
హతమైన జ్యోతి, ఆత్మహత్య చేసుకున్న రాముడు
గోస్పాడు (కర్నూలు): రోకలి బండతో కొట్టడంతో కోడలు మృతి చెందగా.. భయపడి మామ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. శిరివెళ్ల సీఐ యుగంధర్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. యాళ్లూరు గ్రామానికి చెందిన నన్నూరి రాముడు (60) కుమారుడు శ్రీనివాసులుకు నంద్యాలకు చెందిన జ్యోతి(30)కి 11ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు.
శ్రీనివాసులు ఇంట్లోలేని సమయంలో రాముడు తాగిన మైకంలో కోడలిని రోకలిబండతో కొట్టాడు. ఈ క్రమంలో ఆమె మృతి చెందింది. భయపడిన రాముడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాముడి భార్య కూడా ఏడాది క్రితమే మృతి చెందింది. వీరు కూలీపని చేసుకొని జీవనం సాగించేవారు. ఉన్నట్లుండి ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment