చిన్నారిని చంపుతామని బెదిరించి.. గ్యాంగ్‌ రేప్‌ | Threats to kick woman in stomach until unborn baby dies follow gangrape | Sakshi
Sakshi News home page

చిన్నారిని చంపుతామని బెదిరించి.. మహిళపై గ్యాంగ్‌ రేప్‌

Published Sun, Oct 8 2017 2:00 AM | Last Updated on Sun, Oct 8 2017 9:40 AM

Threats to kick woman in stomach until unborn baby dies follow gangrape

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రి నుంచి బైక్‌పై ఇంటికొస్తున్న ఓ జంటను అడ్డగించిన నలుగురు దుండగులు భర్త, 3 నెలల చిన్నారి ముందే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను తీవ్రంగా కొట్టి చెట్టుకు కట్టేసిన దుండగులు.. సదరు మహిళను పొలంలోకి ఈడ్చుకెళ్లి, చిన్నారిని చంపేస్తామని తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద కారుతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయన్నారు. అత్యాచారం చేసిన అనంతరం ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించి దుండగులు పరారైనట్లు వెల్లడించారు.

ఈ దంపతుల అరుపులు విని అటుగా వచ్చిన రైతులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పాటు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని నలుగురు దుండగులపై కేసు నమోదు చేసినట్లు ముజఫర్‌నగర్‌ రూరల్‌ ఎస్పీ అజయ్‌ సహదేవ్‌ తెలిపారు. గతేడాది జూలైలో యూపీలోని బులంద్‌షహర్‌లో కారులో వెళ్తున్న ఓ కుటుంబంపై దాడిచేసిన దుండగులు అందర్నీ సమీపంలోని పొలంలోకి ఈడ్చుకెళ్లారు. అనంతరం అందర్నీ చెట్టుకు కట్టేసి తల్లి, కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement