భర్తను ఉరేసి చంపిన ఇద్దరు భార్యలు.. | Two wives killed her  husband in Hyderabad | Sakshi
Sakshi News home page

విసిగి పోయారు.. ఉరేసి చంపారు !

Published Sun, Nov 19 2017 11:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

Two wives killed her  husband in Hyderabad - Sakshi - Sakshi - Sakshi

హైదరాబాద్‌: ఓ వ్యక్తి ఒక్కరిని కాకుండా ఇద్దరి భార్యలను కట్టుకున్నాడు. వారిని ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేసేవాడు. చివరికి అతను ఇద్దరి భార్యల చేతిలో హతమయ్యాడు. నగర శివారులోని జగద్గరిగుట్టలోని అస్బెస్టాస్‌ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలివి.. మహేందర్‌ యాదవ్‌ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. కాగా.. తన ఇద్దరు భార్యలు జ్యోతి, పద్మలను మహేందర్‌ ఇటీవల వేధింపులకు గురిచేసేవాడు.  రోజూ కూలి పని చేసి మద్యం సేవించి ఇంటికి వచ్చి మహేందర్‌ భార్యలను కొట్టేవాడు. శనివారం రాత్రి కూడా కొట్టడంతో అతని బాధ నుంచి తప్పించుకోవడానికి వారిద్దరూ ఒక్కటైయ్యారు.

ఇద్దరు భార్యలు కలిసి భర్తకు ఎదురు తిరిగి చున్నీని గొంతకు బిగించి హత్య చేశారు. అతడు మృతి చెందలేదన్న అనుమానంతో కిరోసిన్‌ పోసి తగులబెట్టారు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసలు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఏసీపీ గోవర్ధన్‌, సీఐ శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఐదు మంది కొడుకులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement