ప్రేమికుడు అరెస్ట్‌ | Suspicious couple arrest | Sakshi

ప్రేమికుడు అరెస్ట్‌

Jan 27 2018 7:58 AM | Updated on Aug 20 2018 4:27 PM

Suspicious couple arrest  - Sakshi

యలహంక: ఇక్కడి యలహంక రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఓ ప్రేమజంటను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు...చిక్కబళ్లాపురం జిల్లా చింతామణికి చెందిన అరవింద్, బెంగళూరుకు చెందిన ఓ మైనర్‌ బాలికతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి అది ప్రేమగా దారితీసింది. 15 రోజలు క్రితం ఇద్దరు పారిపోయి గోవా, తిరుపతి తదితర ప్రాంతాల్లో తిరిగారు. యువకుడి వద్ద డబ్బులు ఖర్చుకావడంతో గురువారం రాత్రి యలహంక రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్నేహితుడితో డబ్బులు తెప్పించుకోవడానికి వేచి చూస్తున్నాడు.

వీరి ప్రవర్తనపై అనుమానించి రైల్వే పోలీసులు ఆరా తీయగా సదరు యువతి తన చెల్లెలను బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెల్లడించాడు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement