attak case
-
మమతపై దాడి.. నేడు ఈసీ నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఈనె 10వ తేదీన జరిగిన దాడి ఘటనపై ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ నుంచి, ఎన్నిల పరిశీలకుల నుంచి శనివారం నివేదికలు అందాయని వెల్లడించింది. వీటిపై ఆదివారం సమావేశమై చర్చించి, ఒక నిర్ణయం ప్రకటిస్తామని ప్రకటించింది. దాడి ఘటనపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక సమగ్రంగా లేదని తెలిపింది. మమతా బెనర్జీపై దాడి నేపథ్యంలో ఆ రాష్ట్రానికి శుక్రవారం ఈసీ ఇద్దరు ఎన్నికల పరిశీలకులను కూడా పంపించింది. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన మమతా బెనర్జీపై దాడి ఘటన అనుకోకుండా జరిగిందే తప్ప, ఉద్ధేశపూర్వకంగా చేసింది కాదని బెంగాల్‌కు పంపించిన ఇద్దరు పరిశీలకులు తమ నివేదికలో పేర్కొన్నారు. మమతకు సమీపంలోకి పెద్ద గుంపు చొచ్చుకు రావడంతో ఆమె గాయపడ్డారనీ, ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న ఈ పరిణామాన్ని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. దీని వెనుక కుట్రకోణమేదీ లేదని తేల్చారు.OK -
హార్దిక్ పటేల్‌కు సుప్రీంషాక్
న్యూఢిల్లీ: పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్(25)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2015 నాటి దాడి కేసులో ఆయన దోషిత్వంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆయన ఆశలు నీరుగారినట్లే. 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ మెహ్సనా జిల్లా పోలీసులు కేసులువేశారు. 2018లో విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను కొట్టేసిన కోర్టు.. దోషిత్వాన్ని అలాగే ఉంచింది. మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్.. జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వ్యక్తి(దోషిత్వంపై న్యాయస్థానం స్టే ఇవ్వని పరిస్థితుల్లో) ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. -
తాగిన మైకంలో మామ కోడలి పై...
గోస్పాడు (కర్నూలు): రోకలి బండతో కొట్టడంతో కోడలు మృతి చెందగా.. భయపడి మామ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. శిరివెళ్ల సీఐ యుగంధర్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. యాళ్లూరు గ్రామానికి చెందిన నన్నూరి రాముడు (60) కుమారుడు శ్రీనివాసులుకు నంద్యాలకు చెందిన జ్యోతి(30)కి 11ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. శ్రీనివాసులు ఇంట్లోలేని సమయంలో రాముడు తాగిన మైకంలో కోడలిని రోకలిబండతో కొట్టాడు. ఈ క్రమంలో ఆమె మృతి చెందింది. భయపడిన రాముడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాముడి భార్య కూడా ఏడాది క్రితమే మృతి చెందింది. వీరు కూలీపని చేసుకొని జీవనం సాగించేవారు. ఉన్నట్లుండి ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై ఆప్ ఎమ్మెల్యేల దాడి కేసులో ఆధారాలను సేకరించేందుకు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సీఎం ఇంట్లో సీఎస్‌పై దాడి జరిగినట్లుగా చెబుతున్న గదిలో సీసీటీవీ కెమెరా లేదు. సోదాలకు వస్తున్నట్లు సీఎం ఇంట్లోని సంబంధిత వ్యక్తికి ముందుగానే సమాచారమిచ్చామన్నారు. కేజ్రీవాల్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశముందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ కూడా సంకేతాలిచ్చారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించారు.. ఢిల్లీ పోలీసులు కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా మారారనీ, సీఎం నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి రౌడీల్లా వ్యవహరించారని ఆప్ ఆరోపించింది. సీఎంను అవమానించడానికే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారంది. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆదేశం లేకుంటే పోలీసులు అలాంటి దాదాగిరి చేసి ఉండేవారు కాదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేస్తూ ‘పెద్ద పోలీసు బలగాన్ని మా ఇంటికి పంపారు. మరి న్యాయమూర్తి లోయా మృతి కేసులో అమిత్ షాను ఎప్పుడు ప్రశ్నిస్తారు?’ అని అన్నారు. ఆప్ ప్రభుత్వంతో కలసి పనిచేసేలా ఉద్యోగులను ఆదేశించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కేజ్రీవాల్ కోరారు. కాగా, అరెస్టైన ఎమ్మెల్యేల బెయిల్ అభ్యర్థనలను స్థానిక కోర్టు కొట్టివేసింది. కాగా, ప్రజోపయోగ పనులకు అడ్డొచ్చే అధికారులను కొట్టాల్సిందేనని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేశ్ బాల్యన్ వ్యాఖ్యానించారు. -
ఆప్ ఎమ్మెల్యేల అరెస్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్‌పై దాడి కేసుకు సంబంధించి ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్‌ను గతరాత్రి బాగా పొద్దుపోయాక, మరో ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను బుధవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేల అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. అరెస్టైన ఎమ్మెల్యేల్లో ఒకరు దళితుడు, మరొకరు ముస్లిం కాబట్టే వారినే బీజేపీ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. ఆప్ ఎమ్మెల్యేలు సీఎం సమక్షంలోనే తనను కొట్టారని అన్షు ప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తమ పార్టీ ప్రతిష్టను మసకబార్చేందుకే బీజేపీ సీఎస్‌ను అడ్డం పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ పౌర సరఫరాల మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, ఆయన సహాయకుడిపై సచివాలయంలో ఉద్యోగులు దాడిచేయగా ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం విదితమే. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఆధారం ఉన్నా పోలీసులు ఇంకా ఏ చర్యలూ తీసుకోలేదనీ, కానీ సీఎస్ ఆరోపణలకు ఆధారాల్లేకుండానే తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. మరోవైపు సీఎస్ తలపై స్పల్ప గాయాలున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. -
రౌడీల బీభత్సం కేసులో మరో ఎనిమిది మంది అరెస్ట్
ప్రధాన నిందితుడు బాబా సహా మరో ఆరుగురి కోసం గాలింపు, అమలాపురం టౌన్ : అమలాపురంలో ఓ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన కేసులో పట్టణ పోలీసులు మరో ఎనిమిది మంది నిందితులను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆ ఎనిమిది మంది కాకినాడ ప్రాంతంలోని గొడారిగుంటకు చెందిన వారే. వీరందరూ కిరాయి నేరస్తులుగా భావిస్తున్నారు. డీఎస్పీ లంక అంకయ్య, పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ స్థానిక పట్టణ పోలీసు కంట్రోల్ రూమ్‌లో విలేకర్ల ముందు హాజరుపరచి వారి వివరాలను వెల్లడించారు. సురాడ రాము, సింగలూరి భద్రం, సూరంపూడి రామకృష్ణ, కచ్చా రాజు, దడాల దుర్గాప్రసాద్, గుబ్బల మూర్తి, గుత్తుల దుర్గాప్రసాద్, కమిడి వీర వెంకట సత్యనారాయణలను అరెస్ట్ చేసి చేశామని...వీరిని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 35 మందిపై కేసులు నమోదు చేయగా ఇప్పటి వరకూ 29 మందిని అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు తోట పుండరీకాక్షుడు అనే బాబితో సహా మరో ఆరుగురు నిందితులు గూడా జానకి రామాంజనేయులు, సూరంపూడి రమణ, నాగు, సత్యంకాపు, గింజాల సింహాద్రిరాజులను అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఈ కేసులో ఎ–2,3,4,8,24,25,26,35లపై ఇప్పటికే కాకినాడ సర్పవరం ప్రాంతంలో భూ కబ్జా కేసులు ఉన్నాయని సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
రౌడీల బీభత్సం కేసులో 20 మంది అరెస్టు
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు పరారీలో ప్రధాన నిందితుడు తోట బాబితో సహా మరో 11 మంది మారణాయుధాలు, గునపాలు, సమ్మెటలు స్వాధీనం అమలాపురం టౌను: అమలాపురంలో ఓ ఇంటిని, అందులోని ప్రింటింగ్ ప్రెస్‌ను ధ్వంసం చేసిన కేసులో 20 మంది నిందితులను పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఈనెల 16 వరకూ రిమాండు విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్‌జైల్‌కు తరలించారు. అరెస్ట్‌కు ముందు డీఎస్పీ లంక అంకయ్య, సీఐలు వైఆర్కే శ్రీనివాస్, జి.దేవకుమార్‌లు, ఎస్సైలు నిందితులను, వారి నుంచి స్వాధీనం చేసుకున్న రెండు ఇన్నోవా కార్లు, మారణాయుధాలు, గునపాలు, సమ్మెటలను విలేకర్లకు చూపించారు. పోలీసులు మొత్తం 31 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో ప్రధాన నిందితుడైన తోట పుండరీకాక్షుడు అనే బాబితో పాటు మరో పది మంది పరారీలో ఉన్నారు. ఘటన స్థలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న 20 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. డీఎస్పీ అంకయ్య ఆ 20 మంది పేర్ల జాబితాను విలేకర్లకు విడుదల చేశారు. కాకినాడ ప్రాంతానికి చెందిన యాళ్ల రాజు (రౌడీ షీటర్), వాసంశెట్టి శ్రీనివాస్, బళ్ల సూరిబాబు, పోలిశెట్టి సురేంద్రకుమార్, ఎలిపే మేఘ శ్యామ్, షేక్ అల్థాఫా, అయినవిల్లి వీర్రాజు, సూరంపూడి సురేష్, లూటుకుర్తి మోహనరావు, తలారి సుబ్రహ్మణ్యం, చాపల జయానందరాజు, కాండ్రేగుల రంగారావు, కొండెల బంగార్రాజు, అమలాపురానికి చెందిన గూడా శ్రీరామాంజనేయులు, గూడా వెంకట రమణ సీతారామాంజనేయులు, గూడా రాధాకృష్ణ నరసింహ సీతారామాంజనేయులు, గంగవరం మండలం వెంకటాయపాలేనికి చెందిన తోట తేజోమూర్తి, అమలాపురానికి చెందిన ఉపాధ్యాయుడు ఆచంట వీర వెంకట సత్యనారాయణమూర్తిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ అంకయ్య వెల్లడించారు. ఒకే ఆస్తికి రెండు రిజిస్ట్రేషన్లపై ఆరా గూడా రామాంజనేయులుకు చెందిన ఇంటిని సగం విక్రయం ద్వారా ప్రింటింగ్ ప్రెస్ యాజమాని కాళ్లకూరి బుజ్జికి పక్కాగా రిజిస్టర్ చేశారు. అదే ఆస్తిని రామాంజనేయులు సోదరులు, సోదరి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆచంట వీర వెంకట సత్యనారాయణ పేరున ఎలా రిజిస్టర్ చేశారన్న విషయాన్ని, అలాగే ఆయన నుంచి తోట తేజోమూర్తికి అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలా రిజిస్టర్ చేశారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత ఏడాది అంబాజీపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్‌పైనా డీఎస్పీ లంక అంకయ్య ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన సత్యనారాయణమూర్తిపై చర్యలు తీసుకునేలా అతనిపై పోలీసులు జిల్లా విద్యా శాఖకు లేఖ రాశారు. మారణాయుధాలు, హత్యాయత్నం కేసులో ఇప్పటికే ఉపాధ్యాయుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయనను విద్యా శాఖ సస్పెండ్ చేయనుంది.