ఆమె అతడి నాలుక కొరికేసింది | Woman Doctor Bites Off Mans Tongue South Africa | Sakshi
Sakshi News home page

ఆమె అతడి నాలుక కొరికేసింది

Published Thu, Jun 6 2019 8:11 PM | Last Updated on Thu, Jun 6 2019 8:22 PM

Woman Doctor Bites Off Mans Tongue South Africa - Sakshi

కేప్‌టౌన్‌ : తనపై లైంగిక దాడికి దిగిన ఓ మృగాడి నాలుకను కొరికేసిందో మహిళా డాక్డర్‌. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ ఫౌంటైన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్లూమ్‌ ఫౌంటైన్‌లోని  పెలొనోమి టెర్టియారీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్‌ సోమవారం రాత్రి హాస్పిటల్‌లోని స్టాఫ్‌ క్వాటర్స్‌లో నిద్రపోయింది. అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి స్టాఫ్‌ రూంలో నిద్రపోతున్న ఆమెను చూశాడు. వెంటనే గదిలోకి దూరి ఆమెపై లైంగిక దాడికి దిగాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించినప్పటికి వదలలేదు.

అతడు నాలుక బయటకు చాపి ఆమెను ముద్దు పెట్టుకోవటానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అతడి నాలుకను కొరికి పడేసింది. దాదాపు సగం నాలుక తెగిపోవటంతో చావుకేకలు పెట్టాడతను. ఆ అరుపులతో అక్కడకు చేరుకున్న హాస్పిటల్‌ సిబ్బంది అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడినుంచి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు చికిత్స అనంతరం అతడ్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీస్‌ అధికారుల పర్యవేక్షణలో అతడి నాలుకకు సర్జరీలు జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement