం కోసం రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మన్నాపూర్‌ గ్రామానికి చెందిన అశోక్‌రెడ్డి అన్నదమ్ములు వారసత్వంగా వచ్చిన పొలాన్ని పంచుకున్నారు. పట్టాపాస్‌ పుస్తకం కోసం అన్నదమ్ములు కలిసి దరఖాస్తు చేసుకున్నారు. పట్ట పాస్‌ బుక్‌ కావాలంటే రూ.15 వేలు ఇవ్వాలని వీఆర్వో అయూబ్‌ డిమాండ్‌ చేశారు. దీంతో రైతు అశోక్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అశోక్‌రెడ్డి తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఓ అయూబ్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 


వీఆర్‌ఓ అయూబ్‌ నుంచి వివరాలను రికార్డు చేస్తున్న ఏసీబీ అధికారులు
(టోపి పెట్టుకున్న వ్యక్తి)(ఫైల్‌)

అవగాహన కార్యక్రమాలు ఇలా 
ప్రజలను చైతన్యపర్చడానికి ప్రతి కార్యాలయంలో అనితీతి నిరోధకశాఖ స్టిక్కర్లు, వాల్‌పోస్టర్లను అతికిస్తున్నారు. 1064టోల్‌ ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు ఉమ్మడి జిల్లాలో పర్యవేక్షిస్తూ నిర్భయంగా అవినీతికి పాల్పడే వారిపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. 

►2018లో పీఆర్‌ డిపార్టుమెంటులో సిద్దిపేట జిల్లాß హుస్నాబాద్, చేర్యాలకు చెందిన ఈఈ చంద్రకాంత్‌ బిల్లుల చెల్లింపులో రూ.85 వేలు కాంట్రాక్టర్‌ వద్ద డిమాండ్‌ చేస్తూ ఏసీబీకి చిక్కారు. 
►సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ఐబీ(ఇరిగేష¯Œ ) ఏఈగా పనిచేస్తూ రూ.15వేలు డిమాండ్‌ చేస్తూ పట్టుబడ్డారు. 
►మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన పారెస్ట్‌ బీట్‌ ఆపీసర్‌ మహమ్మద్‌ ఖరీమొద్దీ¯Œ  రూ.25 వేల డిమాండ్‌తో కేసు నమోదైంది. 
►సంగారెడ్డి జిల్లా పంచాయతీరాజ్‌లో నారాయణఖేడ్‌ నియోజకవర్గం, హౌదత్‌పూర్‌ పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్న సమయంలో జాయింట్‌ చెక్‌ పవర్‌ కారణంగా రూ.90 వేలు డిమాండ్‌ చేస్తూ ఏసీబీకి దొరికిపోయాడు. 
►సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంటుగా పనిచేసిన డాక్టర్‌ మురహరి, సీనియర్‌ అసిస్టెంట్‌ నరెందర్‌లు రూ80 వేలు డిమాండ్‌ చేస్తూ ఏసీబీ వలలోపడ్డారు. 
లసంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్‌ టౌ¯Œ  ప్లానింగ్‌ అధికారి దినేష్‌ రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. 
►2019లో సంగారెడ్డి ఎంవీఐ అనీల్‌చౌహా¯Œ  రూ. ఐదు వేల లంచం తీసుకొని ఏసీబీ పన్నిన వలలో చిక్కారు. 
►సిద్దిపేట జిల్లా బెజ్జంకి, కోహెడ మండలాలకు చెందిన తహసీల్దార్లు నాగజ్యోతి, శ్రీనివాస్‌ ఇద్దరు కొత్త పట్టపాసుపుస్తకాలు ఇవ్వడానికి మంజుర్‌సింగ్‌ అనే వ్యక్తి వద్ద రూ.17 లక్షలు డిమాండ్‌ చేశారు. మొదటి విడతలో రూ.5.50 లక్షలు ముట్టజెప్పినప్పటికీ పని కాకపోవడంతో అనుమానం వచ్చి ఏసీబీని అశ్రయించాడు. వలపన్ని పట్టుకున్నారు. 
►సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి వీఆర్‌ఓ ఆయాబ్‌ అబ్దుల్‌ రూ.15 వేలు డిమాండ్‌ చేయగా పట్టుకున్నారు.  
►సిద్దిపేట జిల్లా లద్నూర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వడ్డెపల్లి శ్రీనాథ్‌ ఎల్‌డీసీకి ఐదు నెలల వేతానాన్ని చెల్లించేందకు రూ.45 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించడంతో పట్టుబడ్డాడు.  
►మెదక్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్లు షౌకత్‌అలీ, నర్సింలు రూ. 15 వేలు లంచం డిమాండ్‌ చేయడంతో అవినీతి నిరోదకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. 
►సంగారెడ్డి జిల్లా జోగిపేట ఎస్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న దేవేందర్, జయప్రకాశ్‌చారి, ఎస్తెర్‌రాణి, రిటైర్డ్‌ అధికారి బయికాడి నర్సింలు వద్ద రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. 

అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవు. అనితీతి నిరోధక చట్టం1988 సెక్షన్‌19 ప్రకారంò కేసులు నమోదు చేస్తారు. నాన్ బెయిలబుల్‌  వారెంటు ఉంటుంది. స్టేషన్‌ బెయిల్, హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా చెల్లదు. ఒకసారి అధికారులు ఏసీబీకి చిక్కినా, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా వలపన్ని పట్టుకుంటారు. కేసు నమోదయితే తక్షణమే ఉద్యోగిని సస్పెండ్‌ చేస్తారు. అలాగే 40 రోజుల పాటు జైలు శిక్ష  ఉంటుంది.  

నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అవినీతికి పాల్పడుతూ లంచం డిమాండ్‌ చేస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. నేడు ప్రపంచ అవినీతి నిరోదక దినోత్సవం సందర్భంగా వారోత్సావాలు నిర్వహిస్తున్నాం. ప్రజలకు ఏసీబీ సేవలపై అవగాహన కల్పిస్తున్నాం. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064, డీఎస్పీ నంబర్‌ 94404 46149లో ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ప్రజలు సద్వినియోగపర్చుకోవాలి. 
– సీహెచ్‌ మురళీమోహన్‌, ఏసీబీ ఇన్‌స్పెక్టర్, సంగారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement