కామారెడ్డి క్రైం: బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లే ఇల్లు గుల్ల చేశారు దొంగలు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సైలాన్‌బాబాకాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కాలనీలో నివాసముండే మహ్మద్ బషీరొద్దిన్ కొంతకాలంగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండగా, అతని కుటుంబ సభ్యులు రెండ్రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లారు. తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు.
ఇల్లంతా చిందర వందర చేసి, కనిపించిందల్లా పట్టుకుపోయారు. అయితే, దొంగతనం జరిగినట్లుగా మంగళవారం సాయంత్రం గుర్తించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐదు తులాల బంగారం, రూ.5 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment