రోడ్డుపై బారికేడ్లను లాక్కెళ్తున్న యువకులు
టీ.నగర్: కొత్త సంవత్సర వేడుకల్లో బైక్‌రేసులో పాల్గొన్న యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీడియో వాట్సాప్‌లో విడుదల చేయడంతో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. చెన్నైలో డిసెంబరు 31వ తేదీ రాత్రి నూతన వేడుకల సందర్భంగా కొందరు యువకులు మెరీనా తీరంలోను, కోట్టూర్‌పురం రోడ్డులోను బైక్‌రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇలావుండగా ఆరోజు రాత్రి మెరినా కామరాజర్ రోడ్డులో కొందరు యువకులు బైక్‌రేస్‌లో పాల్గొన్నారు. అందులో కొందరు బారికేడ్లను మోటర్‌బైక్‌తోపాటు రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు.
దీంతో అక్కడ సంచలనం ఏర్పడింది. దీనిగురించి ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అరుణ్ నేతృత్వంలో విచారణ జరిగింది. కొన్ని రోజులుగా వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తువచ్చారు. దీనికి సంబంధించి పెరంబలూరుకు చెందిన పీటర్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన యువకుడు పోలీసులను ఫేస్‌బుక్‌లో తిడుతూ వీడియో విడుదల చేయడంతో శనివారం పట్టుపడినట్లు తెలిసింది. ఇలావుండగా అరెస్టయిన పీటర్ తన చర్యలకు పోలీసుల క్షమాపణ కోరుతూ మరో వీడియోను విడుదల చేశాడు. ఈ రెండు వీడియోలు ప్రస్తుతం వాట్సాప్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment