సినారె మృతి తెలుగుజాతికి తీరని లోటు: నాట్స్ | NATS condolences message to Dr. C.Narayana Reddy | Sakshi
Sakshi News home page

సినారె మృతి తెలుగుజాతికి తీరని లోటు: నాట్స్

Published Wed, Jun 14 2017 9:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

సినారె మృతి తెలుగుజాతికి తీరని లోటు: నాట్స్

సినారె మృతి తెలుగుజాతికి తీరని లోటు: నాట్స్

తెలుగుజాతి మనది.. నిండుగా వెలుగుజాతి మనది అంటూ యావత్ తెలుగుజాతికి స్ఫూర్తిగా నిలిచిన మహాకవి డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. జ్ఞానపీఠ్ అవార్డుకే వన్నె తెచ్చిన  సినారె ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపింది.

సినారె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు.. కవితలు చిరస్మరనీయంగా తెలుగుజాతి ఉన్నంత కాలం వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేస్తాయని నాట్స్ ప్రకటించింది. సినారె కుటుంబ సభ్యులకు నాట్స్ తన ప్రగాడ సానుభూతిని తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement