కర్నూలు, బొమ్మలసత్రం: కారు గెలుపొందారంటూ ఫోన్‌చేసి రూ. 1.90 లక్షలు దండుకొని గుర్తు తెలియని వ్యక్తి టోకరా వేశాడు. బాధితుడు సోమవారం స్థానిక రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన బాలస్వామి అదే గ్రామంలో ఆర్‌సీఎం చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల కిందట కొత్త నంబర్ నుంచి సెల్‌కు ఫోన్ వచ్చింది. ఫోన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడుతూ..లాటరీ తగిలిందని, కొత్త కారు మీరు గెలుచుకున్నారని, జీఎస్టీ చెల్లిస్తే కారు మీ ఇంటికి పంపుతామని నమ్మించాడు. నగదు వేసేందుకు అకౌంట్ నంబర్ ఇవ్వటంతో బాలస్వామి..అదులో విడతల వారిగా 1.90 లక్షలు నగదు బదిలీ చేశాడు. నగదు పంపి రెండునెలలు గడిచినా ఇంతవరకూ కారు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాలస్వామి.. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment