పెనుగొండ వాసవీ శాంతి ధాంలో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ నిపుణులు
సాక్షి, పెనుగొండ : ప్రసిద్ధిగాంచిన పెనుగొండ వాసవీ శాంతి ధాంలో వాసవీమాత అభిషేక విగ్రహం అపహరణకు గురైంది. శనివారం ఉద యం పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన అర్చకులు మరకిత వాసవీ మాత విగ్రహం పాదాల వద్ద ఉండే పంచలోహ విగ్రహం కనిపించకపోవడంతో శాంతి ధాం నిర్వాహకులకు సమాచారం అందించాం. సుమారు 1.5 అడుగుల పంచలోహ విగ్రహంతో పాటు 6 అం గుళాల ఇత్తడి వినాయకుని విగ్రహం, మరకిత శిల విగ్రహంలో అలంకరించిన రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు మాయమైనట్టు నిర్వాహకులు గుర్తిం చారు. ఈమేరకు పెనుగొండ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో పెనుగొండ ఎస్సై పి.నాగరాజు ఆధ్వర్యంలో క్లూస్ టీం, జాగిలంతో పో లీసులు రంగ ప్రవేశం చేసి ఆధారాలు సేకరించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతోనే విగ్రహం చోరీకి గురైందని పోలీసులు భావిస్తున్నారు. వాసవీ శాంతి ధాంకు నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని గుర్తించారు.
బంగారు విగ్రహం అంటూ వదంతులు
ఆలయంలో బంగారు వాసవీ మాత విగ్రహం, బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయంటూ వదంతులు రావడంతో పెనుగొండ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, వాసవీ మాత ఆలయంలో అమ్మవారికి పవిత్ర దినాల్లో మాత్రమే బంగారు ఆభరణాలను అలంకరిస్తుంటారు. అంతేగాకుండా, ఆలయంలో బంగారు వాసవీ మాత విగ్రహం ఇప్పటివరకూ తయారు చేయలేదని సమాచారం. 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహానికి బంగారు పూత మాత్రమే పూయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ధామంలో బంగారు విగ్రహాలు లేవని నిర్వహకులు తెలిపారు. ఆభరణాలు సురక్షితంగా లాకర్లలో ఉంచుతారని స మాచారం. దీంతో ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొన్నారు. నా నాటికీ పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని వాసవీ శాంతి ధాంలో విలువైన వస్తువులు ఉండటం వలన భద్రతపై దృష్టి సారిం చాలంటూ పలువురు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment