
శంకరపట్నం(మానకొండూర్): ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లిన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం చింతగుట్టకు చెందిన ఓరు గంటి ప్రశాంత్‌రెడ్డి (23) అక్కడ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. గ్రామానికి చెం దిన ఓరుగంటి రాజిరెడ్డి, భాగ్యమ్మకు ప్రవీణ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి కుమారులు. చిన్నకుమారుడు ప్రశాంత్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో యూరప్ వెళ్లాడు. కనూలుష్ టెక్నికల్ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ మెకానికల్ విద్యను అభ్యసిస్తున్నాడు.
ఈ నెల 19న రాత్రి బాత్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ప్రశాంత్‌రెడ్డి ఆత్మహత్యతో అతడి కుటుంబలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఎంపీ వినోద్‌కుమార్‌ను కలసి విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment