
నిందితుడు ఖాజాను అరెస్టు చూపుతున్న పోలీసులు
కర్నూలు, ఆత్మకూరు రూరల్: విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ప్రయివేటు టీచర్‌ను కటకటాలకు పంపారు. ఈ ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరుకు చెందిన ఖాజా అనే వ్యక్తి స్థానికంగా ఓ ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని మంగళవారం అరెస్టు చేశారు. ఆత్మకూరు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పర్చగా.. 15 రోజుల రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment