మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
బిజినేపల్లి రూరల్ : చెట్టు మీదపడి మేకల కాపరి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని శాయిన్‌పల్లి పంచాయతీ ఎర్రగుంట శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన మన్నెంకొండ(30) మేకల కాపరి. తన మేకలను తీసుకుని మంగళవారం ఉదయం ఎర్రకుంట సమీపానికి వెళ్లాడు. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది.
దీంతో మేకలను ఒక చెట్టు కిందికి తోలి తాను మరో చెట్టు కిందికి వెళ్లాడు. అదే చెట్టుకూలి మీద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తర్వాత గమనించిన చుట్టుపక్కల పొలాల రైతులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన మన్నెంకొండ చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment