
సాక్షి, హైదరాబాద్: నగరంలో మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకి అనుమతి ఇవ్వకపోవడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ట్యాంక్ బండ్‌ను మూసివేశామని పోలీసు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. సిటీలో ఇప్పటి వరకు 200 మంది ఆందోళకారులను అరెస్ట్ చేశామన్నారు. ప్రస్తుతం సిటీ మొత్తం ప్రశాంత వాతావరణం ఉందన్నారు. టీజేఏసీ కార్యకర్తలపై ఓ మహిళ ఏసీపీ బూటు కాలుతో తన్నిన ఘటనపై విచారణ జరిపిస్తామని ఆయన ప్రకటించారు.
కాగా, మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ జరిపి తీరుతామని తెలంగాణ జేఏసీ ప్రకటించిడంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సహా పలువురిని అరెస్ట్ చేశారు.