చిలమత్తూరు (అనంతపురం): కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి సమీపంలో ఆదినారాయణ కొండపై వెలసిన శ్రీలక్ష్మీ ఆదినారాయణ స్వామి వారికి ఆదివారం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
సోమవారం రాత్రి స్వామి వారికి పూల పల్లకి సేవ జరగనుంది. దీంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఏటా మాఘ పౌర్ణమి తర్వాత వచ్చే తొలి ఆదివారం నాడు స్వామి వారికి రథోత్సవం నిర్వహిస్తుంటారు. అక్కడ ఆది నారాయణ కొండ తాబేలు ఆకారంలో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం అనంతపురం జిల్లా చిలమత్తూరుకు దగ్గరగా ఉంటుంది.