Kurnool Crime News
-
దారుణం: ఆస్తి కోసం తల్లిని హత్య చేశాడు
సాక్షి, బనగానపల్లె(కర్నూల్): పెంచిన మమకారాన్ని మరచి, ఆస్తి కోసం తల్లినే హత్య చేశాడు ఓ కుమారుడు. ఈ దారుణం బనగానపల్లె మండలం మిట్టపల్లె గ్రామంలో గురువారం వెలుగు చూసింది. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపిన వివరాల మేరకు..నార్పరెడ్డిగారి పుల్లమ్మ(58)కు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఈమె భర్త రామచంద్రారెడ్డి అనారోగ్యంతో 18 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కుమారుడు, ఇద్దరు కుమార్తెలను పుల్లమ్మ పెంచి, పోషించి..వివాహం చేసింది. వృద్ధాప్యంలో కుమారుడు ప్రసాద్ రెడ్డి వద్ద ఉంటోంది. తల్లి పేరున ఉన్న పొలంలో మూడు ఎకరాలను ఇటీవల ప్రసాద్ రెడ్డి ఎకరా రూ.35 లక్షల చొప్పున విక్రయించాడు. వచ్చిన డబ్బుతో నిత్యం మద్యం తాగేవాడు. ఆస్తంతా తన పేరున రాయాలని తల్లితో వాగ్వాదానికి దిగేవాడు. ప్రసాద్ రెడ్డి భార్య అపర్ణ కాన్పుకోసం ఇటీవల పుట్టినిల్లు అయిన అవుకు మండలం మెట్టుపల్లెకు వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం తలుపు వేసి తల్లి పుల్లమ్మను దారుణంగా కత్తితో పొడిచాడు. తల్లి మృతి చెందడంతో ఇంటికి తలుపు వేసి పరారయ్యాడు. ప్రసాదరెడ్డి కోసం గురువారం బనగానపల్లె నుంచి మిట్టపల్లెకు వచ్చిన ఒక వ్యక్తి ఇంటి తలుపు తట్టి చూడగా.. పుల్లమ్మ రక్తపు మడుగులో కనిపించింది. ఇరుగు పొరుగు వారికి తెలియజేయగా..వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సురేష్ కుమార్‌రెడ్డి, ఎస్ఐ మహేష్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. హత్యకు పాల్పడిన ప్రసాదరెడ్డి తనకు ఏమీ తెలియనట్లు ఇంటి వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తమదైన శైలిలో ఆయనను ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. -
అనుమానిస్తున్నాడని భర్తను గొడ్డలితో నరికింది
సాక్షి, బేతంచెర్ల (కర్నూలు): తాళికట్టిన భర్తనే భార్య కడతేర్చింది. గాఢ నిద్ర లో ఉన్న అతడిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి హతమార్చింది. అనంతరం స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గోర్లగుట్ట గ్రామానికి చెందిన రామదాసు, సుంకులమ్మ కుమారుడు వడ్డె చిన్న ఆంజనేయులు(35)కు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన నరసింహుడు, లక్ష్మిదేవి కూతురు ధనలక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తెలు పూజిత, వర్షిణి, కుమారుడు హేమంత్ ఉన్నారు. పాలీస్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. కాగా కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న వడ్డె ఆంజనేయులు తాగుడుకు బానిసై వేధించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో మంగళవారం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తను భార్య గొడ్డలితో విచక్షణారహితంగా నరికి హత్య చేసింది. అనంతరం స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కాగా ఈ విషయం పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. సీఐ కేశవరెడ్డి, ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. (చదవండి: మహిళల భద్రత మా బాధ్యత) -
పొలానికి వెళ్లి.. శవమైంది
గోనెగండ్ల: పొలానికి వెళ్లిన ఓ యువతి ఇంటికి చేరకుండానే శవమైంది. కంపచెట్లలో విగతజీవిగా పడి ఉండటం చూసి, సోదరులు, తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని ఎర్రబాడు గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఉసేన్‌సాహెబ్, బేగంబీలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు. అందులో భాగంగా సోమవారం కుటుంబ సభ్యులందరూ పొలానికి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. అయితే కాస్త ముందుగా బయలుదేరిన చిన్న కూతురు హజరాబీ(23) ఇంటికి చేరలేదు. కంగారు పడిన సోదరులు దగ్గరి బంధువు ఉదూద్బాషాతో కలిసి పొలానికి వెళ్లి గాలించారు. కాస్త దూరంలో కంప చెట్లలో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా పడి ఉండటం చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న కర్నూలు డీఎస్పీ వెంకటరామయ్య, ట్రైనీ డీఎస్పీ భవ్యకిషోర్, కోడుమూరు సీఐ పార్థసారథి రెడ్డి, గోనెగండ్ల ఎస్ఐ హనుమంతరెడ్డి మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లి విచారించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతురాలి సోదరుడు దూద్‌వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. -
నెల క్రితం వివాహం.. వధువు మృతి
కర్నూలు,ఆదోని రూరల్: మండల పరిధిలోని గణేకల్ గ్రామానికి చెందిన నవ వధువు జయలక్ష్మి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పెద్దతుంబళం ఎస్ఐ చంద్ర తెలిపారు. గ్రామానికి చెందిన పెద్ద ఎల్లప్ప కూతురు జయలక్ష్మిని కౌతాళం మండలం మల్లనహట్టి గ్రామానికి చెందిన లక్ష్మన్నతో నెల క్రితం వివాహం జరిపించారు. జయలక్ష్మి కడుపునొప్పి తాళలేక శనివారం ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వైద్యులు రెఫర్ చేయగా అక్కడ కోలుకోలేక మృతిచెందిందని ఎస్ఐ వివరించారు. -
‘తుంగబద్రంత్త' విషాదం
కర్నూలు, మంత్రాలయం రూరల్: భార్యాభర్త, ముగ్గురు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం.. విధి చూసి ఓర్వలేకపోయింది. రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. కుటుంబ యజమానిని ఒంటరి చేస్తూ.. భార్యను, ముగ్గురు పిల్లలను తీసుకెళ్లిపోయింది. ఈ ఘటన మంత్రాలయానికి సమీపంలోని తుంగభద్ర గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా తుంగభద్ర గ్రామానికి చెందిన గురుస్వామి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి శనివారం ఉదయం ఎమ్మిగనూరులోని సోదరి జయమ్మ ఇంటికి వెళ్లి వస్తుండగా మంత్రాలయం శివారులో బైక్ అదుపు తప్పి ఇనుప దిమ్మెను ఢీకొన్న ఘటనలో గురుస్వామి కుమారుడు మహేష్(4) అక్కడికక్కడే మరణించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో గాయపడిన భార్య నాగవేణి (26), కుమార్తెలు మౌనిక(7), శైలజ (3) కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక కొన్ని గంటల తేడాతో చనిపోయారు. స్వల్పగాయాలతో బయటపడిన గురుస్వామి ఒంటరిగా మిగిలాడు. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న అతను రోదించిన తీరు పలువురిని కలచివేసింది. మృతదేహాలను ఆదివారం కర్నూలు నుంచి ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్ ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. బైక్ అదుపుతప్పి వేగంగా నల్లవాగు బ్రిడ్జిపైఉన్న ఇనుప దిమ్మెను ఢీకొట్టడమే ఈ ఘోరానికి కారణమని వారు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎస్పీతో పాటు మంత్రాలయం సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు వేణుగోపాల్రాజ్, బాబు తదితరులు ఉన్నారు. -
లగ్నపత్రిక రాయించేందుకు వెళ్తూ..
పత్తికొండ రూరల్: కుమార్తె పెళ్లికి లగ్నపత్రిక రాయించేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో ఎదురొచ్చి కాటువేసింది. పత్తికొండ మండలం అటికెలగుండు బ్రిడ్జి సమీపంలో సోమవారం ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన వీరేశప్ప (50)తన రెండో కుమార్తెకు దేవనకొండ మండల వాసితో వివాహం నిశ్చయించారు. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామంలో అర్చకుడిని కలిసి లగ్నపత్రిక రాయించాలని బంధువు మహాలింగను వెంటబెట్టుకుని బైక్‌లో బయలుదేరాడు. మార్గమధ్యంలో అటికెలగుండు బ్రిడ్జి సమీపంలోని మలుపు వద్ద బోర్‌వెల్స్ లారీ ఎదురొచ్చి బైక్‌ను ఢీకొంది.ఈ ఘటనలో వీరేశప్ప అక్కడికక్కడే మృతిచెందగా మహాలింగకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గుర్రప్ప తెలిపారు. కాగా మృతుడు వీరేశప్పకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. అతని మరణ విషయం తెలియగానే వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. -
మరదలిని చంపిన బావ
నందికొట్కూరు: సొంత తమ్ముడి భార్య, మరదలు అని కూడా చూడకుండా గొడ్డలితో నరికి చంపాడు ఓ వ్యక్తి. మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ జయశేఖర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిన్న ఏసన్న, పుష్పరాజు అన్నదమ్ములు. ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా వివాదం ఉంది. ఇదే విషయమై తమ్ముడి భార్య శ్రీలేఖ(35)తో చిన్న ఏసన్న శుక్రవారం గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడై గొడ్డలితో మెడపై విచక్షణా రహితంగా నరికాడు. రక్తపు మడుగులో పడివున్న బాధితురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యపై కత్తితో దాడి: తానూ ఆత్మహత్యాయత్నం ఆళ్లగడ్డ: భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న మనస్పర్థలు చివరికి ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. పట్టణంలోని ఎస్వీ నగర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఘటన వివరాలు సీఐ సుబ్రమణ్యం తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి.. ఎస్వీ నగర్లో అల్లూరి కిరణ్, సుబ్బమ్మ దంపతులు నివసిస్తున్నారు. సుబ్బమ్మ పుట్టినిల్లు కూడా ఇదే నగర్ కావడంతో రోజూ తల్లిదండ్రుల మాటలు విని.. తనతో గొడవ పడుతుందని భర్త అల్లూరి కిరణ్ క్షణికావేశానికి లోనై భార్యపై కత్తితో దాడి చేశాడు. తానూ కత్తితో ఎడమ చేతికి కోసుకున్నాడు. సుబ్బమ్మ కేకలు వేస్తూ బయటికి రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇద్దరినీ ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రేషన్ బియ్యం మాఫియా డాన్ అరెస్ట్
కోవెలకుంట్ల: కొన్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు గాకుండా రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న మాఫియా డాన్‌ను ఎట్టకేలకు కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్ లో కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు విలేకరు లకు వెల్లడించారు.బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు అలియాస్ డాన్ శ్రీను రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్‌బియ్యాన్ని పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలో కోవెలకుంట్లకు చెందిన స్వామిరెడ్డి, బనగానపల్లెకు చెందిన ఉసేన్‌బాషా లారీలో నుంచి మరో లారీలోకి రేషన్ బియ్యాన్ని మార్పిడి చేస్తుండగా కోవెలకుంట్ల ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. 250ప్యాకెట్ల(125 క్వింటాళ్లు) రేషన్ బియ్యం, రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యానికి సంబంధించి వివరాలు ఆరా తీయగా బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు బియ్యాన్ని తరలించేందుకు మార్పిడి చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. వారిద్దరితోపాటు శ్రీనివాసులు, కొలిమిగుండ్ల మండలం బెలూంకు చెందిన చిన్న ప్రసాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మరోనిందితుడు చిన్న ప్రసాదు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. మిగిలిన ముగ్గురిని కోవిడ్ పరీక్షల అనంతరం బనగానపల్లె మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నట్లు సీఐ వివరించారు. -
భార్య గర్భిణి అని కూడా చూడకుండా..
కర్నూలు ,ఆళ్లగడ్డ: కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్య నిండు గర్భిణి అని కూడా చూడకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు. పెళ్లయిన ఏడాదిలోపే ఈ దారుణానికి ఒడిగట్టాడు. శనివారం రాత్రి ఆళ్లగడ్డ పట్టణ శివారులో ఈ ఘటన జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు వివరాలు.. బనగానపల్లె పట్టణానికి చెందిన సుంకన్న, లక్ష్మీదేవి దంపతుల కూతురు సుస్మిత (19). ఈ యువతి చిన్నతనంలోనే తల్లి మృతి చెందడంతో తండ్రి ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన మస్తానమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. మారు తల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి సుస్మితను నానా ఇబ్బందులు పెట్టేది. భరించలేక ఆమె పిన్నమ్మ, తాతల దగ్గర ఉంటూ ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత మస్తానమ్మ.. భర్తపై ఒత్తిడి చేసి సుస్మితను తన తమ్ముడు ప్రతాప్‌తో పెళ్లి జరిపించింది. చెడు ప్రవర్తన గల మారుతల్లి సుస్మితను కూడా ఆ వైపునకు మలిపేందుకు ప్రయత్నించేది. అందుకు అంగీకరించని ఆ యువతి వారితో కలిసి ఇంట్లో ఉండటం ఇష్టం లేక వేరే కాపురం పెడదామని భర్త ప్రతాప్‌కు వేడుకునేది. దీనిని జీర్ణించుకోలేని మారుతల్లి, అత్తామామలు సుస్మిత గురించి ప్రతాప్‌కు చెడుగా చెప్పేవారు. దీంతో సైకోగా మారిన అతను భార్యను హింసించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యకు మాయమాటలు చెప్పి తన సొంత ఆటోలో ఎక్కించుకుని నల్లగట్ల –బత్తలూరు మార్గంలోని హైవే వద్దకు తీసుకుపోయాడు. అక్కడ అతి కిరాతకంగా భార్య చేతులు కట్టి నరాలు కోసి పక్కనున్న నీటి కుంటలో పడేసి పారిపోయాడు. ఆదివారం నిందితుడే తమ బంధువులకు పోను చేసి హత్య విషయం చెప్పడంతో వారు అక్కడికి వెళ్లి మృత దేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారమిచ్చారు. వెనువెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువులు ఫిర్యాదు మేరకు హతురాలి భర్త ప్రతాప్, బావ భాస్కర్, మారుతల్లి మస్తానమ్మ, అత్తామామలు లక్ష్మీదేవి, వీరయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ రమేష్‌కుమార్ తెలిపారు. -
తల్లిని చంపిన కుమారుడి అరెస్ట్
కర్నూలు,ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని లక్ష్మీపేటలో తల్లిని చంపిన కుమారుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. స్థానిక టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదోని డీఎస్పీ పి.రామక్షృష్ణ, ఎన్నికల స్పెషల్ డీఎస్పీ భవ్యకిశోర్‌ల ఆధ్వర్యంలో ముద్దాయిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ పి.రామకృష్ణ మాట్లాడుతూ పట్టణానికి చెందిన బోయ ఉరుకుందమ్మను కుమారుడు బోయ ఆకుల వీరేష్ అత్యంత కిరాతకంగా బండరాయితో మోది హత్య చేశాడన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి మద్యం తాగి వచ్చి, తన కోర్కె తీర్చాలంటూ వీరేష్ ఈ నెల 11న కన్నతల్లితో గొడవ పడ్డాడన్నారు. మందలించిన తండ్రి, సోదరుడిపై దాడికి యత్నించగా అడ్డుకునేందుకు వెళ్లిన తల్లి తలపై బండ రాయితో మోది హత్య చేశాడన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామన్నారు. సోగనూరు రోడ్డులోని జెడ్పీ హైస్కూల్ వద్ద ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ వాసుదేవ్ రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో టౌన్ సీఐ వి.శ్రీధర్, ఎస్ఐ శ్రీనివాసులు, హెచ్‌సీ సుభాన్, ఖాద్రీ, పీసీలు దశరథరాముడు, సుధాకర్, సమీవుల్లా, రహిమాన్ పాల్గొన్నారు. -
అప్పు ఇచ్చిన వ్యక్తినే అంతమొందించారు
వారిద్దరూ అన్నదమ్ములు. వ్యాపార అవసరాలకు అప్పు కావాలని ఓ వ్యక్తిని సంప్రదించారు. నమ్మకం లేకపోతే పొలం తాకట్టు పెడతామని నమ్మించారు. అంతగా అడుగుతున్నారు కదా అని అతనికి జాలి కలిగింది. పొలం తాకట్టు పెట్టుకుని రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ తర్వాత వారి అసలు రూపం బయట పడింది. అప్పు తిరిగి చెల్లించకుండా ఇచ్చిన వ్యక్తినే అంతమొందించారు. నమ్మి రుణం ఇచ్చిన వ్యక్తిపై ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులుమంగళవారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆళ్లగడ్డ రూలర్: ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు కుమ్మరి శ్రీనివాసులు ఆచారి హత్య కేసు నిందితులను పోలీసు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో డీఎస్పీ పోతురాజు వెల్లడించారు. పెద్దయమ్మనూరు గ్రామానికి చెందిన మూరబోయిన చంద్రమౌళి, సోదరుడు మూరబోయిన నాగరాజు తమ వ్యాపారం నిమిత్తం అదే గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాసులు ఆచారి వద్ద పొలం తాకట్టు పెట్టి ఆరు నెలల క్రితం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నారు. మూడేళ్లలోపు డబ్బు చెల్లిస్తే పొలం వెనక్కి ఇచ్చేలా అగ్రిమెంట్ రాసుకున్నారు. 20 రోజుల క్రితం చంద్రమౌళి మరో రూ.2లక్షలు శ్రీనివాసులు ఆచారి వద్ద అప్పుగా తీసుకున్నాడు. అనంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి అప్పు ఎగ్గొట్టాలనే పన్నాగంతో శ్రీనివాసులు ఆచారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఉయ్యాలవాడకు చెందిన దూదేకుల సుభాన్‌బాషా, అతని తండ్రి దూదేకుల మాబుసుభాని, ఒగరు సుబ్రమణ్యంలతో రూ.2,40,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పు విషయం మాట్లాడదామంటూ ఫోన్.. ఈనెల 1న చంద్రమౌళి, నాగరాజు.. శ్రీనివాసులుఆచారికి ఫోన్ చేశారు. అప్పు విషయం మాట్లాడాలని, ఎక్కడ ఉన్నావని అడిగారు. తాను ఆళ్లగడ్డకు వెళ్తున్నాని, మళ్లీ మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇదే అదునుగా భావించి నిందితులు ఒప్పందం కుదుర్చుకున్న ముగ్గురిని రప్పించుకుని ఐదుగురు కలిసి ఆళ్లగడ్డకు చేరుకున్నారు. అక్కడ శ్రీనివాసులు ఆచారిని కలిశారు. మాట్లాడుకుందామంటూ పాతకందుకూరులోని గోపిరెడ్డి గోడౌన్ సమీపంలోని పంటకాలువ వద్దకు తీసుకెళ్లి పిడబాకులతో పొడిచి హత్య చేశారు. అనంతరం కాలువలో పడేసి వెళ్లారు. కేసును ఛేదించింది ఇలా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అంతలోనే ఉయ్యాలవాడకు చెందిన బడే మస్తాన్ పోలీసులకు లొంగిపోయాడు. చంద్రమౌళి, నాగరాజు తనకు రూ.20 వేలు ఇచ్చి శ్రీనివాసులు ఆచారిని బెదిరించాలని చెప్పారని, తాను అంగీకరించకపోవడంతో వేరేవారితో కలిసి హత్యకు కుట్ర పన్నారని, ఆ విషయం తనకు తెలియడంతో తనను కూడా హత్య చేసుకు ఇరికిస్తారేమోనని ముందుగానే లొంగిపోతున్నానని పోలీసులకు చెప్పాడు. దీంతో నిందితులపై పోలీసులు నిఘా ఉంచారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉండగా వలపన్ని అరెస్ట్ చేశారు. కేçసును 10 రోజుల్లోనే ఛేదించినందుకు పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో రూరల్ సీఐ సుదర్శనప్రసాద్ పాల్గొన్నారు. -
అక్కంపల్లెలో పేలుడు
కర్నూలు, సంజామల: మండలంలోని అక్కంపల్లెలోమంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తికి చెందిన నరేష్‌రెడ్డి అనే కూలీ గాయపడ్డాడు. పాత ఇల్లు తీసేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. అక్కంపల్లెకు చెందిన చెంచిరెడ్డి తన పాత ఇంటిని తీసేసి, నూతన గృహాన్ని కట్టుకోవాలనుకున్నాడు. మంగళవారం ఉదయం నలుగురు కూలీలతో పాత ఇంటిని తొలగిస్తుండగా.. గోడకు ఉన్న గూటిలో ఏదో వస్తువు కనిపించింది. దాన్ని కూలీ నరేష్‌రెడ్డి చేత్తో పట్టుకుని పక్కన పడేశాడు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నరేష్‌రెడ్డి చేతికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే చికిత్స నిమి త్తం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, సంజామల ఎస్ఐ ప్రియతంరెడ్డి పే లుడు జరిగిన ఇంటిని పరిశీలించారు. నాటుబాంబు పేలి ఉండొచ్చనే అనుమానంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్యకు ఫోన్ చేసి.. ఆత్మహత్య
కర్నూలు ,వెల్దుర్తి: చేనేత కార్మికుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ శ్రీనివాసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన రాజ్‌కుమార్(35) వ్యవసాయం కలిసిరాకపోవడంతో అప్పుల పాలై నాలుగేళ్ల క్రితం కోడుమూరు మండల కేంద్రానికి వలస వెళ్లి కులవృత్తి మగ్గం నేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పులకు వడ్డీ ఎక్కువై మొత్తం రూ.7లక్షలకు చేరింది. వాటిని తీర్చే మార్గం లేక బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి బంధువులున్న వెల్దుర్తి పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి భార్య శ్రీదేవికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. ఆమె బంధువులకు ఫోన్‌చేసి అప్రమత్తం చేసింది. వారు అక్కడికి వెళ్లేలోగా రైల్వేట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే ఎస్ఐ మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వివాహిత ఆత్మ‘హత్య’
కర్నూలు, కృష్ణగిరి: ఆరు రోజుల కిత్రం అదృశ్యమైన మహిళ బుధవారం హంద్రీ కాలువలో శవమై తేలింది. మృతురాలి తలపై గాయం ఉండటంతో భర్తే హత్య చేసి కాలువలో పడేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన సుధాకర్‌కు ఎరుకలచెర్వు గ్రామానికి చెందిన రామకృష్ణమ్మ(23)కు మూడేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఏడాది పాప ఉంది. ఈ నెల 7న సాయంత్రం పొలం వద్దకు నీరు పెట్టేందుకు దంపతులిద్దరూ వెళ్లారు. ఆ తర్వాత రామకృష్ణమ్మ ఇంటికి రాలేదు. మరుసటి రోజు రామకృష్ణమ్మ అదృశ్యమైనట్లు తల్లి నాగ తిమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు హంద్రీనీవా కాలువ, పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. భర్తను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా బుధవారం హంద్రీనీవా కాలువలో గుండ్లకొండ పంప్‌హౌస్ వద్ద రామకృష్ణమ్మ శవమై తేలింది. విషయం తెలుసుకున్న డోన్ సీఐ సుధాకర్‌రెడ్డి, కృష్ణగిరి ఎస్ఐ రామాంజనేయరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. డోన్ వైద్యులతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య లక్కసాగరంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులుతెలిపారు. -
కారు గెలుపొందారంటూ టోకరా
కర్నూలు, బొమ్మలసత్రం: కారు గెలుపొందారంటూ ఫోన్‌చేసి రూ. 1.90 లక్షలు దండుకొని గుర్తు తెలియని వ్యక్తి టోకరా వేశాడు. బాధితుడు సోమవారం స్థానిక రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన బాలస్వామి అదే గ్రామంలో ఆర్సీఎం చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల కిందట కొత్త నంబర్ నుంచి సెల్‌కు ఫోన్ వచ్చింది. ఫోన్లో గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడుతూ..లాటరీ తగిలిందని, కొత్త కారు మీరు గెలుచుకున్నారని, జీఎస్టీ చెల్లిస్తే కారు మీ ఇంటికి పంపుతామని నమ్మించాడు. నగదు వేసేందుకు అకౌంట్ నంబర్ ఇవ్వటంతో బాలస్వామి..అదులో విడతల వారిగా 1.90 లక్షలు నగదు బదిలీ చేశాడు. నగదు పంపి రెండునెలలు గడిచినా ఇంతవరకూ కారు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాలస్వామి.. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అచ్చం అలాగే..
ఆదోని టౌన్: కర్నూలు మండలం గార్గేయపురంలో జనవరి 4వ తేదీ రాత్రి దొంగలు ఒకే ప్రాంతంలోని ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అన్నీ తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేశారు. తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి.. రూ.3.55 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. తాజాగా ఆదోని పట్టణంలోనూ అచ్చం అలాగే చోరీలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఆరు ఇళ్ల తాళాలు పగులగొట్టి.. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. రెండు చోట్లా శనివారం రాత్రే చోరీలు జరగడం, అది కూడా వరుస ఇళ్లలో ఒకే తరహాలో చోరీలకు పాల్పడడం యాదృచ్ఛికమా లేక ఒకే ముఠా పనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదోని పట్టణంలోని పంజ్రాపోల్ వీధిలో శనివారం రాత్రి ఒకే ప్రాంతంలోని ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. మెడికల్ రెప్రజెంటేటివ్‌లుగా పనిచేస్తున్న మంజునాథ్, సంపత్‌కుమార్, శివకుమార్ పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. శనివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. అదే వరుసలోని వేర్వేరు ఇళ్లలో ఉంటున్న దినసరి కూలీలు వీరేష్, రాఘవేంద్ర కూడా బంధువుల ఊళ్లకు వెళ్లారు. దొంగలు ఈ ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. వస్తువులన్నీ చెల్లాచెదురు చేశారు. పెద్దగా ఏమీ దొరకలేదు. చిన్నచిన్న వస్తువులను ఎత్తుకెళ్లారు. తర్వాత పక్క సందులోని రేష్మా, వినోద్ దంపతుల ఇంట్లో చోరీకి తెగబడ్డారు. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించే రేష్మా, వినోద్ శనివారం అనంతపురం జిల్లా గుత్తిలో ప్రార్థనలకు వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చోరీ విషయం వెలుగు చూసింది. తాళం తెగ్గొట్టి, బీరువాను పెకలించి నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
నకిలీ మద్యం కేసులో కేఈ ప్రతాప్
టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్జనే ధ్యేయంగా తెగబడ్డారు. ఏ ఆదాయ మార్గాన్నీ వదులుకోలేదు. చివరకు నకిలీ మద్యం కూడా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో స్వయాన మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్‌పై కేసు నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్‌తో సహా 25మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డోన్ : సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్‌తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్‌తో పాటు 25 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిండికేట్ లాభాల్లో కేఈ ప్రతాప్‌కు 25 శాతం, మిగిలిన వారు 75శాతం చొప్పున పంచుకున్నట్లు విచారణలో బహిర్గతమైంది. సిండికేట్‌లో మొత్తం 20 మంది ఉండగా అందరూ టీడీపీ నాయకులే కావడం విశేషం. వీరిలో అత్యధికులు కేఈ బంధువులు కావడం కూడా గమనార్హం. 2014 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఆడపడచుల కన్నీళ్లు తుడిచేందుకు బెల్టుషాపులను రద్దుచేస్తానని హామీ ఇచ్చిన సంగతి విదితమే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుతమ్ముళ్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవిధంగా నకిలీ మద్యాన్ని తయారుచేసి బెల్ట్‌షాపుల ద్వారా విచ్చలవిడిగా విక్రయాలు కొనసాగించారు. సిండికేట్‌గా ఏర్పడిన ఈ ముఠా ప్రభుత్వ మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల ముసుగులో వేలకొద్దీ నకిలీ మద్యం బాటిళ్ల కేసులను బెల్ట్‌షాపులకు సరఫరా చేసి కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడైంది. తీగ లాగితే డొంక కదిలింది గత డిసెంబర్ 10వ తేదీన కృష్ణగిరి మండలం అమకతాడులో జయపాల్ రెడ్డి, కంబాలపాడు సింగిల్‌విండో అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డితో పాటు మరో ముగ్గురిని నకిలీ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేశారు. ఉడుములపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రాంబాబు నకిలీ మద్యాన్ని రవాణా చేస్తూ పత్తికొండ వద్ద వాహనాన్ని తగిలించి వ్యక్తి మృతికి కారణం కావడంతో కేసు కొత్తమలుపు తిరిగింది. రాంబాబును విచారించిన అనంతరం ఉడుములపాడు గ్రామంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వినోద్ ఖలాల్‌ను గత నెల 28వ తేదీన పోలీసులు అరెస్టుచేశారు. అనంతరం టీడీపీ నేతల పాత్ర వెల్లడైంది. నిందితులు వీరే 1.వినోద్‌ఖలాల్ (హుబ్లీ) 2.పుట్లూరు శ్రీను (టీడీపీ) 3.ఈడిగ అయ్యప్ప గౌడ్ (టీడీపీ) 4.ఈడిగ శ్రీనివాసగౌడ్ (అమరవాయి, తెలంగాణ రాష్ట్రం) 5.ఈడిగ బేతపల్లి రంగస్వామి 6.ఉప్పరి రాంబాబు(టీడీపీ) 7.ఈడిగ మనోహర్ గౌడ్ (టీడీపీ) 8.చిట్యాల మురళీగౌడ్ (టీడీపీ)9.దేవరబండ రాము గౌడ్ (టీడీపీ)10. రోహిత్ ఖలాల్ (హుబ్లీ) 11.రాకేష్ ఖలాల్ (హుబ్లీ) 12.సునీల్ ఖలాల్ (హుబ్లీ) 13.సంజు మార్వాడి (హుబ్లీ) 14.మంజు హగేరీ (హుబ్లీ) 15.వినాయక జతూరే (హుబ్లీ) 16 బాబు (హుబ్లీ) 17.అద్దంకి శ్రీనివాసరావ్ (టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 18.అద్దంకి గోపి ( టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 19.కృష్ణాగౌడ్ (టీడీపీ, తెలంగాణ రాష్ట్రం) 20.ఎల్లాగౌడ్ ( కర్ణాటక) 21.అల్లారుదిన్నె వెంకటేశ్ (టీడీపీ) 22.తలమరి రామలింగ (కర్ణాటక) 23.పరశురాం (కర్ణాటక) 24.ఉదయ్ గౌడ్ (టీడీపీ) 25.డీలర్ రాము గౌడ్ (టీడీపీ) 26.కేఈ ప్రతాప్ (నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్) 27.టీఈ కేశన్న గౌడ్ (మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, టీడీపీ) 28.చిట్యాల లోకనాథ్ గౌడ్ (టీడీపీ),29.భాష్యం శ్రీనివాసులు (టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త) 30.కంబాల పాడు కేఈశ్యామ్ (మున్సిపల్ కోఆప్షన్ మాజీ సభ్యుడు, టీడీపీ) 31.గిద్దలూరు శ్రీనివాస గౌడ్ (టీడీపీ) 32.కటారుకొండ మర్రి శ్రీరాములు(శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు) 33.కటారుకొండ మర్రి మోహన్ రెడ్డి (టీడీపీ) 34.Ôశేఖర్‌గౌడ్ (టీడీపీ), 35.రామకృష్ణ (గుత్తి, అనంతపురం జిల్లా) 36. పీవీ రమణ (గుత్తి.) సిండికేట్ ఇష్టారాజ్యం మద్యం దుకాణాల నిర్వహణలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్న టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. వీరి ప్రధాన కార్యాలయం నుంచే డోన్ నియోజకవర్గంలోని 131 గ్రామాలతో పాటు కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లోని మరో 65గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్‌షాపులకు నకిలీ మద్యాన్ని సరఫరా చేసి జోరుగా విక్రయించారు. ఎక్సైజ్‌శాఖలో కీలకపదవిలో ఉన్న ఒక ఉన్నతాధికారితో పాటు 2014 నుంచి ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులందరికీ ఈ విషయం తెలిసినా మామూళ్లకు కక్కుర్తిపడి బయటకు పొక్కనివ్వలేదనే ఆరోపణలున్నాయి. -
తప్పు ఎవరిది..శిక్ష ఎవరికి?
కర్నూలు ,ఎమ్మిగనూరు రూరల్: భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త కొద్ది గంటల్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కడివెళ్ల గ్రామానికి చెందిన స్వాతి(35)కి, మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన నరసింహారెడ్డికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టించుకోకుండా అల్లరచిల్లరగా తిరుగుతుండటంతో భార్య, భర్త మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. పెద్దలు సర్దిచెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో ఐదేళ్లుగా స్వాతి పుట్టినిళ్లు కడివెళ్లలో ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్య వద్దకు వచ్చిన నరసింహారెడ్డి రెండ్రోజులు బాగానే ఉన్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయలు తరిగే కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే లోపే పరారయ్యాడు. లాడ్జీలో ఆత్మహత్య.. బుధవారం సాయత్రం భార్య స్వాతిని అతికిరాతంగా కత్తితో గొంతు కోసి హత్య చేసి పరారైన నరసింహారెడ్డి ఎమ్మిగనూరుకు చేరుకున్నాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అద్దెకు తీసుకున్న లాడ్జీ గదికి వెళ్లి పంచెతో ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం లాడ్జీలో నుంచి రక్తం బయటకు వస్తుండటం గమనించిన పక్క గది వారు లాడ్జీ సిబ్బందికి తెలియజేశారు. వారు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో వెళ్లి తలుపు బద్దలకొట్టి చూడగా ఉరికి వేళాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని కిందకు దించి కుటంబ సభ్యులకు తెలియజేశారు. శిక్ష పిల్లలకా? తల్లిదండ్రులు గొడవ పడుతుంటే చిన్నారులు కుమిలిపోయేవారు. ఐదేళ్లుగా అమ్మమ్మ ఊరిలో తల్లితో పాటు ఉంటూ చదువుకునే చిన్నారులకు తండ్రి దూరంగా ఉండేవాడు. అప్పుడప్పుడూ వచ్చే తండ్రిని నాన్నా అని పిలిచేందుకు కూడా భయపడే వారు. ఈ క్రమంలో తల్లి హత్యకు గురికావడం, తండ్రి ఆత్మహత్యకు పాల్పడటంతో అనాథలయ్యారు. తప్పు ఎవరిదైనా తల్లిదండ్రుల ప్రేమకు దూరం కావడమనే శిక్ష చిన్నారులకు పడిందని పలువురు కంట తడిపెట్టారు. -
విద్యార్థులే టార్గెట్
కర్నూలు: విద్యార్థులే లక్ష్యంగా కర్నూలు నగరంలో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ధూమపానానికి అలవాటు పడిన విద్యార్థులు, గంజాయికి బానిసలుగా మారుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటవ పట్టణ సీఐ దస్తగిరిబాబు నేతృత్వంలో వలపన్ని నలుగురు రవాణా దారులు, ఇద్దరు విక్రేతలను అరెస్టు చేశారు. జొహరాపురానికి చెందిన మల్లెపోగు లక్ష్మి, ఆమె తమ్ముడు మల్లెపోగు మధు గంజాయిని పొట్లాలుగా కట్టి అదే ప్రాంతంలోని అల్లాబకాష్ దర్గా వెనుక విద్యార్థులకు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. వెలుగోడు మండలం రాజునగర్ వీధికి చిందిన ఖాదర్‌వలి, పాణ్యం ఏఆర్ కాలనీకి చెందిన మూర్తుజావలి, పగిడ్యాల మండలం వనుములపాడు గ్రామానికి చెందిన కర్నే దామోదర్, బండి ఆత్మకూరు మండలం ఏ. కోడూరు గ్రామానికి చెందిన ఖైరున్‌బీ ముఠాగా ఏర్పడి నల్లమల అటవీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి మల్లెపోగు లక్ష్మి, ఆమె తమ్ముడు మధుకు రవాణా చేస్తున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. వీరు కిలో గంజాయి 500 ప్రకారం కొని తులాల ప్రకారం పొట్లాలుగా చుట్టి ఒక్కొక్కటి రూ.20 ప్రకారం విద్యార్థులకు విక్రయాలు జరుపుతున్నారు. జనసంచారం లేని సమయంలో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో కర్నూలు నగరంలోని ఎల్కూరు విల్లాస్, ప్రధాన పార్కులు, ఇంజినీరింగ్ కాలేజీల వద్ద ఈ వ్యాపారాని కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడినట్లు సీఐ దస్తగిరి బాబు తెలిపారు. సిగరెట్లు తాగే అలవాటు ఉన్న విద్యార్థులు అందులోని పొగాకు తొలగించి గంజాయి పొడిని నింపుకుని తాగుతున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. రవాణా దారులు కర్నే దామోదర్, ఖాదర్‌వలి, మూర్తుజావలి, ఖైరూన్‌బీలతో పాటు, జొహరాపురానికి చెందిన మల్లెపోగు లక్ష్మి, మల్లెపోగుమ«ధును అరెస్టు చేసిæ వారి వద్ద 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసురేని కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు సీఐ వెల్లడించారు. -
కుమారుడు పుట్టలేదని ఒకరు.. లాడ్జీలో ఒకరు
కర్నూలు, మిడుతూరు: కుమారుడు పుట్టలేదని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని సుంకేసుల గ్రామంలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ గోపీనాథ్ తెలిపిన వివరాల మేరకు.. సుంకేసులకు చెందిన జగదీష్‌కు ఆత్మకూరు మండలం సిద్దపల్లె గ్రామానికి చెందిన సారమ్మతో 2000 సంవత్సరంలో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. కుమారుడు పుట్టలేదని సారమ్మ బాధపడుతుండేది. దీనికితోడు ఆమె రుతుక్రమం సమయంలో కడపునొప్పితో ఇబ్బందిపడేది. ఈ రెండు కారణాలతో జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవ్వరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి బాల ఏసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ ఆత్మహత్య కర్నూలు(హాస్పిటల్): నగరంలోని లాడ్జీలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. నంద్యాలకు చెందిన శేఖర్ శిరువెళ్ల మండలం ఎర్రగుంట్ల ఎస్బీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వెంకటేశ్వరమ్మ(34), ఒక కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వరమ్మ సోమవారం కర్నూలుకు వచ్చి బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జీలో గది అద్దెకు తీసుకుంది. మంగళవారం ఆమె గది తెరవకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి చూడగా ఆమె క్రిమిసంహారక మందు తాగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే చొరబడ్డాడు!
కర్నూలు, నందవరం: ఓ దొంగ పట్టపగలే ఇంట్లోకి చొరబడ్డాడు. దొంగతనం చేసి ఉడాయిస్తూ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన సోమవారం నందవరం మండలం గురజాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ వెంకటేష్ కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లారు. ఇదే అదనుగా తెలంగాణలోని గద్వాలకు చెందిన దొంగ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. రూ.1.30 లక్షల నగదు, 2 తులాల బంగారం దొంగలించాడు. అదే సమయంలో పొలం నుంచి వెంకటేష్ కుమారుడు అశోక్ ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంట్లో నుంచి దొంగ బయటకు రావడం చూసి అవాక్కయ్యాడు. గ్రామస్తులతో కలిసి వెంబడించి అతన్ని పట్టుకున్నారు. దొంగలించిన నగదు, బంగారు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. -
దొంగల హల్చల్
కర్నూలు: కర్నూలు మండలం గార్గేయపురంలో శనివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని మరీ చోరీలకు తెగబడ్డారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ ఇంటికి తాళం వేసి శబరిమల యాత్రకు వెళ్లాడు. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బంగారు గొలుసును తస్కరించారు. సమీపంలోని గాండ్ల వీరయ్య దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారు. శశిధర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన మీ సేవ కేంద్రం తాళాలు పగులగొట్టి.. గదిలోకి ప్రవేశించి సామాన్లన్నీ చిందరవందర చేశారు. అక్కడ వారికి ఏమీ దొరకలేదు. మద్దిలేటి అనే గొర్రెల కాపరి ఇంట్లో బంగారు గొలుసు, రూ.30 వేల నగదుఅపహరించారు. భార్య పుట్టింటికి వెళ్లగా.. మద్దిలేటి ఇంటికి తాళం వేసి గొర్రెల మంద దగ్గర కాపలాకు వెళ్లాడు. ఇదే అదనుగా దొంగలు బీభత్సం సృష్టించారు. పోస్టల్ ఉద్యోగి మల్లికార్జున కుటుంబంతో కలిసి గద్వాలలోని కూతురు ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి.. నెక్లెస్, రెండు ఉంగరాలు ఎత్తుకెళ్లారు. కురువ మాధవి ఇంటికి తాళం వేసి తల్లి సామక్క వద్దకు వెళ్లింది. ఉదయం ఇంటికి తిరిగొచ్చేసరికి తాళం కట్‌చేసి ఉంది. ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. జత బంగారు కమ్మలు, దుస్తులు, రూ.25 వేలు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే శివ ఇంట్లో బ్రాస్లెట్, ఒక చైన్, రూ.3లక్షల నగదు మూటగట్టుకుని ఉడాయించారు. మరొకరి ఇంట్లోనూ చోరీకి పాల్పడ్డారు. బాధితులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాలూకా సీఐ ఓబులేసు తన సిబ్బందితో వెళ్లి చోరీ జరిగిన ఇళ్లన్నీ పరిశీలించారు. అన్నీ తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసినందున ప్రొఫెషనల్ దొంగల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. బిహార్ గ్యాంగ్‌గా అనుమానంకర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు నుంచి వెంకాయపల్లె వరకు బిహార్ ప్రాంతానికి చెందిన కొంతమంది రోడ్లకు ఇరువైపులా స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తూ కొంతకాలంగా స్థానికంగానే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వాళ్లలోని కొంతమంది ఈ చోరీలకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా సేకరించారు. చోరీ జరిగిన ఇళ్లన్నీ ప్రధాన రోడ్డుపక్కనే ఉండడంతో దొంగలు వాహనంలో వచ్చి, తాళాలను కట్టర్లతో కత్తిరించి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేకంగా రెండు బృందాలను రంగంలోకి దింపి విచారణ చేస్తున్నారు. -
మతిస్థిమితం లేని యువకుడి హల్చల్
కర్నూలు, ఆదోని టౌన్: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో ఓ యువకుడు శుక్రవారం హల్చల్ చేశాడు. కత్తితో తనను తాను గాయపరుచుకుంటూ, కేకలు వేస్తూ బీభత్సం సృష్టించాడు. యువకుడి చేతిలో కత్తి చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. కోర్టు పనిమీద అక్కడికి వచ్చిన కొందరు పోలీసులు స్థానికుల సాయంతో యువకుడిని పట్టుకుని ఆస్పత్రికి తరలించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. టూ టౌన్ సీఐ అబ్దుల్ గౌస్ తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్ గోరక్‌పూర్ గౌలు బజార్‌కు చెందిన యువకుడు సుభాష్ సోంకార్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం రైలులో నుంచి స్థానిక రైల్వే స్టేషన్లో దిగాడు. సమీపంలోని కోర్టు ఆవరణలోకి ప్రవేశించాడు. తన వద్దనున్న కత్తితో చేతులు, గొంతు కోసుకున్నాడు. తనకు బతికేందుకు అర్హత లేదంటూ, తనను గొంతు కోసి చంపాలంటూ స్థానికుల వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కోర్టు డ్యూటీపై వచ్చిన పోలీసులు స్థానికుల సాయంతో పట్టుకుని అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది, పోలీసుల సాయంతో యువకుడి చేతులు, కాళ్లు కట్టేసి వైద్యులు వైద్యం చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు రెఫర్ చేశారు. కాగా జేబులోని ఫోన్‌బుక్ ఆధారంగా గోరక్‌పూర్‌లోని యువకుడి భార్య సుమాంధురి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని సీఐ తెలిపారు. -
నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
కర్నూలు, డోన్ టౌన్: నకిలీ మద్యం తయారీ ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే భారీ ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. మండల పరిధిలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన ఉప్పరి రాంబాబు తన ఇంటిలో అండర్‌గ్రౌండ్‌లో బంకర్ ఏర్పాటు చేసుకొని కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేసి, ఇతర ప్రదేశాలకు తరలిస్తూ వస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు గత నెల 29న సోదాలు చేసి నకిలీ మద్యం తయారీ గుట్టును రట్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాంబాబుకు తెలంగాణ రాష్ట్రంలోని అమరవాయికి చెందిన శ్రీనివాసగౌడ్, ప్రకాశం జిల్లా అద్దంకి శ్రీనివాసరావులతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. కర్ణాటక నుంచి ముడిసరుకు.. కర్ణాటక రాష్ట్రం నుంచి స్పిరిట్, క్యారామిల్, మూతలు తదితర ముడి సరుకు తెప్పించి నకిలీ మద్యాన్ని రాంబాబు తయారు చేసేవాడు. వీటి కొనుగోలుకు ఉడుములపాడుకు చెందిన ఈడిగ నాగభూషణం, డోన్ పట్టణానికి చెందిన ఫజల్, ఈడిగ రవి ఆర్థికంగా డబ్బు సమకూర్చేవారు. తయారు చేసిన నకిలీ మద్యాన్ని బనగానపల్లెకు చెందిన క్రిష్ణారెడ్డి, శివ, కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన మురళీధర్‌గౌడ్, కొత్తపల్లెకు చెందిన రాజశేఖర్ తదితరులతో పాటు మరికొంత మంది ద్వారా విక్రయించేవాడు. రూ.8 లక్షల విలువ చేసే ముడిసరుకు స్వాధీనం నిందితుడి నుంచి పోర్డ్ ఐకాన్ ఏపీ 21ఏఈ 3007 నంబరు కారు, 720 క్వాటర్ బాటిళ్లతో పాటు రాంబాబు ఇంటిలోని బంకర్లో 17 బస్తాల్లో ఉన్న నకిలీ మద్యం బాటిళ్లు, 245 లీటర్ల స్పిరిట్, 4 వేల మ్యాక్‌డోల్ బ్రాంది, 2 వేల ఇంపీరియల్ బ్లూ మద్యం బ్రాండ్ ఖాళీ మూతలు, 10 వేల గోలా క్యాప్స్, క్యారమిల్, ఏస్సేన్, మద్యం మీటర్, 19 ఖాళీ క్యాన్లు, 2 డ్రమ్ములు, 800 ఖాళీ క్వాటర్ బాటిళ్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరి రాంబాబుతో పాటు ఉడుములపాడుకు చెందిన నాగభూషణం, రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ముడి సరుకు రవాణా అసలు సూత్రధారుడిని త్వరలో అరెస్టు చేస్తామని డీసీ చెప్పారు. సమావేశంలో నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, స్టేట్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ క్రిష్ణకిషోర్‌రెడ్డి, కర్నూలు సీసీఎస్ డీఎస్పీ వినోద్‌కుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శివశంకర్‌రెడ్డి, డోన్ సీఐ లక్ష్మణదాసు, ఎస్ఐలు శ్రీధర్‌రావు, రమణారెడ్డి, సిబ్బంది లక్ష్మినారాయణ, సుధాకర్‌రెడ్డి, లాలప్ప, శంకర్‌నాయక్, ధనుంజయ ఉన్నారు. -
టీడీపీ నాయకుడి ఇంట్లో నకిలీ మద్యం తయారీ
కర్నూలు డోన్ టౌన్: నకిలీ మద్యం తయారీ గుట్టును ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. ఆదివారం డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు ఉప్పరి రాంబాబు ఇంటిపై దాడి చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో నకిలీ మద్యంతోపాటు తయారీకి ఉపయోగించేముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీలో రాంబాబుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి, డోన్ మండల మాజీ ఎంపీపీ, కొత్తకోట గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రాంబాబు..టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. గత ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు ఈయనపై ఆరోపణలున్నాయి. ఇక్కడ తయారీ చేసిన నకిలీ మద్యాన్ని జిల్లా అంతటా తరలించేవాడు. అండర్‌గ్రౌండ్ కేంద్రంగా.. ఉడుములపాడులో రాంబాబు నిర్మించిన ఇంటిలోని అండర్ గ్రౌండ్లో నకిలీ మద్యం తయారు చేసేవారు. ఆఫీసర్ చాయిస్, ఇంపీరియల్ బ్లూ, మ్యాక్‌డోల్ విస్కీ..తదితర బ్రాండ్ల పేరుతో స్పిరిట్, క్యారామిల్ పౌడర్, కెమికల్ ఫ్లేవర్ కలిపి మద్యం తయారు చేవారు. ఖాళీ బాటిళ్లు, లేబుల్స్, మూతలు, స్పిరిట్‌తో నిండి ఉన్న క్యాన్లను ఎక్సైజ్ పోలీసులు స్వాదీనం చేసుకొన్నారు. అన్నీ బ్రాండ్లు ఇక్కడే ఈ నెల 7,10వ తేదీల్లో కృష్ణగిరి మండలానికి చెందిన జయపాల్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డిలను అరెస్టుచేసి నకిలీ ఇంపీరియల్ బ్లూ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కర్నూలు కృష్ణానగర్‌లో నకిలీ మద్యం తయారీతో సంబందం ఉన్న హాలహార్వి వీఆర్వో విష్ణువర్దన్ రెడ్డి, కృష్ణమూర్తి, భాస్కర్లను అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారు చేసే కర్ణాటక రాష్ట్రం దర్వాడ్ జిల్లా హాల్వాహో గ్రామానికి చెందిన వినోద్ కలార్పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నకిలీ మద్యం తయారీపై పూర్తి సమాచారం సేకరించిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు..ఆదివారం ఉడుములపాడు గ్రామంలోని రాంబాబు ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు. తీగెలాగితే డొంక కదిలినట్లు నకిలీ మద్యం తయారీదారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. అయితే చాలా ఏళ్ల నుంచి ఈ దందా కొనసాగిస్తున్న అసలు నిందితులను వెలుగులోకి రావాల్సి ఉంది. పూర్తి వివరాలు వెల్లడించలేం నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పట్టుబడిన వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేమని ఎక్సైజ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ లభించిన నకిలీ మధ్యం బాటిళ్లు, ముడి సరుకు వివరాలను తెలపాలంటే కాస్త సమయం పడుతుందని అధికారులంటున్నారు. తదుపరి విచారణ జరిపి.. అసలు నిందితులను అదుపులోకి తీసుకునే వరకు ఈ విషయాన్ని చెప్పలేమని వారు వివరిస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ సీఐ శిరీషాదేవి, డోన్ సీఐ లక్ష్మణదాసు, ఎస్ఐ రమణారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, సిబ్బంది సుధాకర్‌రెడ్డి, లాలప్ప, ధనుంజయ, శంకర్ నాయక్‌తో పాటు మరికొంతమంది పాల్గొన్నారు. -
విద్యార్థినిపై లైంగిక వేధింపులు
కర్నూలు, ఆత్మకూరు రూరల్: విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ప్రయివేటు టీచర్‌ను కటకటాలకు పంపారు. ఈ ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరుకు చెందిన ఖాజా అనే వ్యక్తి స్థానికంగా ఓ ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని మంగళవారం అరెస్టు చేశారు. ఆత్మకూరు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పర్చగా.. 15 రోజుల రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కర్నూలు: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ(ఎంఎస్సీఎస్) రెండో సంవత్సరం చదువుతున్న గాండ్ల వంశీ (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాల్గో పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. నగరంలోని కమలానగర్లో నివాసం ఉంటున్న కృష్ణారావు, పద్మావతి దంపతులు స్థానిక సీవీ రామన్ కాలేజీలో వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు గాండ్ల వంశీ. చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో మొదటి సంవత్సరం కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. అప్పటి నుంచి తాను సినిమాల్లోకి వెళతానని, చదువుపై శ్రద్ధ లేదని తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. డిగ్రీ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళ్లమంటూ వారు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు మూసి ఉండడంతో బద్దలు కొట్టి గదిలోకి వెళ్లి చూశారు. వంశీ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ మేరకు తండ్రి కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు నాల్గో పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి..సోమవారం పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
టింబర్ డిపో మాటున ఎర్రచందనం రవాణా
కర్నూలు, మహానంది: టింబర్‌డిపో పెట్టుకుని కలప విక్రయాల మాటున ఎర్రచందనంపై గురిపెట్టాడు. డిపోలోని సామగ్రికి చలనాలు కట్టి అదే పేరుతో ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేస్తూ అక్రమాలకు పాల్పడ్డాడు. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో అన్నీ తేలాయి. శేషాచలం నుంచి ముంబైకి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కేసులో ఒకరికి అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా ఆదివారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ మల్లికార్జున, మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మహానంది పోలీసుస్టేషన్లో వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న అంకిరెడ్డిచెరువు వద్ద హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన కల్యాణి యుగల్ కిశోర్‌ను అరెస్ట్ చేసి 177కిలోల బరువున్న 19 ఎర్రచందనం దుంగలు, 193కిలోల బరువున్న ఇతర 13 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే కేసులో ముంబైకి చెందిన హారూన్ అబ్దుల్ లతీఫ్‌ను అరెస్ట్ చేశామన్నారు. లతీఫ్.. ముంబైలో టింబర్ డిపో నిర్వహిస్తూ ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తుంటాడన్నారు. హైదరాబాద్‌లోని ఓ పార్సిల్ సర్వీస్‌లో పనిచేస్తున్న కల్యాణి యుగల్ కిషోర్ సహకారం తీసుకునేవాడని చెప్పారు. జైపూర్‌లోని ఓ లాడ్జీలో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడన్న సమాచారం మేరకు మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మూడేళ్ల నుంచి ఇలాంటి అక్రమ రవాణాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇదే కేసులో రుద్రవరం గ్రామానికి చెందిన ఎర్రశ్రీను, ఢిల్లీకి చెందిన సలీంల ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. వీరిని సైతం త్వరలోనే పట్టుకుంటామన్నారు. అంతర్జాతీయ స్మగ్లర్‌ను పట్టుకున్న మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని సీఐ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంత పని చేశావు నిహారికా
‘ఎంత పని చేశావు నిహారికా.. నీ బాగు కోసమే కదమ్మా మందలించింది. బాగా చదువుకోమని చెప్పినందుకే ప్రాణాలు తీసుకుని మాకు కడుపుకోత మిగిల్చావు కదమ్మా’ అంటూ ఆ తండ్రి దుఃఖించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. రెండు రోజుల క్రితం ఎల్ఎల్సీలో దూకి గల్లంతైన విద్యార్థిని నిహారిక(15) మృతదేహం గురువారం పైకి తేలడంతో పోలీసులు, గజ ఈగతాళ్ల సాయంతో బయటకు తీశారు. కళ్లు, ముక్కు, నోరు, చేతులను చేపలు స్వల్పంగా తినేయడం చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న నిన్ను ఈ స్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదంటూ తండ్రి వాసుబాబు గుండెలు బాధుకున్నాడు. సాక్షి, ఎమ్మిగనూరు రూరల్(కర్నూలు): ప్రకాశం జిల్లా కొనికి గ్రామానికి చెందిన వాసుబాబు, వెంకటరమణమ్మ పదిహేనేళ్ల ఏళ్ల కిత్రం ఎమ్మిగనూరుకు వలసవచ్చి పొలాలు కౌలుకు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని సోమప్ప నగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి సీతామహాలక్ష్మీ, నిహారిక(15), వర్థిని సంతానం. నిహారిక స్థానిక రవీంద్ర స్కూల్లో పదో తరగతి చదువుతోంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తెలిసి మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు మందలించారు. బాగా చదువుకోవాలని సూచించారు. మందలించడాన్ని అవమానంగా భావించి మంగళవారం ఉదయం ఎల్ఎల్సీ వద్దకు వెళ్లి సైకిల్ గట్టుపై పెట్టి కాలువలో దూకేసింది. సైకిల్‌ను ఆధారంగా చేసుకొని పోలీసులు, అగ్నిమాపక పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టిన బాలిక మృతదేహం కనిపించలేదు. ప్రభుత్వాసుపత్రి వద్ద రోదిస్తున్న బాలిక తల్లి, కుటుంబ సభ్యులు రెండు రోజులైనా మృతదేహం కనిపించకపోవటంతో సైకిల్ పెట్టి ఎక్కడికైనా వెళ్లిందేమోనని, తమ కుమార్తె బతికే ఉంటుందని తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూశారు. గురువారం ఉదయం చెరువులో బాలిక మృతదేహం ఉండటాన్ని గమనించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. బాలిక కళ్లు, ముక్కు, నోరు, చేతులను చేపలు తినివేయడాన్ని చూసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. చెరువు వద్దకు టౌన్ సీఐ వి. శ్రీధర్, ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి, ఫైర్ ఎస్ఐ మోహన్‌బాబులు చేరుకొని బాలిక మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు టౌన్ సీఐ తెలిపారు. -
హైవేపై దోచుకునే కంజారా ముఠా అరెస్ట్
సాక్షి, కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని.. దోచుకునే కరుడుగట్టిన దోపిడీ దొంగల ముఠా గుట్టును కర్నూలు జిల్లా పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను గురువారం పోలీసులు వలపన్ని హైవేపై సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. దోపిడీ దొంగల ముఠాను మధ్యప్రదేశ్‌కు చెందిన కంజారా ముఠాగా గుర్తించిన పోలీసులు.. వారి నుంచి 85 మొబైల్ ఫోన్లు, పట్టుచీరలు, 2 లారీలు, మరణాయుధాలతో పాటు ఔషధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైవేపై కొరియర్ వాహనాలనే లక్ష్యంగా చేసుకుని.. దాడి చేసి కొల్లగొట్టే కంజారా ముఠా ఇప్పటివరకూ కర్నూలు జిల్లాలో నాలుగు చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
భర్తకు విషం ఇచ్చిన నవ వధువు
సాక్షి, కర్నూలు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన వారం రోజులు కూడా గడవక ముందే తన వైవాహిక జీవితానికి ఓ నవ వధువు స్వస్తి పలకాలనుకుంది. అత్తవారి ఇంటికి వచ్చిన భార్య.. భర్తకు విషం ఇచ్చిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు వారం రోజుల క్రితం మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా లింగమయ్యతో నాగమణి పెళ్లి చేశారు. ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో అత్తవారింటికి వచ్చిన నాగమణి భర్తకు మజ్జిగలో విషం కలిపి ఇచ్చింది. వీటిని తాగిన లింగమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గుత్తి పోలీసులు ఈ కేసును దర్యాప్తులో భాగంగా జొన్నగిరి పోలీసు స్టేషన్‌కు బదలాయించారు. -
భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు): పదిహేనేళ్ల క్రితం తనతో ఏడడుగులు నడిచి అన్నింటిలోనూ తోడుగా నిలిచిన భార్యపై అతను అనుమానం పెంచుకున్నాడు. ఎంతలా అంటే చివరికి ఆమెను పెట్రోలు పోసి హత్య చేసేంతలా. ఆదివారం కోవెలకుంట్ల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు హత్యకేసు వివరాలను వెల్లడించారు. దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన కొండన్న కుమారుడు నరసింహులు అనే వ్యక్తికి అదే మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన పరిమళతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా కుమారుడు, కుమార్తె జన్మించారు. మూడేళ్ల క్రితం కుమార్తె క్యాన్సర్‌తో బాధపడుతూ మృత్యువాత పడింది. ఇదిలా ఉండగా భర్త గత కొన్ని రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకోవడంతో అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గత నెల 23న ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నరసింహులు తండ్రి కొండన్న కోడలిని చంపేస్తే పీడ విరగడవుతుందని కుమారుడికి చెప్పడంతో పవర్ స్ప్రెయర్‌ను స్టార్ట్ చేసేందుకు తెచ్చుకున్న పెట్రోల్‌ను భార్యపై చల్లి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న పరిమళను గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చావు బతుకుల్లో ఉన్న పరిమళ వాగ్మూలం మేరకు భర్త, మామపై దొర్నిపాడు పోలీస్‌స్టేషన్ హత్యయత్నం కేసు నమోదైంది. ఇరవై నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి కోలుకోలేక శనివారం మృతి చెందింది. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు గ్రామ శివారులో హతురాలి భర్త, మామలను అరెస్టు చేసి కోవెలకుంట్ల కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారని డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వేధింపులు తాళలేక సంధ్య ఆత్మహత్య
కర్నూలు ,దేవనకొండ: కట్టుకున్న భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని అలారుదిన్నె గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన జంగం శంకరయ్య కుమార్తె జంగం సంధ్య(20)ను అలారుదిన్నె గ్రామానికి చెందిన జంగం జగదీష్‌కు ఇచ్చి గతేడాది వివాహం చేశారు. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. అనంతరం భర్త జగదీష్ రోజూ సంధ్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో విసుగు చెందిన సంధ్య మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను భర్త, అత్తింటి వారే చంపేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎస్ఐ మారుతి, తహసీల్దార్ దోనీఆల్‌ఫ్రైడ్ ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండకు తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వేట కొడవళ్లతో నరికి దారుణ హత్య
కర్నూలు (న్యూటౌన్): కల్లూరు మండలంలో ఆదివారం దారుణ హత్య జరిగింది. పొలం కోసం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు అతి కిరాతకంగా నరికి చంపారు. పెద్దకొట్టాల – చిన్నకొట్టాల గ్రామాల మధ్యలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి (42) కర్నూలులోని నాగేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈయనకు 22 ఎకరాల పొలం ఉంది. దానిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాడు. 2004లో అదే గ్రామానికి చెందిన మద్దిలేటి రెడ్డి వద్ద ఎకరా రూ. 2 లక్షల చొప్పున రెండెకరాల పొలం ఆయన కొనుగోలు చేశాడు. తర్వాత భూముల ధరలు భారీగా పెరగడంతో తన పొలం తిరిగి ఇవ్వాలని 2013లో మద్దిలేటిరెడ్డి పేచీ పెట్టాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగడంతో పంచాయితీ ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌కు చేరింది. సమస్యను కోర్టులో తెల్చుకోవాలని పోలీసులు సూచించడంతో వారు కోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు తీర్పు పెద్దారెడ్డికి అనుకూలంగా రావడంతో మద్దిలేటిరెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా తన పొలాన్ని తిరిగి దక్కించుకోవాలని వివిధ కుట్రలు పన్నాడు. ముందుగా తన భార్య సూర్యకాంతం పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేశాడు. తర్వాత పొలానికి వెళ్తుండగా వెంబడించి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టించాడు. అయినా, పెద్దారెడ్డి ప్రాణాలతో బయటపడటంతో ఈసారి హత్యకు ప్లాన్ గీశాడు. మాటు వేసి మట్టుబెట్టారు పెద్దకొట్టాల గ్రామానికి చెందిన చిన్న తిమ్మారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడని తెలియడంతో పెద్దారెడ్డి ఆదివారం గ్రామానికి వచ్చాడు. అంత్యక్రియల్లో పాల్గొని మార్గమధ్యంలోని మిరపపొలంలో ఉన్న బోరుబావి వద్ద స్నానం చేసి కర్నూలుకు బయలుదేరాడు. అప్పటికే పొలంలో మాటు వేసి ఉన్న మద్దిలేటిరెడ్డి కుటుంబసభ్యులు ఒక్కసారిగా వేటకొడవళ్లు, గొడ్డళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. విషయం తెలుసుకున్న కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథరెడ్డి, ఉలిందకొండ ఎస్ఐ శంకరయ్య, కె. నాగలాపురం ఎస్ఐ కేశవ్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో బాధిత కుటుంబం పెద్దారెడ్డి హత్య విషయం తెలియగానే మృతుడి భార్య జయమ్మ, కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి, అన్న సీతారామిరెడ్డి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి భార్య స్పృహతప్పి పడిపోయింది. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు రోహిణి, వసంత, భారతి, కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి సంతానం. పెద్దారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు మద్దిలేటి రెడ్డి, అతని భార్య సూర్యకాంతం, కుమారులు కొండారెడ్డి, అశోక్‌రెడ్డిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసినట్లు కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథరెడ్డి తెలిపారు. కాగా నిందితులైన మద్దిలేటిరెడ్డి, అతని భార్య ఉలిందకొండ పొలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వీరిది సొంత ఊరు పెద్దకొట్టాల కాగా పాత కల్లూరులో నివాసం ఉంటున్నారు. అక్కడ ఒంటెద్దు బండి నడపుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
నిద్రమత్తులో డ్రైవింగ్..మృత్యువుతో పోరాడిన ప్రయాణికుడు
ప్యాపిలి: సమయం..తెల్లవారుజామున నాలుగు గంటలు. ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి భారీ కుదుపు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. అప్పటికే బస్సు తాము ప్రయాణిస్తున్న మార్గాన్ని దాటి అవతలి వైపునకు దూసుకెళ్లింది. గుట్టను ఢీకొట్టి ఆగిపోయింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ వేగంగా బస్సు దిగిపోయారు. ప్యాపిలి పట్టణ సమీపంలోని చిరుతలగుట్ట వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఏ01ఏజే 0322 నంబర్ గల జబ్బార్ ట్రావెల్స్ బస్సు గురువారం రాత్రి 49 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్యాపిలి సమీపానికి చేరుకుంది. వంద కిలోమీటర్లకు పైగా వేగంతో బస్సును నడుపుతున్న డ్రైవర్ నిద్రమత్తులో తూగాడు. వెంటనే బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఏపీ 21వై 9817 నంబర్ గల లారీని ఢీ కొట్టింది. అనంతరం బస్సు అదుపు తప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు మార్గంలోకి దూసుకెళ్లింది. పొలాలకు ఆనుకుని ఉన్న గుట్టను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రయాణికులు బెంగళూరుకు చెందిన మొగలప్ప విశ్వనాథ్ (29), చత్తీస్‌గఢ్‌కు చెందిన సురేశ్ (19) సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మనోజ్ కుమార్(చత్తీస్‌గఢ్), మోహన్‌రావు (హైదరాబాద్ గచ్చిబౌలి) గాయపడగా.. వారిని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్యాపిలి ఎస్ఐ మారుతీశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని తమ సిబ్బంది సాయంతో బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాద స్థలాన్ని డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి పరిశీలించారు. మృత్యువుతో పోరాటం చత్తీస్‌గఢ్‌కు చెందిన సురేశ్ దాదాపు రెండు గంటల పాటు మృత్యువుతో పోరాడాడు. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో సురేశ్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతని ఆర్తనాదాలు విని ఎస్ఐ మారుతీశంకర్ చలించిపోయారు. తన సిబ్బందితో కలసి సురేశ్‌ను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. రెండు గంటల పాటు శ్రమించినా అతన్ని బయటకు తీయలేకపోయారు. చివరకు క్రేన్ సాయంతో శిథిలాలు తొలగించి సురేశ్‌ను బయటకు తీశారు. బయట పడిన కాసేపటికే అతను మృతి చెందాడు. తప్పిన ఘోర ప్రమాదం లారీని ఢీ కొన్న తర్వాత బస్సు అదుపు తప్పి డివైడర్ అవతలి వైపునకు దూసుకెళ్లిన సమయంలో ఎదురుగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంతే వేగంతో వచ్చింది. అయితే సదరు బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రెండు బస్సులు ఢీ కొని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. నర్సింగ్ ప్రాక్టికల్స్‌కు వచ్చి.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం చంద్రమాకలగడ్డకు చెందిన మొగలప్ప విశ్వనాథ్, దుర్గాలక్ష్మి దంపతులు బెంగళూరులో స్థిరపడ్డారు. వీరికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా..ఐదేళ్ల కుమార్తె ఉంది. శుక్రవారం కర్నూలులో దుర్గాలక్ష్మికి నర్సింగ్ కోర్సుకు సంబంధించిన ప్రాక్టికల్స్ ఉన్నాయి. దీంతో కూతురిని బెంగళూరులోని బంధువుల ఇంట్లో వదిలి భార్యాభర్తలు గురువారం జబ్బార్ ట్రావెల్స్ బస్సులో కర్నూలుకు బయలుదేరారు. వాస్తవానికి దుర్గాలక్ష్మి ఒక్కరినే కర్నూలుకు పంపాలనుకుని బస్సు ఎక్కించడానికి విశ్వనాథ్ వచ్చాడు. తర్వాత మనసు మార్చుకుని అతనూ బయలుదేరాడు. విశ్వనాథ్ కళ్లముందే విగతజీవిగా మారడంతో భార్య దుర్గాలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంటికి వెళ్లిన తర్వాత ‘డాడీకి ఏమైంద’ని పాప అడిగితే ఏం చెప్పాలంటూ ఆమె రోదించిన తీరు పలువుర్ని కలచివేసింది. -
నాన్నా నన్ను క్షమించు..
సాక్షి, కర్నూలు : ‘నాన్నా క్షమించు.. నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నా. నాకు బతకాలని లేదు. ఈ లోకంలో ఉండలేకున్నా. అమ్మను బాగా చూసుకో. అక్కను ఇంటికి తెచ్చుకో. బావ బాగా చూసుకోవడం లేదు. మీరున్నంత వరకు అక్కను మీతోనే ఉంచుకోండి. నేను చచ్చిపోయాక మృతదేహాన్ని అక్క, అన్న, చెల్లెలికి చూపొద్దు. దయచేసి నా కోరిక తీర్చండి’ అంటూ గూడూరు మండలం జూలకల్‌లో కాంట్రాక్టు పద్ధతిన వ్యవసాయ విస్తరణ అధికారి (ఎంపీఈఓ)గా పని చేస్తున్న భజంత్రీ శివప్రియాంక (22) సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. పాణ్యం గ్రామానికి చెందిన వీరభద్రుడు, లక్ష్మిదేవి రెండో కుమార్తె శివప్రియాంక. ఈమె రెండేళ్లుగా జూలకల్ ఎంపీఈఓగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తోంది. మరో ఎంపీఈఓ మంజులతో కలిసి కర్నూలులోని సీతారాంనగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉండేది. శివప్రియాంక సూసైడ్‌నోట్ బుధవారం ఉదయం మంజుల విధులకు వెళ్లిన తర్వాత శివప్రియాంక డ్యూటీకి వెళ్లకుండా గది తలుపులు మూసి.. ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంజుల సాయంత్రం తిరిగి వచ్చేసరికి గది తలుపులు మూసి ఉన్నాయి. గట్టిగా తట్టినప్పటికీ తెరుచుకోకపోవడంతో ఇరుగూపొరుగువారి సాయంతో బద్దలు కొట్టారు. శివ ప్రియాంక ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. నాల్గవ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. గదిలో ఉన్న సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకుని.. ఇరుగూ పొరుగు వారిని విచారించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు కారణం సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాలేనా? లేక ఇతరత్రా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులను విచారిస్తే తప్ప పూర్తి సమాచారం వచ్చే అవకాశం లేదని నాల్గవ పట్టణ సీఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి!
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీలో వైద్యుల నిర్లక్ష్యానికి మరో యువకుడు మృతి చెందాడు. వారం రోజుల క్రితం సరైన వ్యాధి నిర్ధారణ జరగక, సకాలంలో వైద్యం అందక ఒకరు మృతి చెందిన విషయం విదితమే. తాజాగా మరో యువకుడు సరైన చికిత్స అందక తనువు చాలించాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన కేశాలు, రూతమ్మలకు ఇద్దరు కుమారులు. వీరిది వ్యవసాయ కుటుంబం. పెద్ద కుమారుడైన చక్రవర్తి(20) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం వ్యక్తిగత కారణాలతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి విషమిస్తుండటంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చిన అతనికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మేల్ మెడికల్(ఎంఎం)–7 వార్డులో అడ్మిట్ చేశారు. వాస్తవంగా ఇలా క్రిమిసంహారక మందు తాగిన వారిని వార్డులో గాకుండా ముందుగా ఏఎంసీ విభాగానికి తరలిస్తారు. కానీ వైద్యులు వార్డుకు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించింది. వెంటనే క్యాజువాలిటీకి తీసుకురాగా అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో క్యాజువాలిటీలో కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. వార్డుకు గాకుండా ఏఎంసీ విభాగానికి తీసుకెళ్లి అత్యవసర వైద్యం అందించి ఉంటే తమ కుమారుడు బతికేవాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే తన కుమారుని మృతికి కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
మహిళ దారుణ హత్య
సాక్షి, కర్నూలు (టౌన్) : స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త తెలిపిన వివరాలు.. స్థానిక ఎల్కూరు ఎస్టేట్‌లోని రెవెన్యూ కాలనీలో వెంకటేశ్వరరెడ్డి, చంద్రకళావతి (50) దంపతులు ఇల్లు నిర్మించుకుని, ఏడాది కాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా పూనేలో ఉండగా, వెంకటేశ్వరరెడ్డి డోన్ ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయంఅతడు డోన్‌కు బయలుదేరి వెళ్లాడు. మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మరోసారి ప్రయత్నించగా అవుటాఫ్ ఆర్డర్ అని రావడంతో అనుమానంతో ఇంటి సమీపంలోని బంధువు(మరదలు)కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్లి చూడగా చంద్రకళావతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం గమనించి వెంకటేశ్వరరెడ్డికి సమాచారం ఇచ్చింది. అతడు ఇంటికి చేకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు డీఎస్పీ బాబా ఫకృద్దీన్, మూడో పట్టణ సీఐ ఓబులేసు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ రప్పించి పరిసరాలను తనిఖీ చేయించారు. మృతురాలి పుస్తెల గొలుసు, సెల్‌ఫోన్ కనిపించడం లేదని భర్త పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
మూత్ర విసర్జన చేస్తుండగా హత్యాయత్నం
కర్నూలు ,కల్లూరు : ఉలిందకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుసులూరు–రేవడూరు గ్రామాల మధ్య ఆదివారం ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుసులూరు గ్రామానికి చెందిన మాల మౌలాలి తన స్నేహితుడితో కలిసి వెల్దుర్తికి వెళ్లి తిరిగొస్తూ రేమడూరు–పుసులూరు మధ్య మూత్ర విసర్జనకు నిలిచారు. మౌలాలి మూత్ర విసర్జన చేస్తుండగా రేమడూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాగంటయ్య పాత కక్షలు మనసులో పెట్టుకుని ఆటోతో ఢీ కొట్టాడు. అతను ఎగిరి కిందపడ్డాడు. పక్కనే ఉన్న మౌలాలి స్నేహితుడు ఆటోను కొద్దిదూరం వెంబడించాడు. అయితే.. అతను దొరకలేదు. గాయపడిన మౌలాలిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ శంకరయ్య ఆసుపత్రి దగ్గరకు చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. -
బాలికపై అత్యాచార యత్నం
సాక్షి, కర్నూలు(ఎమ్మిగనూరు రూరల్) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదుటనున్న ఉషా ఫ్యామిలీ రెస్టారెంట్ వెనక శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన పదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక తలను గోడకు కొట్టి అత్యాచారం చేయబోగా.. ఆ చిన్నారి కేకలు వేయటంతో అతను పారిపోయాడు. రక్త గాయాలతో పడి ఉన్న బాలికను అక్కడ పనిచేసే కొందరు గమనించి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ శ్రీధర్, పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని సీఐ శ్రీధర్ తెలిపారు. -
వీడిన హత్య కేసు మిస్టరీ
సాక్షి, కర్నూలు : కర్నూలు నగరం బుధవారపేటకు చెందిన ఆటో డ్రైవర్ మద్దిలేటి దారుణ హత్యకేసు మిస్టరీ వీడింది. కల్లూరు మండలం ముజఫర్‌నగర్‌కు చెందిన పాత నేరస్తులే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్ రెహమాన్, షేక్షావలి, మాసపోగు తేజ, మల్లెపోగు సురేష్లను అరెస్టు చేసి కర్నూలు ఇన్చార్జ్ డీఎస్పీ బాబాఫకృద్దీన్ ఎదుట హాజరుపర్చారు. సోమవారం సాయంత్రం మూడో పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ రామకృష్ణారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలను వెల్లడించారు. నలుగురు ముఠాగా ఏర్పడి సినీ ఫక్కీలో దొంగతనాలు పాల్పడుతుంటారు. ఆటోలో వెళ్లే ప్రయాణికులను లక్ష్యంగా చేరుకుని చోరీలకు పాల్పడేవారు. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మార్చుకోలేదు. ఈ నెల 19న బుధవారపేటకు చెందిన ఆటో డ్రైవర్ మద్దిలేటి బిర్లాగేట్ వద్ద ఉన్న దుకాణంలో మద్యం సేవించాడు. బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డుపై వేచి ఉండగా ముఠా సభ్యులు ఆటోలో వచ్చి మద్దిలేటిని ఎక్కించుకున్నారు. కృష్ణదేవరాయ సర్కిల్ వద్ద వెళ్లేలోగా అతని జేబులు తనిఖీ చేశారు. ఏమీ లేకపోవడంతో మార్గమధ్యలోనే దింపేయత్నం చేశారు. తాను దిగనని ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకెళ్లాల్సిందేనని మద్దిలేటి పట్టుబట్టంతో కోపంతో వారు కిసాన్ఘాట్వైపు తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ సమీపంలో ఆటోలో నుంచి తోసేసి కర్రతో తలపై బాది వెళ్లిపోయారు. తీవ్ర రక్త స్రావంతో మద్దిలేటి అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. సీసీ కెమెరాల ద్వారా ఆటో, నిందితులను గుర్తించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. శిక్ష తప్పదని కర్నూలు వీఆర్వో కృష్ణదేవరాయల వద్దకు వెళ్లి నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయారు. పోలీసు స్టేషన్లో తమను హాజరు పెట్టమని అభ్యర్తించారు. వీఆర్వో సూచన మేరకు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నేరానికి ఉపయోగించిన ఏపీ21టీయూ6994 ఆటోతో పాటు 3సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వివరించారు. ఎస్ఐలు వెంకట సుబ్బయ్య, లక్ష్మినారాయణ, హెడ్ కానిస్టేబుళ్లు మద్దీశ్వర్,వెంకటస్వామి, రుద్రగౌడ్, పీసీలు లక్ష్మినారాయణ, పాండునాయక్, షేక్షావలి, వినోద్ తదితరులను డీఎస్పీ అభినందించారు. -
భర్త హత్యకు భార్య కుట్ర
సాక్షి, కర్నూలు(బొమ్మలసత్రం) : భర్త హత్యకు కుట్ర పన్నిన ఓ భార్యను, ఆమె ప్రియుడిని నంద్యాల రూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రూరల్ ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాలు.. నంద్యాల పట్టణ సమీపంలోని నందమూరి నగర్‌కు చెందిన కరిముల్లా, కరిష్మా దంపతులకు ఐదుగురు సంతానం. కరిముల్లా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్లుగా ఇంటి పక్కనే నివాసం ఉండే వెంకటేశ్వర్లుతో కరిష్మా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తన భర్తను కూడా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పింది. అందులోభాగంగా ఈ నెల 20న రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేస్తున్న కరిముల్లాపై వెంకటేశ్వర్లు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అతడు తేరుకొని కేకలు వేస్తూ బయటకు పరుగెత్తడంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోగా వెంకటేశ్వర్లు పరారయ్యాడు. కరిముల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు నందమూరినగర్‌లో విచారించారు. భార్యపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా వివాహేతర సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది. కరిష్మాను, ఆమె ప్రియుడు వెంకటేశ్వరును మంగళవారం అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు. -
అమ్మ ఎక్కడుంది నాన్నా?!
సాక్షి, కర్నూలు : అమ్మతోటే వారి లోకం..ఏ అవసరమొచ్చినా తల్లినే అడిగేవారు.. ఆకలేసినా..ఆపదొచ్చినా..అమ్మ ఉందనే ధైర్యం వారిలో ఉండేది. తండ్రి మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకునే వాడు కాదు.. తల్లే పిల్లల ఆలనాపాలనా చూస్తుండేది. అయితే మద్యం పెట్టిన చిచ్చు ఆ ఇంట్లో ఇల్లాలిని బలితీసుకుంది. నలుగురు పిల్లలను దిక్కులేని వారిని చేసింది. ‘‘నాన్నా..అమ్మ ఎక్కడుంది’’ అంటూ చిన్నారులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. వివరాలు ఇవీ.. డోన్ పట్టణం ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఈరన్నకు సమీపంలోని అబ్బిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వరలక్ష్మికి 2004లో వివాహమైంది. ఈరన్న గతంలో గౌండా పని చేసుకుని జీవనం సాగించేవాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనికి సంబంధించిన రేకులు బాడుగకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య వరలక్ష్మి(30) ఇళ్లకు పెయింటింగ్ వేసే పనికి వెళ్లేది. వీరికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో మద్యం చిచ్చుపెట్టింది. సరదాగా ప్రారంభమైన మద్యం అలవాటుకు ఈరన్న క్రమంగా బానిసయ్యాడు. చీకటి పడగానే పని నుంచి ఇంటికి వచ్చే భర్త తాగి రావడం భార్య వరలక్ష్మికి నచ్చలేదు. మద్యం మానాలని పలుమార్లు చెప్పి చూసింది. మద్యం వల్ల కలిగే అనర్థాలు, చుట్టుపక్కల జరిగిన ఘటనల గురించి భర్తకు చెప్పేది. రోజూ మద్యం మానతానని చెప్పి తిరిగి తాగి రావడంతో వరలక్ష్మికి విసుగు పుట్టింది. ఈ విషయమై ఆదివారం రాత్రి భర్తతో గొడవ పడింది. ఈ క్రమంలో ఇరువురి మధ్యా వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో చేయి చేసుకున్నాడు. దీంతో వరలక్ష్మి మనస్తాపానికి గురై సోమవారం ఉదయం భర్త ఇంట్లో లేని సమయంలో టీలో పేల నివారణకు ఉపయోగించే మందును కలిపి ముందుగా పిల్లలకు ఇచ్చింది. ఆ తర్వాత తానూ తాగింది. కాసేపటికి భర్త ఇంటికి వచ్చి నోట్లో నురగలు కక్కుతున్న వారిని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరలక్ష్మి కొద్దిసేపటికే మృతిచెందింది. పిల్లలు ఇందు(12), ఉమాదేవి(10), ఉదయ్‌కుమార్(6), ఐశ్వర్య(4)చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. వీధిలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, ఆత్మహత్యాయత్నం చేసినా ఎందుకిలా చేశారంటూ ధైర్యం చెప్పే తన భార్య ఇంత పని చేస్తుందనుకోలేదని భర్త ఈరన్న కన్నీరుమున్నీరయ్యాడు. కాగా తల్లి మరణ విషయం తెలియక అమ్మ ఎక్కడుందని పిల్లలు అడుగుతుండటం చూసి పలువురు కంట తడిపెట్టారు. డోన్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి శంషాద్ బేగం డోన్‌లోని మృతురాలి ఇంటి వద్దకు చేరుకొని ఇరుగు పొరుగును విచారించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వారి వారి పరిధుల్లోని ప్రజల జీవన పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించారు. -
అక్రమార్జనలో ‘సీనియర్’
సాక్షి, కర్నూలు : ఆయన రూటే సప‘రేటు’. ఆలోచనే భారీ ‘రేటు’. ఎక్కడ చేయి చాపినా కాసుల పంట పండాల్సిందే. ఏ ఫైలు ముట్టుకున్నా ‘ఆదాయం’ కళ్ల జూడాల్సిందే. లేదంటే ఆయన మనసొప్పదు. ఎవరి ఫైళ్లు అయినా నిలబెట్టేస్తాడు. తనను రహస్యంగా కలవాలని ఆదేశిస్తాడు. అడిగినంత సమర్పించుకుంటేనే పని అవుతుంది. లేదంటే అంతే సంగతి! ప్రస్తుతం ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరాల సంజీవరెడ్డి తీరిది. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు సెర్చ్ వారెంట్‌తో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో సీఐలు శ్రీధర్, గౌతమి, తేజేశ్వరరావు తదితరులు రెండు బృందాలుగా ఏర్పడి సంజీవరెడ్డి నివాసముంటున్న కర్నూలు ధనలక్ష్మి నగర్‌తో పాటు అత్తమామల స్వగ్రామమైన వెలుగోడు మండలం మోతుకూరులో ఏకకాలంలో సోదాలు చేశారు. నివ్వెరపోయిన ఏసీబీ అధికారులు ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు పది చోట్ల స్థలాలు, రెండు చోట్ల బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు...ఇలా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నకొద్దీ ఏసీబీ అధికారులు నివ్వెరపోయారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్ల తలుపులు మూసి సోదాలు చేశారు. ఈ సందర్భంగా దొరికిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దస్తావేజుల ప్రకారం దాదాపు రూ.రెండు కోట్ల విలువైన అక్రమాస్తులు పోగేసుకున్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.5 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సంజీవరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు. కేసు పరిశోధన కొనసాగుతోందని డీఎస్పీ నాగభూషణం వెల్లడించారు. సంజీవరెడ్డి ఉద్యోగ జీవితానికి సంబంధించి లోతుగా చూస్తే అనేక చీకటి కోణాలు కన్పిస్తున్నాయి. విధుల్లో చేరినప్పటి నుంచే.. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి సంజీవరెడ్డి స్వగ్రామం. తండ్రి నరాల స్వామిరెడ్డి కొత్తపల్లి మండలం లింగాపురం గ్రామ మునసబ్æగా పనిచేస్తూ మృతి చెందారు. దీంతో కారుణ్య నియామకం కింద సంజీవరెడ్డికి 1997లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం వచ్చింది. ఆత్మకూరు మండలం వెంకటాపురం, జూపాడుబంగ్లా మండలం తూడిచర్ల గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్ఏ)గా పనిచేశారు. అప్పటినుంచే అక్రమార్జనే పరమావధిగా అడుగులేసినట్లు తెలుస్తోంది. పదో తరగతి వరకు చదువుకున్న ఈయన ఉద్యోగంలో పదోన్నతి కోసం ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2002లో పదోన్నతి పొంది.. 2011 వరకు వీఆర్వోగా కొత్తపల్లి, జూపాడుబంగ్లా, ఆత్మకూరు మండలాల్లో విధులు నిర్వర్తించారు. 2011లో జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది కలెక్టరేట్లో కొంత కాలం పనిచేశారు. అలాగే 2012లో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది కలెక్టరేట్లోనే పనిచేశారు. ఆ తర్వాత కర్నూలు ఆర్ఐగా మూడేళ్ల పాటు, కల్లూరు ఆర్ఐగా రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించారు. ఈ çసమయంలోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేసే వ్యాపారులతో కుమ్మకై భారీగా సొమ్ము చేసుకున్నట్లు విమర్శలున్నాయి. అక్రమ ఆదాయం విషయంలో అప్పటి కర్నూలు వీఆర్వో శ్రీనివాసరెడ్డితో విభేదాలు తలెత్తి.. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. కొత్తపల్లిలో 15 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుని చట్టబద్ధం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆస్తులపైనే వెచ్చింపు.. సంజీవరెడ్డి అక్రమార్జన సొమ్మును భూములు, ఇళ్లపైనే వెచ్చించినట్లు తెలుస్తోంది. కర్నూలుతో పాటు స్వస్థలం కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు, ఇంటిస్థలాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ సోదాల్లో లభించిన పత్రాలను బట్టి స్పష్టమవుతోంది. ఏసీబీ అధికారులు గుర్తించిన సంజీవరెడ్డి ఆస్తుల చిట్టా ⇒ కర్నూలు నగరం ధనలక్ష్మినగర్‌లో 5.5సెంట్ల విస్తీర్ణంలో అధునాతన జీ ప్లస్2 భవనం. సమీపంలోనే భార్య పేరుతో 5.50 సెంట్ల ఇంటి స్థలం. ⇒ 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదు, కర్నూలు మండలం పసుపలగ్రామంలో 5సెంట్ల ఇంటి స్థలం, మండల కేంద్రం కొత్తపల్లిలో రెండు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇంటిస్థలానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి పరుల ఆట కట్టిస్తాం లంచం తీసుకునే, ఆదాయానికి మించి ఆస్తులు పోగేసుకునే ఏ ఒక్కరినీ వదలబోం. అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మావంతు ముందడుగు ఉంటుంది. ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరం. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ధైర్యంగా సమాచారం ఇచ్చినçప్పుడే అవినీతిపరులకు కళ్లెం వేయగలం. లంచం తీసుకునేందుకు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా భయపడే పరిస్థితులు రావాలి. ఆ దిశగా మా కార్యాచరణ ఉంటుంది. – ఏసీబీ డీఎస్పీ నాగభూషణం -
అత్తారింటికి వెళ్తే.. మర్మాంగాన్ని కోసేశారు
సాక్షి, కర్నూలు: భార్యను కాపురానికి తీసుకెళ్లడం కోసం అత్తారింటికి వెళ్లిన ఓ యువకుడి మర్మాంగం కత్తిరించి కారంపొడితో దాడి చేసి ఘటన గడివేముల మండలం సోమాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..పాణ్యం మండలం ఎస్.కొట్టాల గ్రామానికి చెందిన యునూస్‌కు సోమాపురం గ్రామానికి చెందిన హసీనాతో రెండేళ్ల క్రితం వివాహమైంది. మనస్పర్థలతో హసీనా తరచూ పుట్టింటికి వెళ్లేది. ఈ క్రమంలో బక్రీద్ పండగరోజు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం రాత్రి పోలీసులు యునూస్ తీసుకొని సోమాపురం వెళ్లారు. హసీనాను కాపురానికి తీసుకెళ్లాలని సూచించి వెళ్లిపోయారు. అయితే రాత్రి మంచంపై పడుకున్న యునూస్ కాళ్లు, చేతులను హసీనా, ఆమె సోదరుడు కట్టివేశారు. హసీనా కత్తెర తీసుకుని యునూస్ మర్మాంగాన్ని కత్తిరించగా..ఆమె సోదరుడు నోరు మూశాడు. యునూస్ ప్రతిఘటించటంతో హసీనా సోదరుడు రోకలి బండతో తలపై మోదాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతనిపై కారం చల్లి ఇష్టానుసారంగా దాడి చేశారు. తెల్లవారగానే చేతులకు,కాళ్లకు ఉన్న కట్లు ఊడదీసుకుని అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎస్.కొట్టాలకు చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మర్మాంగం నరాలు తెగిపోయాయని శస్త్రచికిత్స నిర్వహిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గడివేముల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి : మూఢనమ్మకం మసి చేసింది -
నపుంసకునితో వివాహం చేశారని..
సాక్షి, జూపాడుబంగ్లా(కర్నూలు): నమ్మించి తనకు నపుంసకునితో వివాహం చేసి మోసం చేశారని మండ్లెం గ్రామానికి చెందిన మంతసాగరిక అనే యువతి సోమవారం జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాలు.. మండ్లెం గ్రామానికి చెందిన సుశీలమ్మ కుమార్తె మంత సాగరికను కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన కుమారస్వామి కుమారుడు వెంకటేశ్వర్లుకు ఇచ్చి 2018 ఆగస్టు 17న వివాహం చేశారు. వివాహమైనప్పటి నుంచి తన భర్త తనతో కాపురం చేయటం లేదని బాధితురాలు అత్త కృష్ణవేణి, మామ కుమారస్వామిలకు తెలియజేయటంతోపాటు డాక్టర్ల వద్ద చూపించినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొంది. విషయం.. పుట్టింలోగానీ, ఇంకా ఎవరికైనా గానీ చెబితే చంపేస్తామంటూ శారీరకంగా, మానసికంగా తనను అత్త, మామలు చిత్రహింసలకు గురిచేశారని వాపోయింది. కొడుకు నపుంసకుడని తెలిసి తనను మోసం చేసి, అతనితో వివాహం చేసి, తనను మోసగించి, జీవితాన్ని నాశనం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. (చదవండి : ఘరానా మోసగాడు.. ఏడు పెళ్లిళ్లు) -
నల్లమలలో వేటగాళ్ల హల్చల్
సాక్షి, కర్నూలు(ఆత్మకూరురూరల్) : నల్లమలలో గురువారం రాత్రి వేటగాళ్ళు రెచ్చిపోయారు. వేటగాళ్ళు నాటుతుపాకీతో రెండు పొడదుప్పు(స్పాటెడ్ డీర్) లను కాల్చి చంపి మాంసంగా మార్చి తరలిస్తూ అటవీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బైర్లూటీ ఎఫ్ఆర్ఓ శంకరయ్య తెలిపిన మేరకు నలమలలో అలజడి రేపిన ఈ ఘటన వివరాలు.. ఆత్మకూరు అటవీ డివిజన్లోని రుద్రకోడు అటవీ సెక్షన్లో ఉన్న సీతమ్మ పడె ప్రాంతంలో గురువారం రాత్రి గస్తీ తిరుగుతున్న అటవీ సిబ్బందికి కొందరు వేటగాళ్లు సైకిల్‌పై మాంసాన్ని తరలిస్తూ కనిపించారు. అటవీ సిబ్బంది వారిని వెంటాడి పట్టుకునే యత్నం చేయగా ఇరువురు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన డేరంగుల మురళి సైకిల్‌పై తరలిస్తున్న సుమారు 50 కేజీల దుప్పి మాంసం, ఒక ఎస్బీ ఎంల్ (సింగిల్ బ్యారల్ మజిల్ లోడ్) నాటు తుపాకీతో పట్టుబడ్డాడు. అతన్ని అటవీ అధికారులు ప్రశ్నించగా సిద్దాపురం గ్రామానికి చెందిన కుంచాల రంగన్న, ఆనంద్‌లతో కలసి నాటుతుపాకితో దుప్పుల మందపై కాల్పులు జరపగా రెండు దుప్పులు మృతిచెందినట్లు తెలిపాడు. వాటిని ముక్కలుగా కట్ చేసి గ్రామాల్లో విక్రయించేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నాడు. రుద్రకోడు ఎఫ్బీలో శ్రీనివాసులు నిందితులపై పీఓఆర్ నమోదు చేశారు. పశువైద్యాధికారి రాంసింగ్ దుప్పుల శరీర భాగాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం నిందితుడు మురళిని నంద్యాల జెఎఫ్ఎంసీ ముందు హాజరు పరిచగా జూనియర్ సివిల్ జడ్జీ 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. వేటగాళ్లను అరెస్టు చేసిన అధికారుల బృందంలో ఎఫ్‌ఎస్‌ఓలు వెంకటరమణ, తాహీర్, ఎఫ్‌బీఓలు శ్రీనివాసులు, మహబూబ్ బాషా ఉన్నారు. -
ఉద్యోగం పేరుతో మహిళను దుబాయ్‌కి పంపి..
సాక్షి, కర్నూలు : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దూరపు బంధువుల ద్వారా కర్నూలు నగరానికి చెందిన ఓ మహిళను ఉద్యోగం పేరుతో దుబాయికి పంపించాడు. అంతే అక్కడ చిత్రహింసలకు గురైన బాధిత మహిళ తన దీనస్థితిని వాట్సాప్‌లో పెట్టడంతో స్పందించిన పోలీసులు బాధితురాలిని సురక్షితంగా రప్పించారు. వివరాలు.. నగరంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని చిత్తారివీధికి చెందిన మున్నీ అనే మహిళ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో కడపలో ఉన్న బంధువులు అక్కడే ఉన్న మొహినుద్దీన్ అనే పాస్‌పోర్టు ఏజెంటును సంప్రదించి మున్నీకి దుబాయిలో ఉద్యోగం చూపించాలని విన్నవించారు. వివరాలు సేకరించిన ఆ ఏజెంట్ కర్నూలులోని మహిళ ఇంటికి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇటీవల దుబాయి పంపించాడు. అక్కడకు వెళ్లినప్పటి నుంచి యజమాని మానసికంగా వేధించడంతో బాధితురాలు మున్నీతో పాటు ఇదే సమస్యను ఎదుర్కొంటున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో ముగ్గురితో కలిసి వాట్సాప్ ద్వారా వారి బాధలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన ఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఒకటో పట్టణ పోలీసులను ఆదేశించారు. పోలీసులు విషయాన్ని దుబాయిలోని భారత కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితురాలిని ఇండియాకు రప్పించారు. ఇదే సమయంలో కడపలోని బాధితురాలి బంధువులు ఏజెంట్ మోసంపై పాల్పడి తమ కూతురును అమ్మేశారని పోలీసులకు గత నెల 26న ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు మోసగాడిని కడపలో అరెస్టు చేసి ఇక్కడికి తీసుకు వచ్చినట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. బుధవారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. -
ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : భవిష్యత్ ఉన్న కుర్రాడు.. ఆటలో విజయ పరంపర సాగిస్తున్న క్రీడాకారుడు . రెండు రోజుల్లో బెంగళూరులో జరిగే రాష్ట్రస్థాయి అండర్19 జట్టులో ఆడాల్సిన ఆటగాడు అర్ధంతరంగా ప్రాణం తీసుకున్నాడు. తండ్రి బైక్ ఇవ్వలేదనే క్షణికావేశంలో ఉరి వేసుకొని ఊపిరి తీసుకున్నాడు. పట్టణంలోని ఎస్ఎంటీ కాలనీలో శనివారం చోటుచేసుకున్న ఘటన వివరాలు కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన ఖాసీంనాయుడు, సరస్వతికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌నాయుడు(19) స్థానిక శ్రీ రాఘవేంద్ర కాలేజీలో ఇంటర్ సీఈసీ రెండో ఏడాది చదువుతూ క్రికెట్లో రాణిస్తున్నాడు. రాష్ట్రస్థాయి అండర్–19 పోటీలకు ఎంపికయ్యాడు. శిక్షణ శిబిరానికి ఈ నెల 8న బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే శుక్రవారం ఆదోనిలో జరిగే వినాయక నిమజ్జన వేడుకలకు వెళ్లేందుకు తనకు బైక్ ఇవ్వాలని తండ్రి ఖాసీంనాయుడుకు ఫోన్ చేసి అడిగాడు. బీఎస్ఎన్ఎల్లో కాంట్రాక్ట్ కార్మికుడైన తండ్రి తాను పనిలో ఉన్నానని, బైక్ ఇవ్వడం వీలు కాదని, ఎక్కడికీ వెళ్లవద్దని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయినా స్నేహితుల బైక్‌పై వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి బెడ్ రూంలో నిద్రించాడు. తల్లి సరస్వతి బ్యూటీ పార్లర్ శిక్షణ నిమిత్తం కర్నూల్‌కు వెళ్లింది. తండ్రి విధులు ముగించుకొని ఆలస్యంగా వచ్చి భోంచేసి పడుకున్నాడు. ఉదయం ఎంతకూ బెడ్రూం తలుపులు తీయకపోవడంతో కిటికిలోంచి చూడగా కుమారుడు ఉరికి వేలాడుతుండడంతో తండ్రి కుప్పకూలిపోయాడు. ఇంటి పక్కల వారి సాయంతో కుమారుడిని కిందకు దించి మృతదేహాన్ని స్వగ్రామం హాలహర్వికి తీసుకెళ్లారు. చేతికి వచ్చిన కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇది చదవండి : కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి.. -
లభించని చిన్నారి ఆచూకీ
సాక్షి, పాములపాడు(కర్నూలు): తండ్రి కర్కశత్వానికి గురైన చిన్నారి తేజప్రియ ఆచూకీ లభించలేదు. ఈ నెల 2న మండలంలోని పెంచికలపల్లి గ్రామానికి చెందిన వానాల వెంకటేశ్వర్లు తన భార్య దేవమ్మ, కూతురు తేజప్రియ(3)లను వెలుగోడు మండలం గుంతకందాల గ్రామ సమీపంలోని నిప్పులవాగులో తోసేసిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న పోలీసులు నిప్పులవాగు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 4న అబ్దుల్లాపురం పవర్‌ప్లాంట్ వద్ద దేవమ్మ చీర లభ్యమైంది. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గాలింపు చర్యలకు కొంత మేర ఇబ్బంది ఏర్పడింది. ఆత్మకూరు, నందికొట్కూరు సీఐలు శివనారాయణస్వామి, సుబ్రమణ్యం, పాములపాడు, వెలుగోడు, ఆత్మకూరు ఎస్ఐలు రాజ్‌కుమార్, రాజారెడ్డి, ఓబులేసు, నాగేంద్ర ప్రసాద్ తమ సిబ్బందితో మూడు రోజులు విస్తృతంగా నిప్పులవాగు వెంట గాలింపు చర్యలు చేపట్టడంతో గురువారం దేవమ్మ మృతదేహం లభ్యమైంది. అక్కడే పంచనామా నిర్వహించి శుక్రవారం పెంచికలపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా చిన్నారి తేజప్రియ ఆచూకీ తెలియలేదు. మూడేళ్ల చిన్నారి కావడంతో ప్రవాహం వేగంగా ఉండటం వల్ల దిగువకు వెళ్లి ఉండవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. ఇది చదవండి : రెండో పెళ్లికి అడ్డువస్తున్నారని; భార్య, కూతురిని.. -
కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి..
సాక్షి, వెల్దుర్తి(కర్నూలు): హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)పై గురువారం అర్ధరాత్రి దారిదోపిడీ జరిగింది. వెల్దుర్తి మండల పరిధిలోని మంగంపల్లె, సూదేపల్లె స్టేజ్‌ల మధ్య(అమకతాడు టోల్గేట్ సమీపంలో) చోటుచేసుకున్న ఈ ఘటన సినీ ఫక్కీని తలపించింది. బాధితుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా ఓటికి చెందిన స్వాప్నిక్ తన స్నేహితులు అమర్, మయూర్‌తో కలిసి కారులో మైసూరులో ఉంటున్న అన్న వద్దకు బయలుదేరారు. వీరంతా పాలిష్ కటింగ్ మేస్త్రీలు. గురువారం అర్ధరాత్రి మంగంపల్లె, సూదేపల్లె స్టేజ్‌ల మధ్య కారు వెళ్తుండగా వెనుక నుంచి మరో కారు వచ్చి స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో స్వాప్నిక్, స్నేహితులు వెళుతున్న కారు రోడ్డు నుంచి ఎడమవైపునకు దిగిపోయి పక్కన ఖాళీ స్థలంలో ఆగింది. ఇంతలోనే వెనుక నుంచి ఢీకొన్న కారులోంచి(నంబరు లేని రెడ్ కలర్ కారు) ఐదుగురు దుండగులు దిగి.. స్వాప్నిక్, స్నేహితులు ఉన్న కారు వద్దకు వచ్చారు. వచ్చీ రావడంతోనే కారు ముందు అద్దాన్ని తమ వద్ద ఉన్న పిడిబాకు, కత్తులతో బాది హంగామా చేశారు. ‘పైసా నికాల్’ అంటూ స్వాప్నిక్‌పై దాడికి దిగారు. మొహంపై బాదారు. కత్తులతో బెదిరించారు. స్వాప్నిక్‌తో పాటు అతని స్నేహితులు భయభ్రాంతులకు గురయ్యారు. తమ వద్ద ఉన్న రూ.10వేల నగదు ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా వారి వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు, మూడు బ్యాగులు, కారు తాళం చెవి తీసుకుని తమ కారులో టోల్గేట్ వైపు ఉడాయించారు. కారు ఢీకొనడం, రోడ్డు దిగి వెళ్లిపోవడాన్ని అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు గుర్తించి.. సమీపంలోని టోల్గేట్ సిబ్బందికి సమాచారమందించారు. వారు వచ్చి విషయం తెలుసుకుని వెల్దుర్తి పోలీసులకు తెలియజేశారు. దీంతో ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి సంఘటన స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పిడిబాకులు, కత్తులతో కారు అద్దాలపై దాడి చేసిన సందర్భంగా ఒక కత్తి పిడి వరకు విరగ్గా..దాన్ని అక్కడే పడేశారు.దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. డోన్ రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి, డోన్ రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావ్‌తో కలిసి మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్దుర్తి ఎస్ఐ తెలిపారు. టోల్గేట్లలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు గతంలో ఇలాంటి దోపిడీలు చేసిన వారిపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. గతంలోనూ దోపిడీలు సూదేపల్లె, మంగంపల్లె స్టేజ్‌ల సమీపాన గతంలోనూ పలుమార్లు దారి దోపిడీలు జరిగాయి. దుండగులు వృద్ధురాలిపై దాడికి పాల్పడి, వివస్త్రను చేసిన ఘటనతో పాటు లారీలను అటకాయించి డ్రైవర్లు, క్లీనర్లపై దాడులకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఆ కేసులను ఇప్పటి వరకు పోలీసులు ఛేదించిన దాఖలాలు లేవు. మళ్లీ ఆలాంటి ఘటన చోటుచేసుకోవడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చదవండి : పెద్దాసుపత్రిలో దొంగలు -
సీసీ కెమెరా తీగలు కత్తిరించి.. పెద్దాసుపత్రిలో దొంగలు
సాక్షి, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నా వాటి కళ్లుగప్పి మరీ చోరీ చేస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో వైద్యులు, ప్రజలు, రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రికి వివిధ ప్రాంతాల నుంచి రోజూ ఓపీకి 3వేల మంది దాకా, ఇన్‌పేషంట్లుగా, 1500 మంది చేరుతుంటారు. రోజూ 8 వేల మంది దాకా సహాయకులు వస్తుంటారు. వీరితో పాటు వైద్యులు, నర్సులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది కలిసి 2,500 మంది దాకా పనిచేస్తున్నారు. ఇన్ని వేల మంది తిరుగుతున్న ఆస్పత్రిలో సెక్యూరిటీ అధ్వాన్నంగా ఉంది. సెక్యూరిటీ కోసం గత ప్రభుత్వం ఆసుపత్రిలో జై బాలాజీ సెక్యూరిటి ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ ఐదు నెలలుగా సెక్యూరిటీ గార్డులకు జీతాలు ఇవ్వడం లేదు. దీంతో కొంత మంది ఉద్యోగం మానేశారు. ఉన్న వారిలో అధిక శాతం నిరాశానిస్పృహలతో పనిచేస్తున్నారు. వరుస దొంగతనాలతో ఆందోళన ఆస్పత్రిలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రధానంగా రద్దీ అధికంగా ఉండే ఓపీ టికెట్లు ఇచ్చే ప్రాంతంలో డబ్బులు తస్కరిస్తున్నారు. ఒక్కో రూపాయి పోగుచేసుకుని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని వచ్చిన వారి బ్యాగ్‌లను లాఘవంగా బ్లేడ్‌తో కట్ చేసి పర్సులు దొంగిలిస్తున్నారు. ఇదే విధం గా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరి, గైనకాలజి, పీడియాట్రిక్స్, ఎక్స్‌రే విభాగం, అల్ట్రాసౌండ్, సిటి స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్‌ల వద్ద దొంగలు మాటు వేసి మరీ చోరీకి పాల్పడుతున్నారు. ఇవేగాక వార్డులో చికిత్స పొందుతున్న వారి వద్దకు వైద్యులుగా వైద్యసిబ్బందిలాగా వెళ్లి డబ్బులు, సెల్ఫోన్లు చోరీ చేస్తున్నారు. సీసీ కెమెరాల తీగలు కత్తిరించి... ఆస్పత్రిలో రక్షణకు, దొంగతనాలు, గొడవల నివారణకు గాను లక్షల రూపాయలు వెచ్చించి 185 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గత ఎనిమిదేళ్లలో నాలుగుసార్లు కెమెరాలు మార్చారు. అయితే కెమెరా కంట పడితే దొరికిపోతామని దొంగలు వాటి తీగలు కట్ చేస్తున్నారు. ఈ మేరకు ఆస్పత్రిలోని 185 కెమెరాల్లో 35కి పైగా కెమెరాలు పనిచేయడం లేదు. ప్రధానంగా రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో తీగలు వరుసగా కట్ చేస్తున్నారు. దీంతో చోరీ ఘటనలు చూసే అవకాశం లేకుండా పోతోందని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీ సంఘటనలు జనరల్ సర్జరీ విభాగంలో సెకండియర్ పీజీ చదువుతున్న డాక్టర్ ప్రవీణ్ గత శనివారం రాత్రి 12.30 గంటలకు హాస్టల్‌కు వచ్చి తన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్(ఏపీ39 ఎఫ్ 0809)ను బయట లాక్ చేసి వెళ్లాడు. ఉదయం వచ్చి చూసే సరికి బైక్ కనిపించలేదు. దీని విలువ దాదాపు రూ.2లక్షలు. మూడు రోజుల నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో హౌస్‌సర్జన్ చేస్తున్న డాక్టర్ సతీష్ గత నెల 29వ తేదీన క్యాజువాలిటి ఎదురుగా బైక్‌ను పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. బయటకు వచ్చేలోగా బైక్ కనిపించలేదు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రితో పాటు ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ దొంగ చోరీ చేసినట్లు గుర్తించారు. అయితే అందులో దొంగ ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఓర్వకల్లుకు చెందిన రామక్క తన భర్తకు చికిత్స చేయించేందుకు గత నెల 18న ఆసుపత్రికి వచ్చారు. ఓపీ కౌంటర్వద్ద ఓపీ టికెట్ తీసుకుని బయటకు వచ్చేలోగా చేతి కవర్లోని డబ్బులను తస్కరించారు. కవర్‌ను బ్లేడ్‌తో కత్తిరించి, అందులోని డబ్బుల కవర్‌ను చోరీ చేశారు. దీంతో ఆమె రోదిస్తూ ఇంటికి వెళ్లిపోయింది. నందికొట్కూరుకు చెందిన ధనుంజయ కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 26న ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు పరీక్షించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలని రాశారు. స్కానింగ్ చేయించుకుని బయటకు వచ్చేలోగా అతని తమ్ముని వద్ద ఉన్న పర్సును దొంగలు కొట్టేశారు. -
డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ దాడులు
సాక్షి, కర్నూల్ : పాణ్యం డిప్యూటీ తహసీల్దార్ పత్తి శ్రీనివాసులుపై ఏసీబీ దాడులు చేసింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో కోర్టు సెర్చ్ వారెంట్‌తో ఏసీబీ డిఎస్పి నాగభూషణం తన సిబ్బందితో కలసి ఈ దాడులు చేశారు. ఇందులో భాగంగా నంద్యాల, కొండు జూటూరు, కోవెల కుంట్లలో సోదాలు నిర్వహించగా, నంద్యాలలోని అద్దె ఇంట్లో ఒక ఇన్నోవా, రూ. లక్షన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. కోవెల కుంట్లలో భారీగా ఎల్ఐసి బాండ్లు కనుగొన్నారు. పట్టుబడిన సొమ్ము విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం కోటిన్నర రూపాయల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో లాకర్ ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
బాబాయ్ ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో..
సాక్షి, కర్నూలు : స్థానిక కటిక వీధికి చెందిన షంషావలి ఇంటిలో చోటు చేసుకున్న చోరీ ఘటన అతని అన్న కుమారుడి పనేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సొమ్మును రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోడుమూరు సీఐ పార్థసారథిరెడ్డి మంగళవారం విలేకరులకు వెల్లడించారు. గత నెల 28వతేదీ షంషావలి.. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న షంషావలి అన్న కొడుకు అనిఫ్ ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. బీరువాలోని రూ. 5 లక్షల విలువైన పది తులాల బంగారు బిస్కెట్, 6 గ్రాముల బంగారు ఉంగరం ఎత్తు కెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఏ పని లేకుండా తిరుగుతున్న నిందితుడు జల్సాల కోసం రూ. 5 లక్షలు అప్పు చేశాడని, రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడని సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ విజయభాస్కర్, ఏఎస్ఐ గోపాల్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
అందానికి ఫిదా అయ్యానంటూ.. ముంచేశాడు!
సాక్షి, కర్నూలు : మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తన వివరాలన్నీ వెబ్ సైట్లో పెట్టి ఓ యువతి మోసపోయింది. నంద్యాల వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. చాగలమర్రికి చెందిన బొమ్మగారి హజీమాబూబ్బీ బీకామ్ పూర్తిచేసి, పట్టణంలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. మంచి వరుడి కోసం షాదీ డాట్ కామ్‌లో తన ఫొటోలు, సెల్ నంబర్ అప్లోడ్ చేసింది. దీంతో తన పేరు అజీమ్వసీర్ అని, తాను కాలిఫోర్నియాలో వైద్యునిగా పనిచేస్తున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అందానికి ఫిదా అయ్యానంటూ సెల్ఫోన్లో మెసేజ్‌లు పెట్టాడు. ఒకసారి ఢిల్లీకి వస్తే తానూ వచ్చి చూసి వెళ్తానని గత నెలలో ఫోన్ చేసి చెప్పాడు. దీంతో యువతి ఢిల్లీ వెళ్లి ఎయిర్పోర్ట్ బయట అతడి కోసం గంటల కొద్దీ ఎదురు చూసింది. చివరకు ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావటంతో నిరాశతో వెనుదిరిగింది. రెండు రోజుల తర్వాత ఫోన్‌చేసి 6 లక్షల డాలర్ల బహుమతి తీసుకొస్తుండగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని, తనకు రూ.75 వేలు ఇస్తే పోలీసులకు చెల్లించి వచ్చేస్తానని నమ్మించడంతో బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమచేసింది. అనంతరం కొద్ది నిమిషాల్లోనే అతడి ఫోన్ అందుబాటులో లేదని సమాధానం రావటంతో మోసపోయానని తెలుసుకుని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది చదవండి : ప్రియుడితో ఏకాంతంగా ఉండటం భర్త చూడటంతో.. -
రెండో పెళ్లికి భార్య, కూతురు అడ్డుగా ఉన్నారని..
-
రెండో పెళ్లికి అడ్డువస్తున్నారని; భార్య, కూతురిని..
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాములపాడు మండంలం పెంచికలపల్లె గ్రామంలో నివసిస్తున్న వాడాలా వెంకటేశ్వర్లకు భార్య దేవమ్మ(28) మూడేళ్ల కూతురు ఉన్నారు. కాగా ఇటీవల రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వర్లు దానికి భార్య, కూతురు అడ్డుగా ఉన్నారని భావించి సమీపంలో ఉన్న నిప్పుల వాగులోకి తోసేశాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రియుడితో ఏకాంతంగా ఉండటం భర్త చూడటంతో..
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : భర్తపై ఓ భార్య, తన ప్రియుడితో కలిసి దాడి చేసిన ఘటన పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. సంజీవయ్య నగర్‌కు చెందిన జయరాముడు భార్య జ్యోతి అదే కాలనీకి చెందిన రాముతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి గతంలో పెద్దలు పంచాయతీ చేసి సర్దిచెప్పారు. అయినా జ్యోతిలో మార్పు రాకపోవడంతో పాటు మంగళవారం భర్త పొలానికి వెళ్లిన తర్వాత ప్రియుడు రాముని ఇంటికి పిలుచుకుంది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. ఇద్దరినీ లోపలే ఉంచి తలుపులు వేసేందుకు యత్నించగా భార్య గొంతు పట్టుకోగా ఆమె ప్రియుడు రాము కర్రతో తలపై దాడి చేసి పరారయ్యాడు. గాయపడి జయరాముడిని చికిత్స నిమిత్తంప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు
సాక్షి, కర్నూలు : అప్పుగా ఇచ్చిన రూ.100 తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు. ఈ ఘటన బుధవారం కోవెలకుంట్ల మండలం జోళదరాశి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి బంధువులు తెలిపిన కథనం మేరకు.. గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన వడ్డే వెంకటసుబ్బయ్య ఒకరికొకరు అప్పు ఇచ్చి పుచ్చుకునేవారు. అందులోభాగంగా వెంకటసుబ్బయ్య వద్ద వెంకటేశ్వర్లు రూ.100 అప్పు తీసుకున్నాడు. తిరిగివ్వమని వెంకటేశ్వర్లును పదేపదే కోరుతున్నా ఇప్పుడిస్తా, అప్పుడిస్తానంటూ కాలయాపన చేసేవాడు. బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటసుబ్బయ్యకు వెంకటేశ్వర్లు ఎదురుపడ్డాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించవా అంటూ వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పంచె ఊడిపోవడంతో అదనుగా భావించిన వెంకటసుబ్బయ్య మర్మాంగాన్ని కొరికేశాడు. స్థానికులు విడిపించి, తీవ్ర రక్తస్రావమైన వెంకటేశ్వర్లును హుటాహుటిన నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. బాధితుడి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నమ్మించి.. పాలేరు ప్రాణం తీసి.. రూ.52 లక్షలకు బీమా
సాక్షి, అవుకు : డబ్బు కోసం ఓ టీడీపీ నాయకుడు దుర్మార్గానికి పాల్పడ్డాడు. తమ కుటుంబాన్ని నమ్ముకుని వచ్చిన పాలేరు ప్రాణం తీశాడు. అతని పేరుతో భారీ మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించి.. ఆపై హత్య చేశాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.31 లక్షలు కాజేశాడు. మరో రూ.15 లక్షలు రాబట్టుకునే ప్రయత్నంలో ఉండగా.. విషయం బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవుకు మండలం మెట్టుపల్లె గ్రామానికి చెందిన శీగే ఈశ్వరరెడ్డికి వెంకటేశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి సంతానం. పెద్దకుమారుడైన వెంకటేశ్వరరెడ్డికి ప్యాపిలి మండలం గార్లదిన్నెకు చెందిన రాజమ్మతో రెండున్నర దశాబ్దాల క్రితం వివాహమైంది. అప్పటి వరకు రాజమ్మ పుట్టింట్లో పాలేరుగా ఉన్న వడ్డే సుబ్బరాయుడు ఆమెకు పెళ్లయిన తర్వాత మెట్టుపల్లెకు వచ్చి.. అక్కడ పనులు చేస్తుండేవాడు. తమ రెడ్డమ్మను నమ్ముకుని ఉంటే కూడు, గుడ్డకు లోటు ఉండదని భావించేవాడు. పదిహేనేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వరరెడ్డి చనిపోయాడు. తన యజమానురాలి భర్త మృతి చెందినా సుబ్బరాయుడు మాత్రం అక్కడే ఉంటూ పాలేరు పని చేస్తుండేవాడు. భాస్కర్‌రెడ్డికి దుర్బుద్ధి! వెంకటేశ్వరరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు. పదేళ్ల క్రితం గ్రామ సర్పంచ్‌గానూ పనిచేశాడు. ఇతను పాలేరును అడ్డంపెట్టుకుని అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని పన్నాగం పన్నాడు. ఇందులో భాగంగా నా అన్న వారెవరూ లేని సుబ్బరాయుడికి ఆధార్, రేషన్‌కార్డు తదితరాలను సమకూర్చి..అతని పేరున రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేశాడు. అలాగే దాదాపు రూ.52 లక్షలకు ఓ ప్రైవేట్ కంపెనీలో ఇన్సూరెన్స్ చేశాడు. నాలుగైదు కంతుల ప్రీమియం కూడా కట్టాడు. 2015వ సంవత్సరంలో గ్రామంలో తనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు, అవుకుకు చెందిన మరో ఇద్దరితో కలిసి సుబ్బరాయుడిని హత్య చేసి.. ప్రమాదంగా చిత్రీకరించారు. సుబ్బరాయుడు ప్రమాదంలో మృతి చెందాడంటూ ఇన్సూరెన్స్ కంపెనీని నమ్మించి.. మొదటివిడతలో సుమారు రూ.31 లక్షలు కాజేశాడు. రెండోవిడత కింద మరో రూ.15 లక్షలు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా..ఈ విషయం ఆ నోట ఈ నోట పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. సుమోటోగా కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు భాస్కరరెడ్డితో పాటు మరో నలుగురు వ్యక్తులను నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అవుకుకు చెందిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చూపే అవకాశముంది. -
వీళ్ల టార్గెట్ బ్యాంకుకు వచ్చే వాళ్లే..
సాక్షి, గడివేముల(కర్నూలు) : జిల్లాలో ఇటీవల వరుసగా బేతంచర్ల, గడివేముల, బనగానపల్లె ప్రాంతాల్లో బ్యాంకు వద్ద ఉన్న ప్రజలను మభ్యపెట్టి వారి బైక్‌లు, బ్యాగ్‌లలో ఉచిన నగదు, బంగారు దోచుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం గడివేముల పోలీసులు అరెస్ట్ చేశారని నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఓజి కుప్పం గ్రామానికి చెందిన కుంచల హరికృష్ణ, కుంచల శందిల్ అలియాస్ వెంకటేశ్వర్లు, హరికృష్ణ భార్య కుంచల దీప తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పట్టణానికి చెందిన వెంకటేష్ అనే నేరస్తుడితో కలిసి జిల్లాలో బేతంచర్ల, గడివేముల, బనగానపల్లె గ్రామాల్లో, అనంతపురం జిల్లా చిలమత్తురులో బ్యాంక్‌ల వద్ద మోటారు సైకిల్ డిక్కీల్లో డబ్బులు, బంగారం పెట్టుకెళ్లే వారిని గమనిస్తూ వారి దృష్టిని మళ్లించి చోరీ చేసేవారన్నారు. హరికృష్ణపై నెల్లూరు జిల్లా నాయుడుపేటలో, తమిళనాడులోని తిరుచ్చి, అరక్కోణం, కర్ణాటకలో దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. కుంచల శందిల్‌పై తిరుపతి,కాణిపాకం, విజయవాడ, రేణిగుంటలో దొంగతనం కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీరు చోరీ చేసిన సొమ్మును హరికృష్ణ భార్య దీపకు అందజేసేవారు. ఇలా బేతంచర్ల, గడివేముల దొంగతనాలకు సంబంధించి హరికృష్ణ, దీప నుంచి రూ.1.35లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనం చేసిన బంగారం ఉంచుకున్న కుప్పం ప్రాంతానికి చెందిన ఒకరు, వెంకటేష్, మరో మహిళ పరారీలో ఉన్నారని త్వరలో అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. వీరి అరెస్ట్‌లో చాకచక్యంగా వ్యవహరించిన పాణ్యం సీఐ నాగరాజు యాదవ్, గడివేముల ఎస్ఐ చిరంజీవి, సిబ్బందిని ఎస్పీ అభినందించారని డీఎస్పీ వివరించారు. -
ముసుగులు ధరించి.. రాడ్లతో దాడి చేసి..
సాక్షి, కర్నూలు : కర్నూలు శివారు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసుల నిఘా లేకపోవడంతో పేట్రేగిపోతున్నారు. ముసుగులు ధరించి.. వాహనాలపై వెళుతున్న వారిని అడ్డగించి బలవంతంగా సొమ్ము లాక్కుంటున్నారు. అడ్డుచెబితే రాడ్లతో దాడి చేస్తున్నారు. ఇటువంటి ఘటనే ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కర్నూలు శివారులోని దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి కుమార్తె సావిత్రి హైదరబాద్ నుంచి కర్నూలు బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడ నుంచి ద్విచక్రవాహనంపై తండ్రి, కుమార్తె దిన్నెదేవరపాడుకు బయలు దేరారు. సరిగ్గా దిన్నెదేవరపాడు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంలో వెంబడించారు. వాహనాన్ని అడ్డుకుని సావిత్రి మెడలోని చైన్‌ను బలవంతంగా లాక్కున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన మహేశ్వర రెడ్డిపై రాడ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన అతని వద్ద ఉన్న పర్సును లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు. బాధితులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కర్నూలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు శివారు ప్రాంతాల్లో సరైన నిఘా లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నయన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. -
వివాహిత ఊహాశ్రీ అదృశ్యంపై పలు అనుమానాలు
సాక్షి, బొమ్మలసత్రం(కర్నూలు) : నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన వివాహిత ఊహాశ్రీ హైదరాబాద్‌లో కనిపించకపోవటంతో తల్లిదండ్రుల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భర్త బంధువుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదైనప్పటికీ నేటికీ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు తన కుమార్తెను కిడ్నాప్ చేసి ఉండవచ్చని తండ్రి నాగరాజు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. నాగరాజు తెలిపిన వివరాల మేరకు ఎస్బీఐ కాలనీకి చెందిన నాగరాజు, అరుణ దంపతుల కుమార్తె ఊహాశ్రీని హైదారాబాద్‌లోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన నాగరాజు, శాంతమ్మ దంపతుల కుమారుడు మురళితో రెండేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే మురళి ఉద్యోగరీత్యా ఖడ్తర్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఊహాశ్రీ అత్తమామల వద్దే ఉంటుండగా ఆరోగ్యం సరిగా లేక అత్త కొంత కాలం క్రితం చికిత్స నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. మామ నాగరాజుతో కలిసి ఊహశ్రీ ఇంట్లోనే ఉంటోంది. గత నెల జూలై 5న మామ నాగరాజు ఉద్యోగరీత్య విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాగా ఊహాశ్రీ కనిపించలేదు. సమీప బంధువులను విచారించినా ప్రయోజనం లేకపోవడంతో జీడిమెట్ల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఊహాశ్రీ కోసం తెలంగాణ పోలీసులు ఎంత గాలించినా ఫలింతం లేకపోవటంతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. గత నెల 9న ఒంగోలులో ఓ వ్యక్తితో ఊహాశ్రీ కనిపించినట్లు తల్లిందండ్రులు, పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులతో కలిసి తల్లిదండ్రులు ఒంగోలు, చుట్టు పక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు తమ కుమార్తె జాడ తెలియకపోవటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఘాట్ రోడ్డులో లారీలు ఢీ
మహానంది/ గిద్దలూరు రూరల్: రెండు లారీలు ఢీకొని ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి నల్లమల ఘాట్ రోడ్డులో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరు నుంచి శనగల లోడుతో కర్నూలు జిల్లా గుత్తి వైపుగా వెళుతున్న లారీ నంద్యాల నుంచి చిలకలూరిపేటకు వడ్లలోడుతో వెళుతున్న లారీ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. అనంతరం శనగల లోడు లారీ లోయలో పడిపోయింది. వడ్ల లోడు లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. దీంతో నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో గిద్దలూరుకు చెందిన శనగల లారీ డ్రైవర్ రాముడు, క్లీనర్ నాగూర్ బాషాలకు, నంద్యాలకు చెందిన వడ్లలోడు లారీ డ్రైవర్ గుంజ ఎర్రన్న అతడి కుమారుడు క్లీనర్ చిన్నసుబ్బారాయుడుతో పాటుగా అదే లారీలో ప్రయాణిస్తున్న చింతకుంటకు చెందిన చిన్న ఏసుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గిద్దలూరు పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులు గుంజ ఎర్రన్న, చిన్నసుబ్బరాయుడు, నాగూర్‌బాషా, చిన్న ఏసులను చికిత్స నిమిత్తం పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. శనగల లోడు లారీ డ్రైవర్ రాముడు మాత్రం లారీ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసే ప్రయత్నం చేశారు. చిన్నఏసు కంబం వద్ద ఉన్న చింతకుంటకు వెళ్లేందుకు వడ్ల లోడుతో వెళుతున్న లారీలో గాజులపల్లె వద్ద ఎక్కాడు. ఈ ప్రమాదంలో క్లీనర్లు నాగూర్‌బాషా, చిన్నసుబ్బరాయుడులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీలో ప్రయాణిస్తున్న చిన్న ఏసు తలకు, కాళ్లకు చేతులకు డ్రైవర్లు, ఎర్రన్న, చిన్నసుబ్బరాయుడులకు తలకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. -
వజ్రాల వాటాలో గొడవ.. అందుకే చంపేశాం
సాక్షి, శిరివెళ్ల(కర్నూలు) : నల్లమల అటవీ ప్రాంతం శ్రీ సర్వనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో జరిగిన యువకుని హత్య కేసు మిస్టరీ వీడింది. భూమిలో నుంచి బయటకు తేలి వున్న కాలి బొటన వేలు ఈ నెల 12న ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకున్నారు. హతుడు ఆళ్లగడ్డ పట్టణం పుల్లారెడ్డి వీధికి చెందిన షేక్ జాకీర్ బాషా(20)గా గుర్తించారు. తల నుంచి మొండెం వేరు చేసి ఉండటంతో నర బలి ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తగా విచారణంలో అవన్నీ వదంతులేనని తేల్చారు. నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. శిరివెళ్ల, గోస్పాడు ఎస్ఐలు తిమ్మారెడ్డి, చంద్రశేఖరరెడ్డి తెలిపిన వివరాలు.. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన యువకుడు షేక్ జాకీర్బాషాతో రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన నీలి శ్రీరాములు, ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లెకు చెందిన పత్తి నాగప్రసాదు, పత్తి నాగేంద్ర, కోటకందుకూరుకు చెందిన దుర్వేసుల శ్రీనివాసులు, డి.కొట్టాలకు చెందిన దేరంగుల గోపాల్‌కు పరిచయాలున్నాయి. ఈ క్రమంలో వారందరు కలిసి ఈ నెల 5న వజ్రాల అన్వేషణకు సర్వ నరసింహ్మస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. వజ్రాలు దొరికితే పంచుకునే వాటాలపై వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు కలిసి షేక్ జాకీర్బాషాను కత్తితో గొంతు కోసి హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టారు. ఆళ్లగడ్డ, ఇతర గ్రామాల్లోని సీసీ ఫుటేజీల ఆధారంగా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాలను సేకరించి నిందితులను గుర్తించారు. బుధవారం రుద్రవరం మండలం చిన్న కంబలూరు మెట్ట వద్ద అనుమానంగా సంచరిస్తుండగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కత్తి, ఇతర పరిçకరాలను స్వాధీనం చేసుకున్నారు. -
దెయ్యం.. ఒట్టి బూటకం
సి.బెళగల్: హాస్టల్లో దెయ్యం ఉందనేది ఒట్టి బూటకమని జన విజ్ఞానవేదిక (జేవీవీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. సి.బెళగల్ మోడల్ బాలికల హాస్టల్లో కొన్ని రోజులుగా నెలకొన్న దెయ్యం బూచిపై విద్యార్థినులకు జిల్లా జేవీవీ నాయకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దెయ్యం పట్టుకుందాం...వస్తారా...? పేరుతో రాత్రి బస నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మంగళవారం రాత్రి హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం వారు శాస్త్రీయ నిరూపణ కార్యక్రమాలు చేపట్టారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ దెయ్యాలు అనేవి కేవలం కల్పితాలు మాత్రమేనని, ఎవరైనా దెయ్యాని పట్టిస్తే వారికి రూ.లక్ష బహుమతిగా అందజేస్తామన్నారు. ఐక్య మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో.. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, బేతంచెర్ల మండల అధ్యక్షురాలు సరస్వతి, సభ్యులు మంగమ్మ, అలివేలు, లక్ష్మీదేవి తదితరులు హాస్టల్‌ను చేరుకుని హాస్టల్ చుట్టూ పరిసరాలను, విద్యార్థినుల గదులను సందర్శించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి హాస్టల్లోనే నిద్రించారు. -
బీహార్ దొంగల బీభత్సం
కర్నూలు : నగర శివారులోని దిన్నెదేవరపాడు రోడ్డులో ఉన్న ఎన్సీసీ క్యాంటీన్ సమీపాన పార్థసారథి నగర్లో బిహార్ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముఖాలకు మాస్క్‌లు ధరించిన ఎనిమిది మంది దొంగలు మూడు ఇళ్లలోకి ప్రవేశించి హల్చల్ చేశారు. రెండు కుటుంబాలపై కత్తులు, రాడ్లతో దాడికి కూడా పాల్పడ్డారు. 13 తులాల బంగారు నగలు, రూ.39 వేల నగదు మూటగట్టుకుని ఉడాయించారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్సీసీ 28వ ఆంధ్రా బెటాలియన్‌లో ప్లాంట్స్ నాయక్‌గా పనిచేస్తున్న ఆళ్లగడ్డ మండలం నందింపల్లికి చెందిన పాములపాటి మోహనకృష్ణ కర్నూలు ఎన్సీసీ క్యాంటీన్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన కుటుంబంతో కలిసి పార్థసారథి నగర్లో నివాసం ఉంటున్నారు. భార్య లావణ్య, ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం రాత్రి భోజనం తర్వాత ఇంట్లో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎనిమిది మంది యువకులు ముఖాలకు మాస్క్‌లు ధరించి ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టారు. గాఢనిద్రలో ఉండడంతో వారు లేవలేదు. దీంతో మెట్ల మీదుగా పై అంతస్తులోకి వెళ్లి తలుపులను పెకలించే ప్రయత్నం చేశారు. ఆ చప్పుడుకు మోహనకృష్ణ నిద్రలేచి తలుపులు తెరవడంతో మిద్దెపై నుంచి కిందకు పరుగెత్తుకుంటూ వచ్చి లోపలికి ప్రవేశించారు. మోహనకృష్ణ ప్రతిఘటించేందుకు ప్రయత్నం చేయడంతో కత్తులు, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దీంతో తల, వీపు, చేతిపై బలమైన గాయాలయ్యాయి. దెబ్బలకు తాళలేక ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసు, భార్య లావణ్య మెడలోని బంగారు గొలుసును తీసిచ్చారు. పక్కనే ఉన్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కరుణాకర్ ఇంట్లోకి కూడా దొంగలు చొరబడ్డారు. కరుణాకర్, రోజీమేరీ వృద్ధ దంపతులు. వీరి వద్ద కూడా రూ.39వేల నగదు, 3 తులాల బంగారు నగలు లాక్కుని ఉడాయించారు. ఇదే కాలనీలోని మరో ఇంట్లో కూడా దొంగతనానికి విఫలయత్నం చేశారు. అయితే.. తెల్లారుతుండడంతో జనం లేస్తారన్న భయంతో పారిపోయారు. కాగా.. దొంగల చేతిలో గాయపడిన మోహనకృష్ణ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు. ముందురోజు రెక్కీ.. డాక్టర్స్ కాలనీకి రెండువైపులా జాతీయ రహదారులు ఉన్నాయి. ఒకవైపు నంద్యాల, మరోవైపు బెంగళూరు జాతీయ రహదారులను కలుపుతూ డాక్టర్స్ కాలనీలో బైపాస్ రోడ్డు(రింగ్‌రోడ్డు) నిర్మించారు. దొంగలు ముందురోజు రాత్రి డాక్టర్స్ కాలనీలోని బైపాస్ రోడ్డుగుండా రెక్కీ నిర్వహించి, శివారులో జనసమ్మర్దం లేని ఇళ్లను ఎంపిక చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి హిందీలో మాట్లాడుతూ దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. మనుషులు ఎర్రగా ఉన్నారని, వారి జుట్టు కూడా ఎర్రగా ఉందని పేర్కొన్నారు. బయటకు వెళ్లేటప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉన్న పండ్లు, బ్రెడ్డు, జామ్ మొత్తం తిని.. మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారని కరుణాకర్, రోజీమేరీ దంపతులు బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు విషయం తెలిసిన వెంటనే పలువురు పోలీస్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కర్నూలు ఇన్చార్జ్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీసీఎస్ డీఎస్పీ సూర్యనారాయణ, మూడో పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి తదితరులు బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్ సిబ్బందిని రప్పించి వేలిముద్రలను సేకరించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దొంగలంతా ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉండటంతో గుర్తుపట్టడం సాధ్యపడలేదు. అయితే.. సీసీఎస్ పోలీసుల వద్ద ఉన్న పాత నేరస్తుల ఫొటోలతో సీసీ ఫుటేజీలో ఉన్న ఆధారాలతో సరిచూస్తున్నారు. ప్రత్యేక బృందాలను నియమించి దొంగల కోసం గాలిస్తున్నారు. జాతీయ రహదారి మీదుగా ఉండే పోలీస్స్టేషన్ల అధికారులను అప్రమత్తం చేశారు. ఇటు బెంగళూరు వైపు, అటు హైదరాబాద్ వైపు, నంద్యాల జాతీయ రహదారిలో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వాహన తనిఖీలు నిర్వహించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. -
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
సాక్షి, కొలిమిగుండ్ల(కర్నూలు) : వ్యసనాలకు బానిసైన భర్త కట్టుకున్న భార్యనే పట్టపగలు హతమార్చిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని కోర్నపల్లెలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కోర్నపల్లెకు చెందిన తలారి పుల్లన్న, పుల్లమ్మ కుమార్తె పార్వతి(35)కి అనంతపురం జిల్లా పెద్ద పప్పూరు మండలం సుంకేసులపల్లెకు చెందిన నారాయణతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. తాగుడుకు బానిసైన నారాయణ భార్యపై అనుమానం పెంచుకొని చిత్ర హింసులకు గురిచేస్తుండేవాడు. దీంతో తల్లితండ్రులు తొమ్మిది నెలల క్రితం కూతురు, అల్లుడిని కోర్నపల్లెకు తీసుకొచ్చి ఇంటి పక్కన ఉన్న మరో ఇంటిటో నివాసం ఉంచారు. భార్యభర్తలిద్దరూ సున్నంబట్టిలో కూలీ పనికి వెళ్లేవారు. ఇటీవల నారాయణ పనికి వెళ్లడం మానేసి, మద్యం తాగుతూ జులాయిగా తిరిగే వాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి ముందు కూర్చొని కాఫీ తాగుతున్న భార్యపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అదే సమయంలో ఇంటి ఆవరణలో మహిళ తండ్రి, మరొకరు ఉన్నా అడ్డుకోలేకపోయారు. క్షణాల్లో హత్య చేసి, కొడవలిని అక్కడే వదిలేసి పారిపోయాడు. కూతురు రక్తపు మడుగులో పడిపోవడంతో తండ్రి బోరున విలపించాడు. తల్లి రెండు రోజుల క్రితం విహార యాత్రలో భాగంగా మధురై వెళ్లింది. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు గ్రామానికి చేరుకొని పార్వతి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరుతెన్నులను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. పారిపోయిన నిందితుడిని ఎస్ చెన్నంపల్లె–తిమ్మనాయినపేట చెరువు మధ్య గ్రామస్తుల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. -
దేవుడి సాక్షిగా నరబలి!
సాక్షి, శిరివెళ్ల(కర్నూలు) : నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీ సర్వ నరసింహస్వామి ఆలయ సమీపంలోని వక్కిలేరు వాగులో పూడ్చిన శవాన్ని శుక్రవారం బయటకు తీశారు. తల నరికి వేయడం.. మృతదేహం పక్కన నిమ్మకాయ ఉండడంతో ఇది నరబలి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాగులో వజ్రాల అన్వేషణ కోసం వచ్చిన ఓ వృద్ధుడు..గురువారం పూడ్చిన శవం కాలి వేలు బయట పడడాన్ని గమనించాడు. భయాందోళనకు గురై విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలియ చేయగా వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ జిలానీ, ఆర్ఐ ఉశేనిబాషా సçమక్షంలో సర్కిల్ ఎస్ఐలు చంద్రశేఖరరెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో పూడ్చిన శవాన్ని బయటకు తీశారు. 25–30 ఏండ్ల వయస్సున్న వ్యక్తి తల నరికినట్లు ఉంది. అదిగాక గుంతలో శవం పక్కను నిమ్మ కాయ కూడా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. జీన్స్ ఫ్యాంట్, రెడ్ పుల్ షర్టు, ఎర్రని శరీర వర్ణచ్ఛాయతో చేతి వేలికి కాపర్‌తో తయారు చేతిన ఉంగరం ఉంది. మొలతాడు లేదు. నంద్యాల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ రామిరెడ్డి ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తలను దేహం నుంచి నరికినట్లు డాక్టర్ నిర్ధారించారు. కాగా వ్యక్తిని ఘటనా స్థలం నే హత్య చేసి పూడ్చి పెట్టారా ? లేక ఎక్కడో హత్య చేసి ఇక్కడ పూడ్చి పెట్టారన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా వ్యక్తి కాలి వేలికి రింగ్ మాదిరిగా ఉంది. కాలి నొప్పి ఉన్న వారు ఇలా వేయించుకుంటారని స్థానికులు చెబుతున్నారు. మహదేవపురం వీఆర్వో శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్థం అనంతరం మృత దేహాన్ని అక్కడే పూడ్చి వేశారు. -
మేకల కాపరి దారుణహత్య
సాక్షి, తుగ్గలి(కర్నూలు) : మేకల కాపరిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, మేకలను ఎత్తుకెళ్లిన ఘటన తుగ్గలి మండలం బోడబండ పుణ్యక్షేత్రం సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి సోదరుడు స్వామినాయక్ తెలిపిన వివరాలు.. సూర్యతండాకు చెందిన రమావత్ రామునాయక్(50) వ్యవసాయంతో పాటు మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తనకున్న 25 మేకలను మేపేందుకు గురువారం అడవులకు వెళ్లాడు. మధ్యాహ్నం కుంట వద్ద భార్య దేవమ్మ తెచ్చిన భోజనాన్ని తిని, తిరిగి మేకలను తోలుకుని వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో భార్య, కుమారులు, తండా వాసులు బోడబండ పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ కనపడలేదు. చీకటి కావడంతో చేసేదేమీ లేదక రాత్రి జొన్నగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. శుక్రవారం తెల్లవారు జామునే మళ్లీ వెతికేందుకు వెళ్లిన తండావాసులకు ఓ గుట్టలో రాళ్ల మధ్య తలపై తీవ్రగాయాలతో విగత జీవిగా పడిఉన్న రామునాయక్ మృతదేహం కంట పడింది. మేకలు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించక పోవడంతో దొంగల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి చేరే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కట్టెతో తలపై కొట్టి చంపి మేకలు ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. రూ.2 లక్షలు కూడా చేయని వాటి కోసం ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టారని కుటుంబ సభ్యులు, తండావాసులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్నిపరిశీలించిన డోన్ డీఎస్పీ.. మేకల కాపరి హత్య విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా, పత్తికొండ సీఐ సోమశేఖరరెడ్డి, జొన్నగిరి ఎస్ఐ విజయకుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మేకల కోసం దొంగలు ఈ దారుణానికి ఒడిగట్టారా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఇది రెండో ఘటన.. ఆరేళ్ల క్రితం మండలంలోని పి.కొత్తూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయ ఎనుముల పుల్లన్న కుమారుడు సురేంద్ర(12) దారుణ హత్యకు గురయ్యారు. సురేంద్ర పక్క గ్రామంలోని హుసేనాపురానికి గొర్రెల యజమాని వద్ద గొర్రెలు మేపేందుకు జీతం ఉన్నాడు.రోళ్లపాడు అటవీ ప్రాంతంలో కొండపై గొర్రెలు మేపుతుండగా దొంగలు కాపరి తలపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసి గొర్రెలు ఎత్తుకెళ్లారు. మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. -
విద్యుత్ తీగల రూపంలో మృత్యుపాశం
సాక్షి, కౌతాళం(కర్నూలు) : కూలీలతో కలిసి పొలంలో విత్తనాలు నాటారు. పని ముగింపు దశలో తల్లీకూతురు ఓ చెట్టు కింద భోజనానికి ఉపక్రమించారు. సాధకబాధకాలు మాట్లాడుకుంటూ భోంచేశారు. తర్వాత తల్లి పైనున్న తీగను పట్టుకుని లేవడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా ‘షాక్’! ఆమెకు ఏమైందో తెలీక కాపాడబోయిన కుమార్తెదీ ఇదే పరిస్థితి. ఇద్దరూ గిలగిలా కొట్టుకుంటూ క్షణాల్లోనే ప్రాణాలొదిలారు. తర్వాత తెలిసింది వారిని బలిగొన్నది విద్యుత్ తీగ రూపంలోని మృత్యుపాశమని! కౌతాళం మండలం చూడి పంచాయతీ తిప్పలదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై తల్లీ కూతురు నరసమ్మ(58), రామాంజనమ్మ(38) మృతిచెందారు. గ్రామానికి చెందిన సోమిరెడ్డి (లేట్)కి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య నరసమ్మ. ఈమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె రామాంజనమ్మను ఇదే మండల పరిధిలోని చిరుతాపల్లికి చెందిన ఈరన్నకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు సంతానం. ఇటీవల తిప్పలదొడ్డిలో మట్టి ఎద్దుల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామాంజనమ్మ పుట్టింటికి వచ్చింది. శుక్రవారం ఉదయం చిరుతాపల్లికి తిరిగి వెళతానని తల్లితో చెప్పింది. ‘రేపు వెళ్దువులే’ అనడంతో ఆమె ప్రయాణాన్ని విరమించుకుంది. తర్వాత తల్లీకూతురు గ్రామానికి చెందిన కూలీలతో కలిసి పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లారు. విత్తనాలు నాటే పని పూర్తవుతున్న దశలో వెళ్లి భోంచేయాలని కూలీలు వారికి సూచించారు. దీంతో తల్లీకూతురు పొలంలోని ఓ చెట్టు కింద భోజనానికి ఉపక్రమించారు. దాని గుండానే విద్యుత్ తీగలు వెళ్లాయి. ఈ విషయాన్ని వారు గమనించలేదు. భోజనం పూర్తి కాగానే నరసమ్మ పైకి లేవడానికి సపోర్టుగా పైనున్న తీగ పట్టుకుంది. క్షణాల్లోనే విద్యుత్ షాక్‌కు గురైంది. గిలగిలా కొట్టుకుంటుండగా కుమార్తె కాపాడబోయింది. ఆమె కూడా షాక్‌కు గురైంది. పొలంలోని కూలీలు గమనించి హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆలోపే ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారొచ్చి విద్యుత్ తీగలను వేరుచేసి.. ఆ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగార్జునరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కూడా కన్పిస్తోంది. విద్యుత్ తీగలు ఇంత కింద వేలాడుతున్నా సరిచేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
కుమార్తెను చూసేందుకు వెళ్తూ..
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : కుమార్తెను చూసేందుకు వెళ్లిన ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నందవరం మండలం టి.సోమలగూడూరు గ్రామానికి చెందిన హరిజన కర్రెప్ప(45)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె గౌతమి గోనెగండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో కుమార్తెను చూడటానికి ఇంటి నుంచి క్యారియర్ తీసుకొని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి శ్యాంసన్‌తో పాటు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మధ్యలో కలుగొట్ల గ్రామంలోని సోదరి దానమ్మను పలకరించి, కూతురి వద్దకు బయలుదేరాడు. పట్టణంలోని ఎద్దుల మార్కెట్ వద్దనున్న రోడ్డు మలుపు దాటుతుండగా కర్నూల్ వైపు నుంచి సిమెంట్ లోడ్ లారీ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. లారీ కర్రెప్ప తలపై ఎక్కడంతో నుజ్జనుజ్జయింది. వెనుక కూర్చున్న శ్యాంసన్ కాలికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని, పోస్ట్‌మార్టంకోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బోరున విలపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. -
పెళ్లికి కూతురు ఒప్పుకోవడం లేదంటూ..లెటర్ రాసి..
సాక్షి, బేతంచెర్ల(కర్నూలు) : కూతురు పెళ్లికి ఒప్పుకోవడంలేదనే మనస్తాపంతో తల్లి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలోని ముద్దవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి భార్య రమణమ్మ(46) రెండవ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె భాగ్యలక్ష్మికి వివాహం కాగా, చిన్న కుమార్తె భార్గవికి ఇటివలే రహిమానుపురం గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి కుదిరింది. అయితే తనకు ఈ సంబంధం ఇష్టం లేదని కూతురు చెప్పడంతో మాట ఇచ్చామని, ఎలాగైనా వివాహం చేసుకోవాలని కోరింది. అయినా వినకపోవడంతో ఆదివారం ఉదయం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో కూతురు అంగన్వాడీ కేంద్రం వద్దకు వచ్చి చూడగా తల్లి ఉరి వేలాడుతుండటంతో గుండెలు బాదుకుంది. మృతురాలి చేతిలో ఉన్న సూసైడ్‌నోట్‌లో ‘అయామ్ స్వారీ భార్గవీ, నీకు ఇష్టం లేనిపని ఏమి నేను చెయ్య లేను. అలాగని చేయిదాటిపోయినందుకు నాకు నేనే బాధపడుతున్నాను. నీకు మంచి తల్లిని కాలేక పోయా, సో అయామ్ సారీ, నాకు ఇక ఏమార్గం కన్పించలేదు’ అని రాసి సంతకం చేసి ఉంది. వీఆర్వో వెంకట్రావు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. -
లారీనుంచి డ్రమ్ములు నూతన వధూవరులపై పడడంతో..
సాక్షి, మహానంది(కర్నూలు) : వారిద్దరికీ కొత్తగా పెళ్లి అయింది. పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు బంధుమిత్రులతో కలిసి మహానందికి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నంద్యాల–గిద్దలూరు ఘాట్‌రోడ్డులో లారీపైన ఉన్న డ్రమ్ములు నూతన వధూవరుల బైక్‌పై పడ్డాయి. దీంతో బైక్ నడుపుతున్న శిరిగిరి శ్రీనివాసులు(32) తీవ్రంగా గాయపడి కోలుకోలేక మృతి చెందాడు. అలాగే ఆయన భార్య లక్ష్మీశిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన శిరిగిరి శ్రీనివాసులు మెడికల్ రెప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన లక్ష్మీశిరీషతో ఈ నెల 16న వివాహం జరిగింది. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు బైక్‌లపై లక్ష్మీశిరీష చెల్లెలు సృజన, మరదలు బిందు, బంధువులు శ్రీను, సుబ్బయ్య, వెంకట్‌లతో కలిసి ఉదయం మహానందికి వచ్చారు. మహానందీశ్వరుడిని దర్శించుకుని మూడు బైక్‌లలో వచ్చిన వీరు బయలు దేశారు. ముందు బైక్‌లో నూతన దంపతులు ఉన్నారు. అయితే పచ్చర్ల దాటిన తర్వాత గిద్దలూరు వైపు నుంచి ట్రైలర్ వాహనం వస్తుండగా.. గాజులపల్లె వైపు నుంచి వెళ్తున్న డీసీఎం లారీ ఢీకొట్టింది. దీంతో డీసీఎం లారీ కింద పడగా అందులో ఉన్న ఆయిల్ డ్రమ్ములు నూతన దంపతులు వెళ్తున్న బైక్‌పై పడ్డాయి. దీంతో వారు ఇద్దరూ తీవ్రగాయాలపాలయ్యారు. శ్రీనివాసులు మోచేయి విరగడంతో పాటు ఛాతీ, ఉదరభాగాన తీవ్రంగా గాయమైంది. వెంటనే లక్ష్మీశిరీష చెల్లెలు సృజన, ఇతరులు గుంటూరువైపు వెళ్తున్న కారును ఆపి గాజులపల్లెకు తీసుకుని వచ్చారు. అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శ్రీనివాసులు మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు లక్ష్మీశిరీషను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. నడుముల దగ్గర తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
మేం సంపాదించింది తీసుకోండి..మేం వెళ్తున్నాం
సాక్షి, కర్నూలు : ‘‘ మేం సంపాదించింది తీసుకోండి.. అప్పులు కట్టుకోండి.. మా గురించి ఆలోచించకుండా జాగ్రత్తగా జీవించండి..మేం వెళ్తున్నాం’’ అంటూ ఒక రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్, ఆయన సతీమణి లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజాచార్యులు..పోస్ట్‌మాస్టర్‌గా రిటైర్డ్ అయ్యారు. ఆయన భార్య జయమ్మ గృహిణిగా ఉంటోంది. వీరికి భారతి, విష్ణుప్రియ, సువర్చల, గాయత్రి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వివాహం అయిన తరువాత భర్త మృతి చెందడంతో తల్లిదండ్రులతోనే దుస్తుల దుకాణం ఏర్పాటు చేయించుకొని విష్ణుప్రియ జీవనం సాగిస్తోంది. మిగిలిన ముగ్గురు కుమార్తెలు వారి భర్తల ఇళ్ల దగ్గర ఉన్నారు. విష్ణుప్రియతో శనివారం ఉదయం తెల్లవారు జామున రామాంజాచార్యులు, జయమ్మ దంపతులు గొడవ పడ్డారు. లెటర్ రాసి పెట్టి ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. జయమ్మ పుస్తెల గొలుసు సైతం ఇంట్లోనే పెట్టి వెళ్లారు. ఆ పుస్తెల గొలుసు అమ్ముకుని నలుగురు కూతుళ్లు సమానంగా పంచుకోండని లెటర్లో రాశారు. ఎవరెవరికి అప్పు ఇచ్చారో.. అప్పులిచ్చిన వారు ఎవరో లేఖలో పేర్కొన్నారు. తమ పేరు మీద ఉన్న 6 ఎకరాల పొలాన్ని, ఇంటి స్థలాన్ని నలుగురు కుమార్తెలు సమానంగా పంచుకోవాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వృద్ధ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
గోల్డ్ స్కీం పేరుతో ఓ ప్రైవేటు బ్యాంకు ఎండీ..
సాక్షి, ఆదోని(కర్నూలు) : గోల్డ్ స్కీం పేరుతో డిపాజిటర్లను మోసం చేసిన ఓ ప్రైవేట్ బ్యాంక్ ఎండీని టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలు డీఎస్పీ వెంకటరాముడు.. సీఐ భాస్కర్‌తో కలిసి విలేకరులకు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సంగనహాల్ గ్రామానికి చెందిన ముళ్లపూడి ఇసాక్ గత జనవరిలో పట్టణంలోని ఎస్కేడీ కాలనీలో జాన్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, జాన్ ఫైనాన్స్ అండ్ జ్యువెలరీ స్కీం కార్యాలయాన్ని ప్రారంభించారు. 14 మందిని ఫీల్డ్ ఆఫీసర్లుగా నియమించుకొని 282 మంది సభ్యులను చేర్చుకున్నాడు. వారి వద్ద నుంచి డిపాజిట్ రూపంలో దాదాపు రూ.30 లక్షలు సేకరించాడు. గడువు ముగిసినా లోన్లు, బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు ఒత్తిడి చేయడంతో ఎండీ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీరామనగర్‌కు చెందిన బాధితుడు దేవప్రసాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గత మే 10న ఫిర్యాదు చేశాడు. దేవప్రసాద్‌తో పాటు మరికొంతమంది బాధితులు రాఘవేంద్రమ్మ, లక్ష్మీ, గౌస్, జాఫర్, రఫీక్ కూడా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా శనివారం ఎండీ ముళ్లపూడి ఇసాక్ కల్లుబావిలోని ఆటో స్టాండ్ వద్ద తచ్చాడుతుండగా అరెస్ట్ చేశారు. విచారణలో భార్య రెబెకాకు రూ.23 లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడని, ఆమె కోసం గాలిస్తున్నామని, త్వరలోనే నగదు రికవరీ చేస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా ఎమ్మిగనూరులో కూడా ఆఫీస్ ఓపెన్ చేసి బాధితుల నుంచి రూ.20 లక్షల వరకు డిపాజిట్లు వసూలు చేసి ముఖం చాటేశాడని డీఎస్పీ చెప్పారు. 2014లోనూ దొంగనోట్ల కేసులో గంగావతి పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. -
జూపాడుబంగ్లా మహిళ కేరళలో మృతి
జూపాడుబంగ్లా: మండలంలోని మండ్లెం గ్రామానికి చెందిన షేక్‌పర్వీన్(32) నాలుగు రోజుల క్రితం కేరళలో మృతిచెందింది. పోలీసులు, మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. జూపాడుబంగ్లాకు చెందిన మహమ్మద్‌షరీఫ్ కుమార్తెను మండ్లెం గ్రామానికి చెందిన సయ్యద్‌హయ్యత్‌బాషాకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నంగా రూ.4 లక్షలు, 12 తులాల బంగారం, బైక్ ఇచ్చారు. సయ్యద్‌హయ్యత్‌బాషా కేరళ రాష్ట్రం మల్లాపురం జిల్లాలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండటంతో అక్కడే కాపురం ఉన్నారు. వీరికి కుమార్తె సంతానం. ఈ క్రమంలో నాలుగురోజుల క్రితం షేక్‌పర్వీన్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, కోలుకోలేక మృతిచెందింది. మృతదేహాన్ని శనివారం మండ్లెం గ్రామానికి పంపి, సయ్యద్‌హయ్యత్‌బాషా కేరళలోనే ఉండిపోవడంతో అనుమానం వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు.. తమ కూతురిని అల్లుడే హతమార్చాడని, అతడు వచ్చేంతవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు సాయంత్రం కేరళ నుంచి మృతురాలు భర్త జూపాడుబంగ్లా పోలీస్‌స్టేషన్‌కు రావడంతో ఎస్ఐ రామమోహన్‌రెడ్డి, గ్రామ పెద్దలు కలిసి ఇరుకుటుంబాలతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పి అంత్యక్రియలు పూర్తి చేయించారు. -
చీటీల పేరుతో మోసం
డోన్: చీటీల పేరుతో ఓ మహిళ నిలువునా ముంచింది. డోన్ పట్టణంలో ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. చీటీల నిర్వాహకురాలు నిర్మలమ్మ ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యం కావడంతో బాధితులు లబోదిబోమంటూ డోన్ డీఎస్పీ ఖాధర్ బాషాను న్యాయం కోసం ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోన్ ఆర్టీసీ డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న ఈశ్వర్‌రెడ్డి భార్య నిర్మలమ్మ నెహ్రూనగర్‌లో నివాసముంటూ కొన్నేళ్లుగా చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. స్థానికులతో పాటు తరచుగా సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళుతూ అక్కడికి వచ్చే భక్తులతో కూడా పరిచయం పెంచుకొని చీటీల వ్యాపారం ప్రారంభించారు. చీటీలు పాడిన వారికి సకాలంలో డబ్బులు ఇవ్వకపోగా ఏదో ఒక సాకుతో కాలయాపన చేస్తూ వచ్చారు. నిర్మలమ్మ ఎంతో మంచి మనిషి అని భావించిన స్థానికులకు కొద్దిరోజుల్లో ఆమె నిజస్వరూపం తేటతెల్లమైంది. దీంతో చీటీల డబ్బుల కోసం ఆమెపై ఒత్తిడినిపెంచారు. దీంతో ఆమె చెప్పా చేయకుండా రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి ఉడాయించారు. ఆమె ఆచూకీ ఎంతకీ తెలియకపోవడంతో బిత్తరపోయిన బాధితులు స్థానిక డీఎస్పీని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు. నిర్మలమ్మ చేతిలో మోసపోయిన వారు 500 మంది దాకా ఉంటారని వీరందరికీ రూ.11కోట్ల వరకు నగదు చెల్లించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
రైల్వే ట్రాక్ పక్కన యువతి మృతదేహం
కర్నూలు, తుగ్గలి: మండలంలోని లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన ఓ యువతి మృతదేహం లభ్యమైంది. డోన్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. కాకినాడకు చెందిన చిన్న(27) బుధవారం హైదరాబాద్ నుంచి కాచిగూడ–యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అనంతపురం బయలుదేరింది. తెల్లవారుజామున మార్గమధ్యంలో తుగ్గలి మండలం లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన ఆమె మృతదేహం పడిఉంది. గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది డోన్ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకొని కాకినాడకు చెందిన సత్యవతి కూతురు చిన్నిగా గుర్తించి తల్లికి సమాచారం చేరవేశారు. సత్యవతికి ఐదుగురు కూతుళ్లు కాగా చిన్ని మూడో సంతానం. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. మరో ఉద్యోగం వెతుక్కునే క్రమంలో అనంతపురం వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు వెళ్లాలనుకుంది. ఈక్రమంలో ఆమె రైలు నుంచి జారిపడిందా? లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని రైల్వే పోలీసులు గురువారం తెలిపారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
ఆదోని టౌన్: పెద్దలు పెళ్లికి అడ్డు చెబుతున్నారనే కారణంతో ప్రేమికులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన సోమవారం ఆదోని పట్టణంలో చోటుచేసుకుంది. ఇస్వి ఏఎస్ఐ మోహన్‌కృష్ణ, ప్రేమికుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న లక్ష్మణ్ రావు పెద్దకుమారుడు ప్రవీణ్, అదే ప్రాంతంలో నివాసముంటున్న వెంకటలక్ష్మీ కుమార్తె వినీల నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో మూడేళ్ల క్రితం పెద్దలు పంచాయితీ చేసి ఇరువురిని విడదీసి ఎవరింటికి వారిని పంపారు. వినీల.. అనంతపురం హాస్టల్లో ఉండి డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతోంది. ప్రవీణ్ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితమే ఆదోనికి వచ్చి..శిరుగుప్ప క్యాంప్‌లో ఉన్న చిన్నమ్మ అన్నపూర్ణమ్మ వద్దకు వెళ్తున్నానని ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయలు దేరాడు. హైదరాబాద్‌లో ఉన్న బంధువులు ఇంటికి వెళ్లి వస్తానని వినీలా కూడా బయలుదేరింది. వీరిరువూ సోమవారం ఆదోని మండలం సంతెకూడ్లూరు–పెద్దహరివాణం పొలాల్లో పురుగు మందు తాగారు. ఈ విషయాన్ని ప్రవీణ్ ఆదోనిలో ఉన్న తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో ఆదోని నుంచి వారు ఆటో తీసుకొని వచ్చి బాధితులను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. మూడేళ్ల క్రితం తమను వేరు చేశారని, ప్రస్తుతం తాము మేజర్లమని, పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్నేహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రేమికుల తల్లిదండ్రులు సమాచారం మేరకు విచారణ చేస్తున్నట్లు ఇస్వీ ఏఎస్ఐ మోహన్‌కృష్ణ తెలిపారు.