
సాక్షి,తూర్పు గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో మహిళ. హత్య జరిగిన 15 రోజుల తర్వాత ఇందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ బయటపడటంతో భార్య వివాహేతర సంబంధం, హత్య గుట్టు రట్టయింది. ఈ సంఘటన సఖినేటిపల్లి మండలం ఉయ్యూరు వారి మెరకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఊయ్యూరి వారి మెరకకు చెందిన ఉప్పు ప్రసాద్‌కు కొన్ని సంవత్సరాల క్రితం ప్రశాంతితో వివాహం అయింది. అయితే ఆమెకు అదే ప్రాంతానికి చెందిన చొప్పల్ల శివతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడు చొప్పల్ల శివ సహకారంతో భర్తకు స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చి చంపింది. ( ప్రియుడి ఇంటి ముందు ధర్నా)
ఈ నెల రెండో తారీఖున అర్ధరాత్రి 12:50 నిమిషాలకు అతడు చనిపోవడంతో సహజ మరణంగా భావించిన బంధువులు ఖననం చేశారు. అయితే పదిహేను రోజుల తర్వాత కుటుంబసభ్యుల ద్వారా హత్య చేసిన విధానానికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో గ్రామస్థులు కాల్ రికార్డింగ్స్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడు చొప్పెల్ల శివని, ప్రశాంతిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. మృతుడు ఉప్పు ప్రసాద్ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. (యువతిని వలగా వేసి దారుణ హత్య)
Comments
Please login to add a commentAdd a comment