నెల్లూరు(క్రైమ్): తన సొంత ఊర్లో వివాహం చేసుకునేందుకు ఇష్టం లేని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమా చారం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన మణికి ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరు కుమార్తెలకు నెల్లూరులో వివాహం చేశాడు. చిన్నకుమార్తె రాజేశ్వరి(23) కోయంబత్తూరులోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు ఆమె నెల్లూరు నగరంలోని కొత్తూరులో నివాసం ఉంటున్న తన అక్క విజయలక్ష్మి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో రాజేశ్వరికి తంజావూరులోనే సమీప బంధువుతో వివాహం చేసేందుకు ఆమె అవ్వ, కుటుంబసభ్యులు నిర్ణయించారు.
తనకు తంజావూరులో వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, నెల్లూరు లో చేస్తే అక్కలతో కలిసి ఉంటానని రాజేశ్వరి వారికి చెప్పింది. వారు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన విజయలక్ష్మి, ఆమె కుటుంబసభ్యులు ఇంటి బయట మాట్లాడుకుంటుండగా రాజేశ్వరి ఇంట్లోని దూలానికి చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటికి ఇంట్లోకి వచ్చిన విజయలక్ష్మి తన సోదరి దూలానికి వేలాడుతుండటాన్ని గమనించి పెద్దగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన రాజేశ్వ రిని కిందకు దించారు. చికిత్సనిమిత్తం జీజీహెచ్‌కు తరలించా రు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని పేర్కొన్నారు. ఈ మేరకు రాజేశ్వరి అక్క భర్త శరవణ్‌కుమార్ బుధవారం అర్ధరాత్రి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment