Narayan Reddy
-
మీకు ఓటెయ్యబోమని ముందే నిక్కచ్చిగా చెప్పేవారు..
సాక్షి– నిజామాబాద్ :భారత పార్లమెంట్‌కు జరుగుతున్న తొలి ఎన్నికలవి. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీకి చెందిన నాయకున్ని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం.. ఇక్కడ ఆయన గెలిచాక ఆయన ఢిల్లీకి వెళ్లిపోవడం పరిపాటైంది. వరుసగా 1952, 1957, 1962 ఎన్నికల్లో ఇదే తీరు.. ఈ మూడుసార్లూ గెలిచిన హరిశ్చంద్ర హెడా స్థానికంగా అందుబాటులో ఉండకపోయేవారు. ఈ క్రమంలో ఇందూరుపై స్థానికేతరుల ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు 30 ఏళ్ల యువకుడు. కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని స్థానికులకే ఇవ్వాలనే వాదనను వినిపించారు. పార్టీ తీరు మారకపోవడంతో తానే స్వయంగా స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ‘స్థానికత’ సత్తా ఏమిటో చాటారు. ఆయనే ఎం.నారాయణరెడ్డి. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగగా, స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఒకే ఒక్క నేత ఆయన. ఇందూరు తొలి స్థానిక ఎంపీగానూ ఘనత వహించారు. 1972కు ముందు కాంగ్రెస్‌లో చేరిన నారాయణరెడ్డి బోధన్ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ పలకరించినపుడు నాటి రాజకీయ పరిస్థితులు, అభ్యర్థిత్వాలు, ప్రచారశైలిపై తన మనోగతాన్ని పంచుకున్నారు.- పాత బాలప్రసాద్ గుప్త, బ్యాలెట్ బాక్స్‌కు పసుపు,కుంకుమ పూసి మొక్కేవారు.. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు కాడెడ్లు. రెండు ఎడ్లు, కాణి ఉండేది. ఈ గుర్తును అప్పట్లో పరమశివుడి వద్ద ఉండే నందులుగా భావించేవారు ఓటర్లు. ఓటేసేందుకు వచ్చినప్పుడు తమ వెంట పసుపు, కుంకుమ, పూలు తెచ్చుకుని ఈ గుర్తుపై ఓటేసేవారు. ఇలాంటి ఘటనలు అప్పట్లో దేశవ్యాప్తంగా చోటు చేసుకునేవి. అంత పవిత్రమైన కాంగ్రెస్ గుర్తుపై ఎవరు పోటీ చేసినా విజయం సునాయాసంగా వరించేది. ప్రజలు కూడా అభ్యర్థి ఎవరనేది పెద్దగా చూసేవారు కాదు. కాంగ్రెస్ తప్ప వేరే పార్టీలు లేవు. సోషలిస్టు పార్టీ ఉన్నా.. ప్రభావం అంతంతే.. దీన్ని ఆసరా చేసుకుని ఢిల్లీ పెద్దలు స్థానికేతరులను మాపై రుద్దేవారు. దీన్ని గట్టిగా వ్యతిరేకించాను. జిల్లాలో ఉన్న యువతను, విద్యార్థులను ఏకం చేశాను. స్థానికులెవరికైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశాం. 1962లో కూడా స్థానికేతరులకే టికెట్ ఇస్తున్నారని తెలిసి.. జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యనేతల వద్దకు వెళ్లి ప్రశ్నించాం. దీంతో అధిష్టానం పెద్దలు నాపై ఒత్తిడి తెచ్చారు. స్థానికత వాదనను పక్కనపెడితే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటామని హామీనిచ్చారు. నేను ఒప్పుకోలేదు. 1967 ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి.. స్థానికేతరుల పెత్తనాన్ని అడ్డుకోవడానికి ఉద్యమించిన నన్నే ఈసారి ఎంపీగా బరిలోకి దిగాలని జిల్లా వాసులంతా ఒప్పించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాను. సైకిళ్ల మీద తిరిగి ప్రచారం చేశాం.. అప్పట్లో పెద్దగా వాహన సదుపాయం ఉండేది కాదు. నేను పోటీ చేసినప్పుడు ఆర్మూర్‌కు చెందిన భూస్వామి జీపు ఇచ్చి సాయం చేశారు. అప్పట్లో చేతిమైక్లు ఉండేవి. అప్పట్లో నా ప్రచారం వినూత్నంగా సాగేది. నేను ఆ రోజు ఏ గ్రామాలకు వెళ్తానో ఆ ముందు రోజే నా గుర్తు, ఫొటోలతో కూడిన కరపత్రాలను ఆ గ్రామానికి పంపేవాడిని. మర్నాడు నేను గ్రామానికి వెళ్లే సరికి గ్రామస్తులంతా ఆ కార్డులు పట్టుకుని నా దగ్గరకు వచ్చేవారు. నా ప్రచార తీరుకు నా ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి హరిశ్చంద్ర హెడే సైతం ఆశ్చర్యపోయే వారు. గ్రామాల్లో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉండేది. వాళ్లు ఎవరికి చెబితే వాళ్లకే ఓట్లు పడేవి. దీంతో అభ్యర్థులు నేరుగా వీరినే కలిసే వారు. మీకు ఓటెయ్యబోమని ముందే నిక్కచ్చిగా చెప్పేవారు.. గతంలో ప్రజలు నిక్కచ్చిగా ఉండేవారు. ఫలానా కారణాల వల్ల మీకు ఓటెయ్యబోమని ముఖం మీదే చెప్పేవారు. రాజకీయాల్లోనూ విలువలు ఉండేవి. కులతత్వం ఉండేది కాదు. ప్రస్తుతం నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కుల సంఘాల భవనాలకే ఇస్తున్నారు. అంటే సమాజంలో కులాలను నేతలే ప్రోత్సహిస్తున్నారు. కుల సంఘాలు కూడా అలాగే తయారయ్యాయి. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని చూడటం లేదు. తమ కుల సంఘానికి ఎంతిస్తారంటూ అభ్యర్థుల దగ్గరకు వెళుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఓటరు చైతన్య కార్యక్రమాలునిరంతరం జరగాలి.. వినియోగదారుల హక్కులపై ఎలాగైతే నిరంతర చైతన్యం చేస్తున్నారో.. ఓటరు చైతన్య కార్యక్రమాలూ నిరంతరం జరగాలి. ఇందుకోసం వివిధ స్థాయిల్లో ఓటరు ఫోరాలు ఏర్పాటు చేయాలి. ఎన్నికలప్పుడే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఫోరం సమావేశమై ఓటర్లను చైతన్యం చేస్తూనే గెలిచిన అభ్యర్థి పనితీరుపై సమీక్షలు, చర్చావేదికలు నిర్వహించాలి. ఇది జరగకపోతే ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు తన అధికార బలంతో ప్రత్యర్థులను లేకుండా చేసుకుంటారు. -
ఎమ్మెల్యే హోదాలో ఉండి అప్పు తీర్చుకోలేకపోయారు..
బంజారాహిల్స్: పాతికేళ్ల వయస్సులోనే ఎన్నికల రణరగంలోకి దూకిన ఓ సాదాసీదా ఉద్యోగి కాకలు తీరిన రాజకీయ కురువృద్ధుడ్ని ఓడించి అప్పట్లో రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమయ్యారు. అయితే ఎన్నికల్లో చేసిన అప్పును ఎమ్మెల్యే హోదాలో ఉండికూడా తీర్చుకోలేకపోయారు. ఇప్పటికీ హైదరాబాద్‌లో సొంతిల్లు లేక అద్దెగదిలోనే కాలం వెల్లబుచ్చుతున్న పాలకొలను నారాయణ రెడ్డి (82) ఎమ్మెల్యే కథ ఆసక్తికరం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుండి 1966–1967 శాసనసభ కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 1962లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన సీ.రాజగోపాల చారి అలియాస్ రాజాజీ స్వతంత్ర పార్టీ పేరుతో ఓ పార్టీని నెలకొల్పారు. అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కుర్రాళ్లను రంగంలోకి దింపారు. హైకోర్టులో ఉద్యోగం చేస్తున్న నారాయణ రెడ్డి కూడా సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తుండడంతో మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాల్సిందిగా పిలుపొచ్చింది. అయితే అక్కడ కాకలు తీరిన కాంగ్రెస్ అభ్యర్థి ఉండటంతో ఆయనతో పోటీ చేసి గెలవడం కష్టమని నారాయణ రెడ్డి వెనకడుగు వేసి తనవద్ద అంత డబ్బు కూడా లేదని చెప్పారు. నువ్వు తప్పకుండా గెలుస్తావు ఎన్నికల ఖర్చుకింద 2వేలు ఉంచుకోవాలంటూ రాజాజీ బలవంతంగా ఎన్నికల క్షేత్రంలోకి దింపారు. గెలిచినా, ఓడినా పెద్ద నష్టమేమీ లేదనుకున్న నారాయణ రెడ్డి నామినేషన్ల ప్రక్రియ రేపనగా పార్టీలో చేరి ప్రచారంలో ఊరూరా తిరిగాడు. వారం గడిచిన తర్వాత ఆయనకు మద్దతుగా ఉవ్వెత్తున ఊర్లు కదలివచ్చాయి. రూ.10 వేలు అప్పుచేసి రాజాజీ ఇచ్చిన రూ.2 వేలు కలిపి ఆ ఎన్నికల్లో మెత్తం రూ.12 వేలు ఖర్చుచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు తాను గెలవడమేంటని అనుకుని హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. తాను గెలిచిన విషయాన్ని రాత్రి రేడియోలో చెప్పేదాకా నమ్మలేకపోయానన్నారు. అప్పుడు కడపలో స్వతంత్ర పార్టీ నుండి 7 మంది పోటీ చేస్తే 7 మందీ గెలిచారని గుర్తుచేసుకున్నారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సభలో తాను ఎమ్మెల్యేనని నీతి, నిజాయతీతో సేవలందించానని ఒక్క రూపాయి కూడా అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు. అయితే అప్పుడు కూడా ఫిరాయింపులు, ఆకర్ష పథకాలు ఉండేవని తాను కాంగ్రెస్‌లో చేరితే ఆ తర్వాత ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చి మంత్రిపదవి కూడా ఇస్తామని ప్రలోభపెట్టినా తాను జంప్ కాలేదని, నమ్మిన పార్టీతోనే కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. గడ్డిఅన్నారం డివిజన్లో ప్రచారంలో భాగంగా కూరగాయలు అమ్ముతున్నఎల్‌బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అప్పుడు స్వతంత్ర పార్టీ నుండి గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రలోభాలకు గురికాకుండా నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారని చెప్పారు. అప్పుడు తన నెలజీతం రూ.250 ఉండేదని, ఎన్నికలకోసం చేసిన రూ.3 వేల అప్పు కూడా మాజీ అయిన తర్వాత కూడా తీర్చుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో రూ.7వేలు అద్దె చెల్లిస్తూ రెండు గదుల ఇంటిలో ఉంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని, ఇప్పుడు అన్ని ప్రలోభాలు ఫిరాయింపులే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చ రాజకీయాలు పూర్తిగా కనుమరుగయ్యాయని, పక్క పార్టీ నుండి ఎమ్మెల్యేలను లాక్కోవడమే పనిగా పెట్టుకుని అదే అభివృద్ది అంటూ జబ్బలు చరుచుకుటున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలంటే ఇప్పుడున్న ప్రజలకు గౌరవం పోతుందని మళ్ళీ అప్పటిరోజులు రావాలంటే కొత్త నాయకులు పుట్టాల్సిందే అన్నారు. ఇప్పటి ఎన్నికల ప్రచార తీరుతెన్నులు కూడా అసహ్యంగా ఉన్నాయని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంతోనే సరిపెట్టుకుటున్నారు తప్పితే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాటం చేయాలని, ఏ అభ్యర్థి కూడా అనుకోవడంలేదన్నారు. ఇప్పుడు అంతా డబ్బుతో ప్రచారమని, తమ కాలంలో ఊరూరా తిరిగితే ప్రచారమని ప్రచారతీరును పోల్చారు. -
కేటీఆర్ హామీతో అలకవీడిన ఎమ్మెల్సీ
సాక్షి, నాగర్ కర్నూలు: టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు పూర్తి కావస్తున్న ఆ పార్టీని అసమ్మతి సెగలు వీడటం లేదు. అసమ్మతి రాగం అందుకున్న కొందరు నేతలను టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించిగా.. మరికొందరు నేతలు మాత్రం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. కల్వకుర్తి టికెటు విషయంలో మనస్తాపం చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఓ దశలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు కూడా ప్రచారం జరిగింది. గతంలో అపద్దర్మ మంత్రి కేటీఆర్ నారాయణరెడ్డిని బుజ్జగించినప్పటికీ ఫలితం లేకపోయింది. నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే.. కల్వకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌కు గట్టి షాక్ తగిలే అవకాశాలు ఉండటంతో కేటీఆర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కేటీఆర్ గురువారం మరోసారి నారాయణరెడ్డితో సంప్రదింపులు జరిపారు. నారాయణరెడ్డితో భేటీ అయిన కేటీఆర్ భవిష్యత్తులో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. దీంతో అలకవీడిన నారాయణరెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను గెలిపించుకుంటామని తెలిపారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి కల్వకుర్తిలో జరిగే టీఆర్ఎస్ బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు. -
కల్వకుర్తి స్వతంత్ర అభ్యర్థిగా కసిరెడ్డి?
ఆమనగల్లు(కల్వకుర్తి) : కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీచేయనున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులకు సంకేతాలు ఇచ్చారు. మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామం నుంచి గురువారం కసిరెడ్డి నారాయణరెడ్డి పరోక్షంగా ప్రచారం ప్రారంభించారు. కల్వకుర్తి అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను పార్టీ ప్రకటించడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. మంత్రి కేటీఆర్ స్వయంగా బుజ్జగించినా ఆయన మెత్తబడలేదు. తన అనుచరుల ఒత్తిడితో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కసిరెడ్డి సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీగా విస్తృత పర్యటనలు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని కసిరెడ్డి నారాయణరెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. టికెట్ రాకపోవడంతో... ఈ ఎన్నికల్లోనూ కల్వకుర్తి నుంచి పోటీ చేయడానికి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసక్తి చూపించారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం టికెట్‌ను జైపాల్‌యాదవ్‌కు కేటాయించింది. అప్పటి నుంచి కసిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. అయితే, రెండు మూడు రోజులుగా నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి ముఖ్యనాయకులతో కసిరెడ్డి రహస్య సమావేశాలు నిర్వహించి అనుచరుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. -
పేదల పెన్నిధి నారాయణరెడ్డి
పోరాటం ఆయన పంథా..అన్యాయాన్ని ప్రశ్నించడం ఆయన నైజం.. రైతుల కష్టాల్లో పాల్పంచుకుంటూ.. నిరుపేదలకు అండగా నిలిచి భూస్వాములగుండెల్లో నిద్రపోయిన రాకెట్ల నారాయణరెడ్డి త్యాగం చిరస్మరణీయం. విద్యార్థి నేతగా..వామపక్ష పార్టీ నాయకునిగా పాలకులపై రాజీలేని పోరాటం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. భూస్వాముల కుట్రకు బలై నేటికి 23సంవత్సరాలు గడిచినా ‘అనంత’ మదిలో ఆయన ఇప్పటికీ సజీవం. అనంతపురం: రైతు కుటుంబంలో జన్మించిన రాకెట్ల నారాయణరెడ్డి తన జీవితాంతం పేదల సంక్షేమం, సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి కృషి చేశారు. 1945–49 సంవత్సరాల్లో విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పని చేశారు. 1950 నుంచి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేశారు. దళిత విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలని నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉద్యమాలు జరిగాయి. అనంతర కాలంలో కమ్యూనిస్టు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఆదోని దగ్గరలోని బసాపురం గ్రామానికి చెందిన లలితమ్మతో నారాయణరెడ్డి వివాహం జరిగింది. ఆమె కూడా నారాయణరెడ్డి ఉద్యమానికి సహకరించడంతో పోరాటమే తన పంథాగా మార్చుకున్నారు. 1963లో అధిక శిస్తు నిర్మూలన కోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. గ్రామంలో ప్రభుత్వ ఆస్పత్రి, పాఠశాల, వసతిగృహాన్ని పోరాడి సాధించారు. అలాగే రాకెట్ల చుట్టుపక్కల సుమారు 15 గ్రామాల్లో పెత్తందార్ల దౌర్జన్యాలను ఎదురొడ్డి పోరాడారు. ముఖ్యంగా దౌర్జన్యంతో బోర్లు పూడ్చడం, అక్రమంగా వివిధ చెట్లు నరికివేత, అక్రమంగా కల్లు గీయించే విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. పార్టీపై నిషేధం విధించిన రోజుల్లో ప్రభుత్వం అరెస్ట్ చేయగా..చాలాకాలం జైల్లో గడిపారు. సింగిల్ విండో ప్రెసిడెంట్‌గా... రాకెట్ల సింగిల్ విండో ప్రెసిడెంటుగా పనిచేసిన నారాయణరెడ్డి రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉరవకొండ తాలూకా సీపీఐ కార్యదర్శిగాæ చాలా ఏళ్లు పని చేశారు. కౌకుంట్లలో మిగులు భూములను పంపిణీ చేయాలన్న డిమాండ్‌తో పోరాటం ప్రారంభించారు. చల్లపల్లి జమీందార్లపై జరిగిన భూపోరాటం తర్వాత అతిపెద్ద భూపోరాటం కౌకుంట్లలో జరిగింది. ఈ ఉద్యమంలో నారాయణరెడ్డితో పాటు చండ్రరాజేశ్వరరావు నల్లమల గిరిప్రసాద్, ఆంజనేయశాస్త్రి, నీలం రాజశేఖర్‌రెడ్డి, వీకే ఆదినారాయణరెడ్డి, సదాశివన్ పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కౌకుంట్లలో 1,200 ఎకరాల భూమిని స్వయంగా ‘భూ సమారాధన’ పేరుతో పేదలకు పంపిణీ చేశారు. అప్పటి సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు దాసరి నాగభూషణం, కొరటాల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ పోరాటం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రతిష్టను మరింతగా పెంచింది. భూస్వాముల ఆక్రోశానికి బలి నారాయణరెడ్డి చేస్తున్న పోరాటాలతో ఓ వైపు పేదల మద్దతు పెరుగుతుండగా.. మరోవైపు భూస్వాముల ఆక్రోషం కూడా పెరిగింది. వ్యవసాయాన్ని పక్కనపెట్టిన నారాయణరెడ్డి పూర్తిగా పార్టీ పనిలో నిమగ్నమయ్యారు. తన పిల్లలను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడంతో వారు రాష్ట్ర నాయకత్వ స్థాయికి ఎదిగారు. అన్యాయం ఎక్కడ జరిగినా వాలిపోవడం తన జీవన విధానంగా మార్చుకున్నారు. భూస్వాములు ఆయన్ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక దొంగదెబ్బ తీయాలనుకున్నారు. ఈ క్రమంలో 1995 మే 24న నారాయణరెడ్డితో పాటు ఆయన కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డిని హత మార్చారు. భౌతికంగా హత్య చేసినా పోరాటాల ద్వారా నారాయణరెడ్డి సాధించిన ఫలితాలు ప్రజలు పొందుతున్నంత కాలం వారి గుండెల్లో జీవించే ఉంటారు. తండ్రి స్ఫూర్తితో ఉద్యమ బాట జిల్లాలోని 3.50 లక్షల ఎకరాలతో పాటు ఉరవకొండ నియోజకవర్గంలోని 80వేల ఎకరాలకు హంద్రీనీవా ద్వారా సాగునీరు ఇవ్వాలంటూ ఉరవకొండలో 36 గంటల దీక్ష. బెళుగుప్ప మండల కేంద్రంలో 25 గంటల జలజాగరణ, వజ్రకరూరు మండలం పొట్టిపాడులో 25 గంటల జలజాగరణ, వేలాది మంది ఆయకట్టు రైతులతో కలిసి రాగులపాడు లిప్ట్ ముట్టడి. హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌తో జలసంకల్ప పాదయాత్ర పేరిట నియోజకవర్గం మొత్తం వందలాది మంది రైతులతో పాదయాత్ర. అనంతపురంతో పాటు కూడేరు మండల దాహార్తి తీర్చేందుకు రూ.56 కోట్లతో నిర్మించిన తాగునీటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వేలాది మందితో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముట్టడి. ఉరవకొండలోని అర్హులైన నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, వివిధ వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలనే డిమాండ్‌తో రోడ్ల దిగ్బంధం. ప్రజలే దేవుళ్లు మా నాన్న స్ఫూర్తితో ఉద్యమాలే ఊపిరిగా ముందుకెళ్తున్నాం. ప్రజలనే దేవుళ్లుగా భావించి సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం సాగిస్తున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేను కావడంతో అభివృద్ధికి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయిస్తోంది. దివంగత వైఎస్ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి ఏటా ప్రతి ఎమ్మెల్యేకు రూ.కోటి నిధులు కేటాయించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినా ప్రజల తరపున పోరాటం సాగిస్తున్నాం.– వై.విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే తండ్రి బాటలో తనయులు తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న నారాయణరెడ్డి తనయులు ప్రజల కోసం నిత్యం పరి తపిస్తున్నారు. వై.విశ్వేశ్వరరెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో అధికారం లేకపోయినా.. ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూన్నారు. కొందరి ప్రజాప్రతినిధులను కలవాలంటే పీఏ, అనుచరుల అనుమతులు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. కానీ విశ్వేశ్వరరెడ్డిని కలవాలంటే అలాంటి అనుమతులేవీ అక్కర్లేదు. ఎవరైనా సరే నేరుగా వెళ్లి ఆయన పక్కన కూర్చుని మాట్లాడేంత చనువు కల్పించారు. అందువల్లే ఆయనపై నియోజకవర్గ ప్రజలు మరింత విశ్వాసం పెంచుకున్నారు. ముఖ్యంగా హంద్రీ–నీవా సాగునీటి కోసం విశ్వేశ్వరరెడ్డి చేసిన ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. స్థానికంగా నీళ్లు ఇవ్వకుండా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన సోదరుడు వై.మధుసూదన్‌రెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారు. నేడు రాకెట్లలో వర్ధంతి కార్యక్రమం రాకెట్ల నారాయణరెడ్డి 23వ వర్ధంతిని గురువారం ఉరవకొండ మండలం రాకెట్లలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. -
సినారె పేరుతో 'ఆటా' అవార్డు
అట్లాంటా : ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డికి అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఘన నివాళులు అర్పించింది. అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో అట్లాంటాలో సినారె సంతాప సభ జరిగింది. ఆటా సభ్యులు డా.సి. నారాయణరెడ్డి మృతిపై తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. డా. సి. నారాయణరెడ్డి జ్ఞాపకార్థం తదుపరి ఆటాసమావేశాల్లో సినారె అవార్డును ప్రవేశపెట్టనున్నట్టు ఆటా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ఆసిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అనిల్ బొడ్డిరెడ్డి, వేణు పిసికె, కిరణ్ పాశం, మిగతా ఆటా సభ్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆటా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పలుమార్లు సినారె వచ్చిన విషయాలను కరుణాకర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆటా సమావేశాల సందర్భంగా స్వాగత గీతం రాయడానికి సినారె చేసిన సహాయాన్ని డా. సంధ్యా గవ్వా మననం చేసుకున్నారు. -
సినారె మృతి తెలుగుజాతికి తీరని లోటు: నాట్స్
తెలుగుజాతి మనది.. నిండుగా వెలుగుజాతి మనది అంటూ యావత్ తెలుగుజాతికి స్ఫూర్తిగా నిలిచిన మహాకవి డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. జ్ఞానపీఠ్ అవార్డుకే వన్నె తెచ్చిన సినారె ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపింది. సినారె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు.. కవితలు చిరస్మరనీయంగా తెలుగుజాతి ఉన్నంత కాలం వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేస్తాయని నాట్స్ ప్రకటించింది. సినారె కుటుంబ సభ్యులకు నాట్స్ తన ప్రగాడ సానుభూతిని తెలియజేసింది. -
డల్లాస్‌లో సినారె సంతాప సభ
డల్లాస్ : ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డికి డల్లాస్‌లోని తెలుగువారు ఘన నివాళులు అర్పించారు. టాంటెక్స్, ఆటా, తానా, నాటా, డాటా, టాటా, నాట్స్, కళా వాహిని,టీ, టీడీఎఫ్ సంఘాల సహకారంతో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్(టీపీఏడీ) ఆధ్వర్యంలో బసెర ఇండియన్ రెస్టారెంట్లో సినారె సంతాప సభ జరిగింది. పెద్ద మొత్తంలో తెలుగు ప్రజలు ఒక్కచోట చేరి డా.సి. నారాయణరెడ్డి మృతిపై తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సి. నారాయణరెడ్డి మరణ వార్త తెలియగానే టీపీఏడీ సభ్యులు శారదా సింగిరెడ్డి, రావు కల్వల, రఘువీర్ బండారు, మాధవి సుంకిరెడ్డి, అశోక్ కొండల, కరణ్ పోరెడ్డి, ఉపెందర్ తెలుగులు సంతాప సభను ఏర్పాటు చేశారు. డా. సాంబ శివ రావు, డా. ఆల్ల శ్రీనివాస్ రెడ్డి, తోటకూర ప్రసాద్, రావు కల్వల, రఘువీర్ బండారు, శారదా సింగిరెడ్డిలు సి. నారాయణరెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శారదా సింగిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు వెలిగిన మేరు పర్వతం మేను వాల్చింది. ప్రపంచ మహోన్నత కవులకు తీసి పోనంతగా విశ్వంభర తో విశ్వ నరుడిగా వెలుగొందిన వాడు. కవిలోకానా సూర్యుని వలె కవితా కాంతులుగా వెలుగొందిన వాడు. యింతటి మహా కవిని తెలుగుతల్లి , తెలుగునేల కనడానికి ఎన్నేళ్లు పడుతుందో కదా! అంటూ సినారె లేనిలోటు తీర్చలేనిదిగా అభివర్ణించారు.