
దియోరియో : మొబైల్ ఫోన్ చోరీ కేసులో ఓ వ్యక్తిపై అమానుషంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేసి వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫోన్ చోరీ చేశాడనే ఫిర్యాదుపై సుమీత్ గోస్వామీని మహెన్ గ్రామంలో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు అతడిని కిందపడవేసి ముఖంపై బూట్లతో తన్ని అమానుషంగా ప్రవర్తించిన వీడియో వైరల్‌గా మారింది. గోస్వామిని ముగ్గురు కానిస్టేబుళ్లు చితకబాదుతూ కనిపించిన ఈ వీడియోను పరిగణనలోకి తీసుకున్న సీనియర్ పోలీస్ అధికారి శ్రీపతి మిశ్రా ఘటనపై దర్యాప్తు చేపట్టాలని సీఐని ఆదేశించారు. నివేదిక ఆధారంగా ముగ్గురు కానిస్టేబుళ్లు చంద్రమూలేశ్వర్ సింగ్, లాల్ బిహారి, జితేంద్ర యాదవ్‌లను సస్పెండ్ చేశారు. ఎవరినైనా దారుణంగా హింసించడం ఆమోదయోగ్యం కాదని, ముగ్గురు కానిస్టేబుల్స్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment