ద్విచక్ర వాహనం కొనలేదని యువకుడి ఆత్మహత్య | young man commit to suicide | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం కొనలేదని యువకుడి ఆత్మహత్య

Published Tue, Oct 3 2017 9:30 AM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM

young man commit to suicide - Sakshi

భాను సురేష్‌ మృతదేహం

విశాఖ సిటీ, చోడవరం టౌన్‌: ద్విచక్రవాహనం కొనలేదన్న మనస్తాపంతో  ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో దుడ్డుపాలెం ఎస్సీ కాలనీలో ఉంటున్న ములకలపల్లి భానుసురేష్‌ (16) పెయింటింగ్‌ పనులు   చేస్తుం టాడు.  తన కు ద్విచక్రవాహనం కొనా లని ఇంటిలో వారిని కొద్ది రోజులగా అడుగుతున్నాడు. అయితే మన పరిస్థితి అంతంత మాత్రమేనని తరువాత కొనుక్కుందామని కుటుంబ స భ్యులు సురేష్‌కి చెప్పారు. అనకాపల్లి మండలం వడ్లపూడిలో సురేష్‌ కుటుం బం నివసించేది.   సురేష్‌ తండ్రి కొండలరావు నాలుగేళ్ల కిందట మరణించడంతో  తల్లి మారెమ్మ పిల్లలను తీసుకుని అమ్మగారి ఊరు దుడ్డుపాలెం వచ్చేసింది.   కూలిపని చేస్తూ కు టుంబాన్ని పోషిస్తోంది.

భాను సురేష్‌ కూడా చదువు మానేసి పెయింటింగ్‌ పనికి, రేషన్‌ డిపోలో తూనికలు వేయడానికి వెళ్తుండేవాడు. దసరా సందర్భంగా శనివారం సొంత ఊరు వడ్లపూడికి కుటుంబ సభ్యులంతా వెళ్లారు. తనకు పని ఉందని, దుడ్డుపాలెం వెళ్లిపోతానని తల్లి మారెమ్మ వద్ద రూ. వంద తీసుకుని  అక్కడి నుంచి  సురేష్‌ సోమవారం ఉదయం వచ్చేశాడు. మారెమ్మ సోమవారం సాయంత్రం దుడ్ముపాలెం వచ్చింది. ఇంటికి వచ్చి తలుపులు తీసి చూసేసరికి చీరతో ఉరివేసుకుని సురేష్‌ వేలాడుతుండడం చూసి భోరున విలపించింది. స్థానికులు వచ్చి సురేష్‌ మృతి దేహాన్ని కిందకి దించారు. అయితే సురేష్‌ తండ్రికి తరఫు బంధువులు మాత్రం సురేష్‌ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ మల్లేశ్వరరావు సంఘటనా స్థలాన్ని  పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  ఎస్‌ఐ తెలిపారు. సురేష్‌కి తమ్ముడు హర్ష ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement