
శ్రీకాకుళం సిటీ: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి బెదిరిం పు కాల్స్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ ఆదివారం తెలిపారు. పార్వతీపురం వేమకోటివారి వీధికి చెందిన మురపాక కాళిదా సుశర్మ, రాయగడ జిల్లా కోమట్లపేట గ్రామానికి చెందిన జోస్యుల శంకరరావులు ఫోన్ ద్వారా బెదిరింపులకు పా ల్పడుతున్నట్టుగా గుర్తించి వీరిని అరెస్టు చేశామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..
గత ఏడాది నుంచే..
గత ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఒక అగంతకుడి నుంచి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి సన్నిహితంగా ఉం డే వ్యక్తికి తొలుత ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఆ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. అంతలోనే ఈ నెల 11న మరోసారి మంత్రిని బెదిరిస్తూ అదే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను చంద్రన్న దళంలో సభ్యుడినని పే ర్కొంటూ మంత్రిని చంపడానికి పథకం వేసినట్లు హెచ్చరించారు. అందులో భాగంగా మినిస్టర్ ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతంలో బాంబులు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ బెదిరింపులతో పోలీసులు నిఘా పెంచారు.
ప్రమాదాల నియంత్రణకు పెట్టిన టైర్లలోనే..
మంత్రికి ప్రాణహాని ఉందని ఫోన్‌కాల్ వచ్చిన నేపథ్యంలో ఐదు పోలీస్ పార్టీలను అప్రమత్తం చేశామని ఎస్పీ తెలిపారు. బీడీ టీం, ఆర్‌వోపీ పార్టీలను వివిధ ప్రదేశాలకు పంపిం చామన్నారు. నిమ్మాడ చుట్టుపక్కల బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేయించామన్నారు. అందులో భాగంగా కోటబొమ్మాళి ఎస్‌ఐ, పై పార్టీలతో తనిఖీ చేస్తుండగా టెక్కలి నుంచి నరసన్నపేట వైపు ఎన్‌హెచ్ 16 రోడ్డులో పెద్దబమ్మిడి జంక్షన్ వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన టైర్లలో ప్రమాదకర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారని ఎస్పీ తెలిపారు.
ఫేక్‌సిమ్ ఆధారంగా..
జేకే పేపరు మిల్లు సెల్‌పాయింట్ వద్ద శంకరరావు ఈ నెల 7న ఒక ఫేక్‌సిమ్‌ను తీసుకున్నాడు. కూలీల ద్వారా ఒడిశాలోని మాలిగా క్వారీ ప్రదేశం నుంచి 13 స్లర్రీ పేలుడు పదార్థాలు, 13 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను శంకరరావు తెప్పించినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపా రు. ఈ నెల 11న నిమ్మాడ వద్ద గల ఎన్‌హెచ్–16 రోడ్డుపై టైర్లలో 8 స్లర్రీ పేలుడు పదార్థాలు, 8 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను అమర్చి, ఆ ఫొటోలను శంకరరావు అతని గురువైన మురపాక కాళిదాసుకు వాట్సాప్‌లో పంపించిన విషయాన్ని ఎస్పీ వివరించారు.
జ్యోతిష్యంలో డబ్బులు సంపాదించాలనే..
జ్యోతిష్యంలో బాగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇలాంటి చర్యకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. జ్యోతిష్యం కోసం వీరి వద్దకు వచ్చే వారికి ఏదో చెడు ఉందని వారిలో భయం కల్పించడం, శాంతిపూజలు చేయించి మంచి జరిగేటట్లు చేయిస్తానని నమ్మించేవారని చెప్పారు. వీరి పథకంలో భాగంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి ఏదో కీడు ఉందని చెప్పి బాగా డబ్బులు సంపాదించాలని వీరి ద్దరూ భావించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
అరెస్టు చేశారిలా..
జోస్యుల శంకరరావు(ఏ2)ను మెళియాపుట్టి జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ చెప్పారు. అతని గురువు మురపాక కాళిదాసు (ఏ1)ను పార్వతీపురం ఆశ్రమంలో ఆదివారం అరెస్టు చేశామన్నారు. ఈ కేసును చాకచక్యంగా సాధించిన టెక్కలి సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.సమావేశంలో శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు, టెక్కలి డీఎస్పీ రాఘవ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment