tree fallen
-
సచివాలయంలో విషాదం.. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: రాష్ట్ర సచివాలయం వద్ద మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పెద్ద చెట్టు హఠాత్తుగా నేలకూలడంతో భద్రతా విధుల్లో ఉన్న మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత(40) సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరో కానిస్టేబుల్ తీ›వ్రంగా గాయపడ్డారు. జార్జ్ కోటలోని సచివాలయం నాలుగో గేట్ వద్ద సీఎం సెల్‌కు కూతవేటు దూరంలో ముత్యాల్‌పేట ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కవిత(40), రాయపేట స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మురుగన్(45) భద్రతా విధుల్లో ఉన్నారు. గాలి వీయడంతో హఠాత్తుగా అక్కడున్న పెద్ద చెట్టు వేళ్లతో సహా నేలకొరిగింది. ఈ ప్రమాదంలో కవిత మరణించారు. మురుగన్ తీవ్రంగా గాయపడ్డారు. చెట్టు కింద చిక్కుకున్న కవిత మృతదేహాన్ని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. గాయపడ్డ మురుగన్‌ను జీహెచ్‌కు తరలించారు. కవిత మృతదేహానికి నివాళులర్పిస్తున్న సీఎం స్టాలిన్ సీఎం నివాళి ఈ ఘటనతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. కవిత కుటుంబానికి సంతాపం తెలిపారు. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. మంత్రులు దురై మురుగన్, శేఖర్ బాబు, డీజీపీ శైలేంద్ర బాబు, చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివ్వాల్‌తో కలిసి రాజీవ్ గాంధీ జీహెచ్‌కు చేరుకుని కవిత మృతదేహానికి నివాళులర్పించారు. ఆమె భర్త పిల్లలను ఓదార్చారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశించారు. కాగా కవిత భర్త సాయిబాబా రైల్వే ఉద్యోగి. వీరికి కుమారులు అరుణ్‌కుమార్(22), విశాల్(15), కుమార్తె స్నేహప్రియ(20) ఉన్నారు. ఈ చెట్టు ఉదయం 9 గంటలకు నేలకొరిగింది. ఆ సమయంలో అధికారులు, సిబ్బంది సచివాలయానికి రాలేదు. అలాగే సీఎం సెల్‌కు విజ్ఞప్తిలు చేసుకునే వాళ్లూ రాలేదు. 10 గంటల అనంతరం చెట్టు నేలకొరిగి ఉంటే పెను ప్రాణనష్టం జరిగి ఉండేదని సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు. చదవండి: (విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా..) -
నీడకోసం వెళ్తే నిండుప్రాణం బలి
బిజినేపల్లి రూరల్ : చెట్టు మీదపడి మేకల కాపరి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని శాయిన్‌పల్లి పంచాయతీ ఎర్రగుంట శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన మన్నెంకొండ(30) మేకల కాపరి. తన మేకలను తీసుకుని మంగళవారం ఉదయం ఎర్రకుంట సమీపానికి వెళ్లాడు. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో మేకలను ఒక చెట్టు కిందికి తోలి తాను మరో చెట్టు కిందికి వెళ్లాడు. అదే చెట్టుకూలి మీద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తర్వాత గమనించిన చుట్టుపక్కల పొలాల రైతులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన మన్నెంకొండ చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
విజయనగరం జిల్లాలో చెట్టుకూలి వ్యక్తి మృతి
అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. జామి మండలం బలరాంపురం గ్రామంలో వర్షాలకు ఓ భారీ వృక్షం కూలిపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. విజయనగరం నుంచి శృంగవరపు కోట, అనకాపల్లి ప్రాంతాలకు రాకకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు, పూసపాటిరేగ మండలం ఎరుకొండలో ఓ ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు వరదనీటిలో కొట్టుకుపోగా స్థానికులు తీవ్రంగా శ్రమించి వారిని కాపాడారు. అస్వస్థతకు గురైన ఆ ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోనాడ గ్రామంలో ఊర చెరువుకు భారీ గండి పడి 50 ఎకరాల్లో వరిపంట పూర్తిగా దెబ్బతింది. అలాగే భోగాపురంలో చెరువుకు గండి పడి రెండు కాలనీలు జలమయం అయ్యాయి. చీపురుపల్లిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని కారణంగా 500 ఎకరాల్లో పత్తి, 350 ఎకరాల్లో వరి నీట మునిగాయి. 150 ఎకరాలలో జొన్న పంటకు అపారనష్టం వాటిల్లింది.