
సాక్షి, హైదరాబాద్ : నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ట్రాఫిక్ ఎస్సైని అసభ్య పదజాలంతో దూషిస్తూ నగరానికి చెందిన యువతి వీరంగం సృష్టించారు. గురువారం జరిగిన ఈ ఘటనను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే... నగరానికి చెందిన ఓ యువతి రాంగ్ రూట్‌లో వస్తూండటాన్ని గమనించిన అబిడ్స్ ట్రాఫిక్ ఎస్సై ఆమెను ఆపారు. హెల్మెట్ కూడా ధరించకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ బైక్ పక్కన పెట్టాల్సిందిగా సూచించారు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె ఎస్సైను బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించారు. నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టే ఆపామని చెప్తున్నా వినకుండా మరింతగా రెచ్చిపోయారు. దీంతో ఆమె బైక్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు యువతికి లైసెన్స్ కూడా లేకపోవడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నాలుగు కేసులు నమోదు..
తన బైక్‌ను తీసుకు వెళ్లేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆ యువతి అక్కడ కూడా దురుసుగా ప్రవర్తించినట్లు ఎస్సై సుమన్ తెలిపారు. ఆమెపై నాలుగు కేసులు నమోదు చేశామని, త్వరలోనే చార్జిషీట్ కూడా ఫైల్ చేస్తామని పేర్కొన్నారు. అయితే జరగాల్సిన నష్టమంతా జరిగి పోయిన తర్వాత ఆమె పోలీసులకు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment