- ప్రధాన నిందితుడు బాబా సహా మరో ఆరుగురి కోసం గాలింపు,
రౌడీల బీభత్సం కేసులో మరో ఎనిమిది మంది అరెస్ట్
Published Sun, Dec 4 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
అమలాపురం టౌన్ :
అమలాపురంలో ఓ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన కేసులో పట్టణ పోలీసులు మరో ఎనిమిది మంది నిందితులను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆ ఎనిమిది మంది కాకినాడ ప్రాంతంలోని గొడారిగుంటకు చెందిన వారే. వీరందరూ కిరాయి నేరస్తులుగా భావిస్తున్నారు. డీఎస్పీ లంక అంకయ్య, పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ స్థానిక పట్టణ పోలీసు కంట్రోల్ రూమ్‌లో విలేకర్ల ముందు హాజరుపరచి వారి వివరాలను వెల్లడించారు. సురాడ రాము, సింగలూరి భద్రం, సూరంపూడి రామకృష్ణ, కచ్చా రాజు, దడాల దుర్గాప్రసాద్, గుబ్బల మూర్తి, గుత్తుల దుర్గాప్రసాద్, కమిడి వీర వెంకట సత్యనారాయణలను అరెస్ట్ చేసి చేశామని...వీరిని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 35 మందిపై కేసులు నమోదు చేయగా ఇప్పటి వరకూ 29 మందిని అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు తోట పుండరీకాక్షుడు అనే బాబితో సహా మరో ఆరుగురు నిందితులు గూడా జానకి రామాంజనేయులు, సూరంపూడి రమణ, నాగు, సత్యంకాపు, గింజాల సింహాద్రిరాజులను అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఈ కేసులో ఎ–2,3,4,8,24,25,26,35లపై ఇప్పటికే కాకినాడ సర్పవరం ప్రాంతంలో భూ కబ్జా కేసులు ఉన్నాయని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Advertisement