శంకర్‌పల్లి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ భూపాల్‌రెడ్డి కుమారుడు సామ తేజ్‌పాల్‌రెడ్డి(27)ని శంకర్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మోకిల గ్రీన్ విల్లా ప్రాంతానికి చెందిన సాయిసింధూరి(27) ఇంటీరియర్ డిజైనర్. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి ప్రాంతానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ భూపాల్‌రెడ్డి కుమారుడు సామ తేజ్‌పాల్‌రెడ్డి ఆమెను ప్రేమించాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవల యువతి తేజ్‌పాల్‌రెడ్డి వివాహం విషయమై ప్రస్తావించగా నేడురేపు అంటూ దాటవేస్తున్నాడు. ఈ విషయమై గత డిసెంబర్ నెలలో సాయిసింధూరి శంకర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 417, 420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం తేజ్‌పాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఇదే నెలలో తేజ్‌పాల్‌రెడ్డి మరో యువతిని వివాహం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment