అత్తారింటికి వెళ్తే.. మర్మాంగాన్ని కోసేశారు | Woman Murder Attempted Her Husband In Kurnool | Sakshi
Sakshi News home page

అత్తారింటికి వెళ్తే.. మర్మాంగాన్ని కోసేశారు

Published Fri, Sep 20 2019 8:07 AM | Last Updated on Fri, Sep 20 2019 8:10 AM

Woman Murder Attempted Her Husband In Kurnool - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు: భార్యను కాపురానికి తీసుకెళ్లడం కోసం అత్తారింటికి వెళ్లిన ఓ యువకుడి మర్మాంగం కత్తిరించి కారంపొడితో దాడి చేసి ఘటన గడివేముల మండలం సోమాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..పాణ్యం మండలం ఎస్‌.కొట్టాల గ్రామానికి చెందిన యునూస్‌కు సోమాపురం గ్రామానికి చెందిన హసీనాతో రెండేళ్ల క్రితం వివాహమైంది.

మనస్పర్థలతో హసీనా తరచూ పుట్టింటికి వెళ్లేది. ఈ క్రమంలో బక్రీద్‌ పండగరోజు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం రాత్రి పోలీసులు యునూస్‌ తీసుకొని సోమాపురం వెళ్లారు. హసీనాను కాపురానికి తీసుకెళ్లాలని సూచించి వెళ్లిపోయారు. అయితే రాత్రి మంచంపై పడుకున్న యునూస్‌ కాళ్లు, చేతులను హసీనా, ఆమె సోదరుడు కట్టివేశారు. హసీనా కత్తెర తీసుకుని యునూస్‌ మర్మాంగాన్ని కత్తిరించగా..ఆమె సోదరుడు నోరు మూశాడు. యునూస్‌ ప్రతిఘటించటంతో హసీనా సోదరుడు రోకలి బండతో తలపై మోదాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతనిపై కారం చల్లి ఇష్టానుసారంగా దాడి చేశారు.

తెల్లవారగానే  చేతులకు,కాళ్లకు ఉన్న కట్లు ఊడదీసుకుని అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎస్‌.కొట్టాలకు చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మర్మాంగం నరాలు తెగిపోయాయని శస్త్రచికిత్స నిర్వహిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గడివేముల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  చదవండి : మూఢనమ్మకం మసి చేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement