అక్కినేని ఫౌండేషన్ కొత్త టీం ఎన్నిక | New Executive Committee elected for Akkineni Foundation of America(AFA) | Sakshi
Sakshi News home page

అక్కినేని ఫౌండేషన్ కొత్త టీం ఎన్నిక

Published Thu, Feb 18 2016 10:48 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

అక్కినేని ఫౌండేషన్ కొత్త టీం ఎన్నిక

అక్కినేని ఫౌండేషన్ కొత్త టీం ఎన్నిక

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను వెల్లడించింది. ఏఎఫ్ఏ బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2016 వ సంవత్సరానికి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర తెలిపారు.

నూతన కార్యవర్గ సభ్యులు వీరే..
అధ్యక్షుడు - రవి కొండబోలు
ఉపాధ్యక్షురాలు - శారద అకునూరి
కార్యదర్శి - ధామా భక్తవస్తలు
కోశాధికారి - రావు కల్వల
బోర్డు అఫ్ డైరెక్టర్స్: డాక్టర్. శ్రీనివాస రెడ్డి ఆళ్ళ,  డాక్టర్. సి. ఆర్. రావ్, మురళి వెన్నం, చలపతి రావు కొంద్రకుంట, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర.

అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా నూతన అధ్యక్షుడు రవి కొండబోలు మాట్లాడుతూ - వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో అక్కినేని ప్రథమ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని 2014 లో గుడివాడలో, ద్వితీయ పురస్కార ప్రదానోత్సవాన్ని 2015 లో హైదరాబాద్ లోను ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ సంవత్సరానికిగానూ అక్కినేని తృతీయ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని డిసెంబర్లో చెన్నైలో జరుపనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement