yemmiganuru
-
Watch Live: మేమంతా సిద్ధం ఎమ్మిగనూరు సభ
-
కర్నూలు: వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
సాక్షి, కర్నూలు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. గురువారం ఉదయం కోడుమూరురోడ్డులోని కింగ్స్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వరుడు పవన్ కళ్యాణ్ రెడ్డి, వధువు కీర్తన రెడ్డిలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం ఉదయం తొలుత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారాయన. అక్కడి నుంచి కోడుమూరురోడ్డులోని వివాహ వేదికకు వెళ్లారు. అక్కడ వివాహ వేడుకకు హాజరై.. నూతన వధువరులను ఆశీర్వదించారు. -
ఆంధ్రప్రదేశ్‌లో పేదవాడికి, పెత్తందారుకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రైతన్నల సంబరం (ఫొటోలు)
-
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చంద్రబాబుకు నిరసన సెగ
-
పదవీ విరమణ పొందిన 15 రోజుల్లోనే..
సాక్షి,ఎమ్మిగనూరు: శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్న రిటైర్డ్ హెచ్ఎంను మృత్యువు కబళించింది. పదవీ విరమణ పొందిన 15 రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్‌లో నివాసముంటున్న రిటైర్డ్ హెచ్ఎం ప్రసాద్ (60), అరుణ దంపతులకు ముగ్గురు సంతానం. వీరి కుమారుడు కృష్ణసాగర్ మైసూర్లో రైల్వే ఉద్యోగిగా పని చేస్తుండగా, కుమార్తె మానస విజయవాడలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. మరో కుమార్తె మేఘనకు వివాహమైంది. ప్రసాద్ కడివెళ్ల గ్రామంలోని ఎంపీపీ మెయిన్ స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తూ గత నెల 31వ తేదీన రిటైర్డ్ అయ్యారు. పదవీ విమరణ బిల్లులతో పాటు నాడు–నేడు బిల్లులు అందజేసేందుకు మంగళవారం ఉదయం బైక్‌పై కర్నూలుకు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి ఎమ్మిగనూరుకు బయలుదేరాడు. అదే సమయంలో కోడుమూరుకు చెందిన భాస్కర్ ఎమ్మిగనూరులో తమ బంధువులు చేసిన దేవరకు హాజరై సాయంత్రం బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎర్రకోట – రాళ్లదొడ్డి గ్రామాల మధ్య ఏడు మోరీల బ్రిడ్జి దగ్గర రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రిటైర్డ్ హెచ్ఎం ప్రసాద్, భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని 108లో ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయమైన ప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న భార్య అరుణ, బంధువులు, ఉపాధ్యాయులు ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త మృతదేహం వద్ద అరుణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ చెల్లెలు అరుణ భర్త. మెరుగైన చికిత్స నిమిత్తం భాస్కర్‌ను కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ హెడ్‌కానిస్టేబుల్ చంద్ర విలేకరులకు తెలిపారు. చదవండి: వీడియో వైరల్: వేలు చూపిస్తూ వార్నింగ్, అంతలోనే తుపాకీతో.. -
ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : భవిష్యత్ ఉన్న కుర్రాడు.. ఆటలో విజయ పరంపర సాగిస్తున్న క్రీడాకారుడు . రెండు రోజుల్లో బెంగళూరులో జరిగే రాష్ట్రస్థాయి అండర్19 జట్టులో ఆడాల్సిన ఆటగాడు అర్ధంతరంగా ప్రాణం తీసుకున్నాడు. తండ్రి బైక్ ఇవ్వలేదనే క్షణికావేశంలో ఉరి వేసుకొని ఊపిరి తీసుకున్నాడు. పట్టణంలోని ఎస్ఎంటీ కాలనీలో శనివారం చోటుచేసుకున్న ఘటన వివరాలు కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన ఖాసీంనాయుడు, సరస్వతికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌నాయుడు(19) స్థానిక శ్రీ రాఘవేంద్ర కాలేజీలో ఇంటర్ సీఈసీ రెండో ఏడాది చదువుతూ క్రికెట్లో రాణిస్తున్నాడు. రాష్ట్రస్థాయి అండర్–19 పోటీలకు ఎంపికయ్యాడు. శిక్షణ శిబిరానికి ఈ నెల 8న బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే శుక్రవారం ఆదోనిలో జరిగే వినాయక నిమజ్జన వేడుకలకు వెళ్లేందుకు తనకు బైక్ ఇవ్వాలని తండ్రి ఖాసీంనాయుడుకు ఫోన్ చేసి అడిగాడు. బీఎస్ఎన్ఎల్లో కాంట్రాక్ట్ కార్మికుడైన తండ్రి తాను పనిలో ఉన్నానని, బైక్ ఇవ్వడం వీలు కాదని, ఎక్కడికీ వెళ్లవద్దని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయినా స్నేహితుల బైక్‌పై వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి బెడ్ రూంలో నిద్రించాడు. తల్లి సరస్వతి బ్యూటీ పార్లర్ శిక్షణ నిమిత్తం కర్నూల్‌కు వెళ్లింది. తండ్రి విధులు ముగించుకొని ఆలస్యంగా వచ్చి భోంచేసి పడుకున్నాడు. ఉదయం ఎంతకూ బెడ్రూం తలుపులు తీయకపోవడంతో కిటికిలోంచి చూడగా కుమారుడు ఉరికి వేలాడుతుండడంతో తండ్రి కుప్పకూలిపోయాడు. ఇంటి పక్కల వారి సాయంతో కుమారుడిని కిందకు దించి మృతదేహాన్ని స్వగ్రామం హాలహర్వికి తీసుకెళ్లారు. చేతికి వచ్చిన కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇది చదవండి : కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి.. -
ప్రియుడితో ఏకాంతంగా ఉండటం భర్త చూడటంతో..
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : భర్తపై ఓ భార్య, తన ప్రియుడితో కలిసి దాడి చేసిన ఘటన పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. సంజీవయ్య నగర్‌కు చెందిన జయరాముడు భార్య జ్యోతి అదే కాలనీకి చెందిన రాముతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి గతంలో పెద్దలు పంచాయతీ చేసి సర్దిచెప్పారు. అయినా జ్యోతిలో మార్పు రాకపోవడంతో పాటు మంగళవారం భర్త పొలానికి వెళ్లిన తర్వాత ప్రియుడు రాముని ఇంటికి పిలుచుకుంది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. ఇద్దరినీ లోపలే ఉంచి తలుపులు వేసేందుకు యత్నించగా భార్య గొంతు పట్టుకోగా ఆమె ప్రియుడు రాము కర్రతో తలపై దాడి చేసి పరారయ్యాడు. గాయపడి జయరాముడిని చికిత్స నిమిత్తంప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
కుమార్తెను చూసేందుకు వెళ్తూ..
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : కుమార్తెను చూసేందుకు వెళ్లిన ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నందవరం మండలం టి.సోమలగూడూరు గ్రామానికి చెందిన హరిజన కర్రెప్ప(45)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె గౌతమి గోనెగండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో కుమార్తెను చూడటానికి ఇంటి నుంచి క్యారియర్ తీసుకొని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి శ్యాంసన్‌తో పాటు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మధ్యలో కలుగొట్ల గ్రామంలోని సోదరి దానమ్మను పలకరించి, కూతురి వద్దకు బయలుదేరాడు. పట్టణంలోని ఎద్దుల మార్కెట్ వద్దనున్న రోడ్డు మలుపు దాటుతుండగా కర్నూల్ వైపు నుంచి సిమెంట్ లోడ్ లారీ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. లారీ కర్రెప్ప తలపై ఎక్కడంతో నుజ్జనుజ్జయింది. వెనుక కూర్చున్న శ్యాంసన్ కాలికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని, పోస్ట్‌మార్టంకోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బోరున విలపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. -
ప్రైవేటు కాలేజీలో చేర్పించలేదని..
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : మండల పరిధిలోని పార్లపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బోయ రంగస్వామి, చక్రమ్మల కూతురు రాజేశ్వరి(15) ఇటీవల పదో తరగతి పాస్ అయింది. తోటి స్నేహితులతో కలిసి కర్నూలులోని ప్రైవేట్ కళాశాలలో చేర్పించాలని తండ్రిని కోరగా, ఆర్థిక పరిస్థితి బాగోలేదని సర్ధిచెప్పాడు. దీంతో కడివెళ్ల ఏపీ మోడల్ స్కూల్లో గురువారం దరఖాస్తు చేసి వచ్చింది. అక్కడ తోటి విద్యార్థినులు ప్రైవేటు కాలేజీలో చేరుతున్నట్లు చెప్పడంతో మరోసారి తండ్రితో ప్రస్తావించింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే తాను అంత ఫీజు కట్టలేనని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లిదండ్రులు ఉదయం నిద్రలేచేసరికి కూతురు ఫ్యాన్‌కు వేలాడుతుండటం చూసి గుండెలు పగిలేలా రోదించారు. రూరల్ ఏఎస్ఐ నాయక్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. -
మోదీ, బాబుని సాగనంపే రోజులు వచ్చాయ్
ఎమ్మిగనూరు: దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని..అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో కోట్ల పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..ప్రజలను రక్షించే వారు పాలకులు అవుతారే తప్ప భక్షించే వాళ్లు కాదన్నారు. దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నా పాలకులు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో రాహుల్‌ను ప్రధాని చేసి ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం అనే పాలన మరోసారి తెచ్చుకుందామని అన్నారు. ఈ నెల 18వ తేదీ కర్నూలులో రాహుల్ పర్యటనతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు. -
కర్నూల్లో అను ఇమ్మానుయేల్ సందడి
-
జాతరెల్లిపోదామే..జాతరో జాతరా!
మహిమాన్విత్వం.. నీలకంఠేశ్వరుని చరితం..! - 12నుంచి బ్రహ్మోత్సవాలు - నెలరోజుల పాటు ఉత్సవాలు --14న మహారథోత్సవం - జిల్లాలో ప్రత్యేకం ఎమ్మిగనూరు : పుణ్యక్షేత్రాలకు నెలవుగా ఉన్న కర్నూలు జిల్లాలో తర్తూరు, ఎమ్మిగనూరు, గూడూరు జాతరలు ప్రధానమైనవి. ఇందులో ఎమ్మిగనూరు జాతరకు దశాబ్ధాల చరిత్ర, ప్రత్యేక స్థానం ఉంది. ఏటా పుష్యమాసం పౌర్ణమి రోజుతో మొదలై మళ్లీ పౌర్ణమి వచ్చేవరకూ అంటె నెల రోజుల పాటు జాతర కొనసాగడం ఇక్కడి ప్రత్యేకత. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా.. ఎమ్మిగనూరు పరిసరాల వారికి ఇలవేల్పుగా గుర్తింపు పొందిన శ్రీనీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నాలుగు శతాబ్దాల చరిత్ర నాలుగు శతాబ్దాలకు పైగా ఎమ్మిగనూరులో శ్రీనీలకంఠేశ్వరస్వామి రథోత్సవం జరుగుతున్నట్లు తెలుస్తోంది. చేనేత మహిళ సేద్యం చేస్తున్నప్పుడు నాగలికి స్వామి వారి లింగం తగలడంతోవెలికితీసి ప్రతిష్టించినట్లు ప్రచారం. చేనేతలు కాశీనుంచీ శివలింగాన్ని తెచ్చి ప్రతిష్టించటంతో పూజలు మొదలైనట్లు మరో ప్రచారం. ఆలయానికి గతంలో ఉన్న భారీ రథం బ్రిటీష్ పాలనలో వివాదం కారణంగా దగ్ధమైనట్లు చెబుతారు. అనంతరం ఈ ప్రాంతంలో సంచరిస్తున్న వనపర్తి రాజులు(సంస్థానాధీసులు) నల్లమొద్దును తెప్పించి దాదాపు 55 ఆడుగుల ఎత్తులో మరో రథాన్ని తయారు చేయించారు. ఈ రథ చక్రాలు పది అడుగుల ఎత్తున్నాయి. రథానికి నాలుగు వైపులా పురాణగాథలను ప్రతిబింబిస్తూ చెక్కిన దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. రథం ఇప్పటి వరకు చెక్కుచెదరకపోవడం విశేషం. 12నుంచి బ్రహ్మోత్సవాలు.. శ్రీ దుర్మిఖినామ సంవత్సరం పుష్యమాస శుక్లపక్ష పౌర్ణమి గురువారం నుంచి సోమవారం వరకు శ్రీ నీలకంఠేశ్వరుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 12వ తేది పుష్పారోహణ సహిత శ్రీపార్వతి పరమేశ్వరస్వామి కల్యాణమహోత్సవం, 13 రాత్రి 9గంటలనుంచి 12గంటల వరకు ప్రభావళి మహోత్సవం, 14 సాయంత్రం 4గంటల నుంచి 6 వరకు మహారథోత్సవం, 15వతేదీ రాత్రి 9నుంచీ 12 వరకూ వ్యాహావళి మహోత్సవం, 16వతేదీ సాయంత్రం 5 నుంచి 9గంటల వరకు తీర్థావళీ వసంతోత్సవం నిర్వహిస్తారు. మహారథోత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. వ్యవసాయానికి జాతరే.. ఎమ్మిగనూరు జాతరలో ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పలు అంశాలు చోటుచేసుకుంటాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి వివిధ రకాల మేలు జాతి ఎద్దులు, దూడలను విక్రయానికి ఉంచుతారు. పది రోజుల పాటు జరిగే పశువుల జాతరలో రూ.3కోట్ల వరకు లావాదేవీలు నమోదవుతాయి. వివిధ ప్రాంతాల్లో నిపుణులు తయారు చేసిన వ్యవసాయ పనిముట్లు, ఎద్దుల బండ్లను ప్రదర్శన, విక్రయాలకు ఉంచుతారు. సంప్రదాయ బలప్రదర్శనకు పెద్దపీట.. జాతర సందర్భంగా ఎమ్మిగనూరులో ప్రత్యేకంగా నిర్వహించే ఎద్దుల బలప్రదర్శనలు ఉత్సవాలకు మరింత శోభను తెస్తాయి. నాలుగు రోజుల పోటీల్లో రాష్ట్రం నలుమూల నుంచి వివిధ కేటగిరిలకు చెందిన ఒంగోలు జాతి ఎద్దులను రైతులు ఇక్కడికి తీసుకువస్తారు. నెలల తరబడి తర్ఫీదు ఇచ్చిన మేలు జాతి ఎద్దులతో జరిగే బండలాడుగు పోటీలు ప్రత్యేక ఆకర్శణగా మారాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరింత.. జాతర సందర్భంగా ఎమ్మిగనూరులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తున్నారు. జానపద నృత్య ప్రదర్శనలు, ఏకపాత్ర అభినయాలు, సంప్రదాయ నాటక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలతో ఎమ్మిగనూరు కలకలాడునుంది. క్రికెట్, వాలీబాల్, షటీల్, కబడ్ఢీ, ఫుట్‌బాల్ వంటి ప్రధాన టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారు.