
అహ్మదాబాద్: భర్త, అత్తింటివారికి వ్యతిరేకంగా ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు. నాలుగు నెలల కిందట తనకు పెళ్లయిందని, పెళ్లయిన నాటి నుంచి అత్తింటివారు వేధిస్తున్నారని, దీనికితోడు బాత్రూమ్‌లో శృంగారంలో పాల్గొనడానికి నిరాకరించడంతో భర్త తనను చితకబాదాడని, పలుసార్లు తనపై భౌతికంగా దాడి చేసి.. శారీరకంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుజరాత్‌లోని భావనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
‘నాలుగు నెలల కిందట మాకు వివాహమైంది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి సమయంలో నిద్రలేపి వెంటనే వెళ్లి కట్నం తీసుకురావాల్సిందిగా వేధించేవారు. దీనికితోడు భర్త సోదరుడు (అన్న) కూడా నన్ను లైంగికంగా వేధించాడు. ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు అతను నా వద్దకు లైంగికంగా వేధించేవాడు. కట్నం తేవాలంటూ అత్తింటివారు నన్ను పలుసార్లు చితకబాదారు. పలు సందర్భాల్లో నా భర్త నాపై బలవంతంగా లైంగికంగా విరుచుకుపడ్డాడు. ఓసారి బాత్‌ర్రూమ్‌లో శృంగారానికి నిరాకరించడంతో నన్ను చితకబాది.. బలత్కారం చేశాడు’ అని 19 ఏళ్ల బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment