
చెన్నై: దొంగతనాలు జరగకుండా చూడాల్సింది పోలీసులు. అలాంటిది ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే. ఆశ్చర్యంగా ఉన్న ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడు ట్రాఫిక్ పోలీస్ బూత్‌లో చోటు చేసుకుంది. వినోద్ అనే ట్రక్ డ్రైవర్ పోలీస్ బూత్ నుంచి ఫ్యాన్, కుర్చీలు, లైట్లు దొంగిలించాడు. ఈ సంఘటన ఈ నెల 2న జరిగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో బిజీగా ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన వినోద్ తెరిచి ఉన్న పోలీస్ బూత్‌లోకి ప్రవేశించి.. ఫ్యాన్, లైట్లు, కుర్చీలు దొంగిలించుకు వెళ్లాడు. తిరిగి వచ్చిన అధికారి పోలీస్ బూత్‌లో దొంగతనం జరిగిందని గుర్తించాడు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు వినోద్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీస్ బూత్‌కు బయట నుంచి తాళం వేయకపోవడంతో తాను లోపలికి వెళ్లి దొంగతనం చేశానని వినోద్ ఒప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment