
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జూపాడుబంగ్లా(కర్నూలు): నమ్మించి తనకు నపుంసకునితో వివాహం చేసి మోసం చేశారని మండ్లెం గ్రామానికి చెందిన మంతసాగరిక అనే యువతి సోమవారం జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాలు.. మండ్లెం గ్రామానికి చెందిన సుశీలమ్మ కుమార్తె మంత సాగరికను కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన కుమారస్వామి కుమారుడు వెంకటేశ్వర్లుకు ఇచ్చి 2018 ఆగస్టు 17న వివాహం చేశారు.
వివాహమైనప్పటి నుంచి తన భర్త తనతో కాపురం చేయటం లేదని బాధితురాలు అత్త కృష్ణవేణి, మామ కుమారస్వామిలకు తెలియజేయటంతోపాటు డాక్టర్ల వద్ద చూపించినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొంది. విషయం.. పుట్టింలోగానీ, ఇంకా ఎవరికైనా గానీ చెబితే చంపేస్తామంటూ శారీరకంగా, మానసికంగా తనను అత్త, మామలు చిత్రహింసలకు గురిచేశారని వాపోయింది. కొడుకు నపుంసకుడని తెలిసి తనను మోసం చేసి, అతనితో వివాహం చేసి, తనను మోసగించి, జీవితాన్ని నాశనం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు.
(చదవండి : ఘరానా మోసగాడు.. ఏడు పెళ్లిళ్లు)
Comments
Please login to add a commentAdd a comment