సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : భర్తపై ఓ భార్య, తన ప్రియుడితో కలిసి దాడి చేసిన ఘటన పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. సంజీవయ్య నగర్‌కు చెందిన జయరాముడు భార్య జ్యోతి అదే కాలనీకి చెందిన రాముతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి గతంలో పెద్దలు పంచాయతీ చేసి సర్దిచెప్పారు. అయినా జ్యోతిలో మార్పు రాకపోవడంతో పాటు మంగళవారం భర్త పొలానికి వెళ్లిన తర్వాత ప్రియుడు రాముని ఇంటికి పిలుచుకుంది.
ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. ఇద్దరినీ లోపలే ఉంచి తలుపులు వేసేందుకు యత్నించగా భార్య గొంతు పట్టుకోగా ఆమె ప్రియుడు రాము కర్రతో తలపై దాడి చేసి పరారయ్యాడు. గాయపడి జయరాముడిని చికిత్స నిమిత్తంప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment