
సాక్షి, నిజామాబాద్: పట్టణంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాధవనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో వర్ష అనే అమ్మాయి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల భవనంపై నుంచి దూకి సోమవారం ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన వర్షను కళాశాల యాజమాన్యం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment