లభించని చిన్నారి ఆచూకీ | Man Pushed Wife and Daughter Into Nippulavagu In Kurnool | Sakshi
Sakshi News home page

లభించని చిన్నారి ఆచూకీ

Published Sat, Sep 7 2019 6:50 AM | Last Updated on Sat, Sep 7 2019 6:51 AM

Man Pushed Wife and Daughter Into Nippulavagu In Kurnool - Sakshi

చిన్నారి కోసం నిప్పులవాగు వెంట గాలిస్తున్న బంధువులు

సాక్షి, పాములపాడు(కర్నూలు): తండ్రి కర్కశత్వానికి గురైన చిన్నారి తేజప్రియ ఆచూకీ లభించలేదు. ఈ నెల 2న మండలంలోని పెంచికలపల్లి గ్రామానికి చెందిన వానాల వెంకటేశ్వర్లు తన భార్య దేవమ్మ, కూతురు తేజప్రియ(3)లను వెలుగోడు మండలం గుంతకందాల గ్రామ సమీపంలోని నిప్పులవాగులో తోసేసిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న పోలీసులు నిప్పులవాగు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 4న అబ్దుల్లాపురం పవర్‌ప్లాంట్‌ వద్ద దేవమ్మ చీర లభ్యమైంది.

నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గాలింపు చర్యలకు కొంత మేర ఇబ్బంది ఏర్పడింది. ఆత్మకూరు, నందికొట్కూరు సీఐలు శివనారాయణస్వామి, సుబ్రమణ్యం, పాములపాడు, వెలుగోడు, ఆత్మకూరు ఎస్‌ఐలు రాజ్‌కుమార్, రాజారెడ్డి, ఓబులేసు, నాగేంద్ర ప్రసాద్‌ తమ సిబ్బందితో మూడు రోజులు విస్తృతంగా నిప్పులవాగు వెంట గాలింపు చర్యలు చేపట్టడంతో గురువారం దేవమ్మ మృతదేహం లభ్యమైంది. అక్కడే పంచనామా నిర్వహించి శుక్రవారం పెంచికలపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా చిన్నారి తేజప్రియ ఆచూకీ తెలియలేదు.  మూడేళ్ల చిన్నారి కావడంతో ప్రవాహం వేగంగా ఉండటం వల్ల దిగువకు వెళ్లి ఉండవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. ఇది చదవండి : రెండో పెళ్లికి అడ్డువస్తున్నారని; భార్య, కూతురిని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement