
రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా టాక్ట్రర్లపై రవాణా
పశ్చిమగోదావరి , తణుకు : జిల్లాలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడిచేలా ఇష్టారాజ్యంగా చెట్లు నరికి కలప రవాణా చేస్తున్నా అటవీశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు పర్మిట్లతో వాహనాల్లో తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పలువురు అంటున్నారు. మధ్యవర్తుల సాయంతో అటవీ శాఖలోని కొం దరు అధికారులు, సిబ్బంది సహకారంతో జిల్లా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా సాగి పోతోంది. మరోవైపు జిల్లాలోని టింబర్ డిపోలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యం వందలాది టన్నుల కలప వ్యాపారుల చేతుల్లోకి చేరుతోంది. దీంతో ఏటా రూ.కోట్ల మేర అక్రమ వ్యాపారం సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాం తాల నుంచి తరలిపోతున్న కలపను రాష్ట్ర సరిహద్దు మందలపల్లి అటవీ తనిఖీ కేంద్రం వద్ద మూడు వాహనాలను అక్కడి అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తణుకు ప్రాంతానికి చెందిన కొందరు టింబర్ డిపో నిర్వాహకులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి రాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున కలపను ఇక్కడకు తరలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
అక్రమ వ్యాపారుల గుప్పెట్లోకి..
జిల్లాలో కలప రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు వ్యాపారుల గుప్పెట్లోకి చేరి పోవడంతో విచ్చలవిడిగా వ్యాపారం సా గుతోందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఏలూరు, రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం డివిజన్ల పరిధిలోని రిజర్వు ఫారెస్టుతోపాటు సాధారణ వనా లు ఉన్నాయి. జిల్లాలో 12 చదరపు కిలోమీటర్లు మేర దట్టమైన అడవులు ఉండగా మొత్తం 17 వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతాలతోపాటు తీరప్రాంతాల నుంచి విచ్చలవిడిగా అక్రమంగా కలపను రవాణా చేస్తున్నా అరికట్టకపోవడంతో కలప వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. మరోవైపు జిల్లాలోని టింబర్ డిపోలపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో 600 టింబర్ డిపోలు
జిల్లాలో సుమారు 600 వరకు టింబర్ డిపోలు ఉన్నాయి. వీటి ద్వారా జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి కలపను దిగుమతి చేసుకుని పలురకాల వస్తువులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. అయితే అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు సిబ్బంది కొరతగా ఉన్నారనే సాకుతో తప్పించుకుంటున్నారు. అటవీ శాఖ అధికారుల రికార్డుల్లో లేని అనధికార టింబర్ డిపోలు చాలానే ఉన్నట్టు తెలిసింది.
అనుమతులు ఎక్కడ..?
కలప అమ్మకాలకు అటవీ, రెవెన్యూ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. జి ల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులను ప్రసన్నం చేసుకుంటే ఇష్టారాజ్యంగా కలపను అ క్రమ రవాణా చేయవచ్చనే భావనలో వ్యాపారులు ఉన్నారు. కలప రవాణా చేసే క్రమంలో దశలవారీగా అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వాహనాలను ఇచ్చే పర్మిట్లలో కలప రవాణా అయ్యే మార్గంతోపాటు తేదీ, కలప చేరాల్సిన ప్రదేశం పొందుపరచాలి. దీం తోపాటు పర్మిట్‌పై సంబంధిత అధికారి సంతకం ఉండాలి. ఈక్రమంలోనే వ్యాపారులు నకిలీ పర్మిట్లు సృష్టించి తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బందికి మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాల్టా చట్టం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
చర్యలు తప్పవు
కలప అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని టింబర్ డిపోలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా అక్రమ కలప దిగుమతి చేసుకున్నట్టు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. –పి.ప్రకాశరావు, జిల్లా అటవీశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment