AFA
-
'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!'
ఫుట్‌బాల్ హెడ్బట్స్ షాట్ ఆడడం కామన్. ఈ క్రమంలో గాయాలు కావడం సహజం. కానీ ఉద్దేశపూర్వకంగా ఆటగాళ్లను గాయపరిచేలా హెడ్బట్స్ షాట్ కొడితే మాత్రం తప్పు కిందే లెక్క. తాజాగా మహిళల ఫుట్‌బాల్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏఎఫ్ఏ మహిళల సాకర్ టోర్నమెంట్లో భాగంగా రేసింగ్, ఎల్ పొర్వినిర్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఎల్ పొర్వినిర్ ఆధిపత్యం చూపిస్తుంది. ఇది తట్టుకోని రేసింగ్ ఢిపెండర్ మారియా బెలెన్ తర్బోడా ఎదురుగా వస్తున్న లుడ్మిలా రమ్రెజ్ ముఖాన్ని తన తలతో ఒక్క గుద్దు గుద్దింది. దీంతో రమ్రెజ్ కిందపడిపోయింది. ఆమె నుదుటి చిట్లి రక్తం కారింది. ఇది గమనించిన రిఫరీ పరిగెత్తుకొచ్చి ఏదో పొరపాటులో జరిగిందేమో అనుకొని ఎల్లో కార్డ్ చూపించింది. ఇదే సమయంలో రమ్రెజ్ మొహం రక్తంతో నిండిపోయింది. ఇది గమనించిన రిఫరీ ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ప్లేయర్ తలను పగులగొట్టినందుకు గాను మారియా బెలెన్కు రెడ్‌కార్డ్ చూపించింది. ఇది సహించని మారియా కాసేపు వాగ్వాదానికి దిగింది. రిఫరీ తన రెడ్కార్డ్కే కట్టుబడి ఉండడంతో చేసేదేం లేక మైదానాన్ని వీడింది. ఆ తర్వాత ఎల్ పొర్వినిర్కు వచ్చిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకొని గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లడమే గాక మ్యాచ్‌ను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ''ఇది కచ్చితంగా కావాలని చేయలేదు.. మనసులో ఏదో పెట్టుకొనే ఈ పని చేసినట్లుంది'' అని కామెంట్ చేశారు. ¡UFFFF, TREMENDO CHOQUE! 💥 Por este cabezazo a destiempo sobre Ludmila Ramírez fue expulsada María Belén Taborda. 🟨 En primera instancia, la árbitra Estefanía Pinto amonestó, pero luego rectificó su sanción.🟥 Con 10 Racing ante El Porvenir.#FUTBOLenDEPORTV | @YPFoficial pic.twitter.com/rd15TdGQnO — DEPORTV (@canaldeportv) May 23, 2023 ¡SE GRITA EN GERLI! ⚽️ Apareció Karina 'Chicho' Merlo con un potente tiro libre para adelantar a @elporvenirfem 1-0 sobre Racing. #FUTBOLenDEPORTV | @YPFoficial pic.twitter.com/vIqe9i9kTN — DEPORTV (@canaldeportv) May 23, 2023 చదవండి: ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా? -
మెస్సీపై ముగిసిన ఒక్క మ్యాచ్ నిషేధం
బ్యూనస్ ఎయిర్స్: ప్రఖ్యాత ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీపై అంతర్జాతీయ మ్యాచ్ నిషేధం ముగిసింది. దీంతో అతను వచ్చే నెలలో జరగనున్న వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో జాతీయ జట్టు అర్జెంటీనా తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం (ఏఎఫ్ఏ) అధ్యక్షుడు క్లాడియో టపియా వెల్లడించారు. గతేడాది కోపా అమెరికా కప్ టోర్నీలో భాగంగా మూడో స్థానం కోసం చిలీతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ఆటగాడు గ్యారీ మెడెల్‌తో మెస్సీ గొడవకు దిగి రెడ్ కార్డుకు గురయ్యాడు. అంతే కాకుండా ఆతిథ్య దేశం బ్రెజిల్‌ను గెలిపించేలా టోర్నీని ఫిక్స్ చేశారంటూ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో అతనిపై ఒక అంతర్జాతీయ మ్యాచ్ నిషేధం విధించారు. అయితే తాజాగా ఈ నిషేధం కాల పరిమితి చెల్లిపోవడంతో మెస్సీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించవచ్చని దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు అలెజాండ్రో డోమిగెజ్ స్పష్టం చేశారు. దీంతో బ్యూనస్ ఎయిర్స్లో అక్టోబర్ 8న ఈక్వెడార్‌తో జరుగనున్న వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ బరిలోకి దిగనున్నాడు. (చదవండి: మెస్సీ కావాలంటే...రూ. 6 వేల కోట్లు) -
అక్కినేని ఫౌండేషన్ కొత్త టీం ఎన్నిక
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను వెల్లడించింది. ఏఎఫ్ఏ బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2016 వ సంవత్సరానికి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులు వీరే.. అధ్యక్షుడు - రవి కొండబోలు ఉపాధ్యక్షురాలు - శారద అకునూరి కార్యదర్శి - ధామా భక్తవస్తలు కోశాధికారి - రావు కల్వల బోర్డు అఫ్ డైరెక్టర్స్: డాక్టర్. శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, డాక్టర్. సి. ఆర్. రావ్, మురళి వెన్నం, చలపతి రావు కొంద్రకుంట, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా నూతన అధ్యక్షుడు రవి కొండబోలు మాట్లాడుతూ - వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో అక్కినేని ప్రథమ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని 2014 లో గుడివాడలో, ద్వితీయ పురస్కార ప్రదానోత్సవాన్ని 2015 లో హైదరాబాద్ లోను ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ సంవత్సరానికిగానూ అక్కినేని తృతీయ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని డిసెంబర్లో చెన్నైలో జరుపనున్నట్లు తెలిపారు. -
డిసెంబర్ 20న 'అక్కినేని' అవార్డుల ప్రదానోత్సవం
హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) పని చేస్తోందని చైర్మన్ తోటకూర ప్రసాద్ తెలిపారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సామాజిక సేవ, దృక్పథం, కష్టపడే స్వభావం వంటి సులక్షణాలకు అక్కినేని మారుపేరని కొనియాడారు. అక్కినేని పేరు మీద అవార్డు నెలకొల్పి సమాజానికి సేవ చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులకు అందజేస్తున్నామని ప్రసాద్ ఓ ప్రకటనలో తెలియజేశారు. దీనిలో భాగంగా ఏఎఫ్ఏ రెండో వార్షికోత్సవ సందర్బంగా 'అక్కినేని అంతర్జాతీయ అవార్డుల వేడుక'ను డిసెంబర్20న ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ అవార్డుల ఫంక్షన్‌కి తమిళనాడు గవర్నర్ కే రోశయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అవార్డు గ్రహితలు: లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు: సూపర్ స్టార్, కృష్ణ విశిష్ట వ్యాపార రత్న: ఏవీఆర్ చౌదరి(జీ&సీ గ్లోబల్) సినీ రత్న: కైకాల సత్యనారాయణ రంగస్థల రత్న: కర్నతి లక్ష్మీ నర్సయ్య(ప్రజానటుడు) విద్యారత్న: చుక్కారామయ్య(ఐఐటీ రామయ్య) విద్యారత్న: గుల్లా సూర్య ప్రకాశ్ సేవా రత్నా: డా.సునితా కృష్ణన్ యువరత్న: కుమారి పూర్ణమలావత్(ఎవరెస్ట్ అధిరోహకురాలు) చేనేత కళారత్న: నల్లా విజయ్ అంతేకాకుండా 'యువతను ప్రభావితం చేస్తున్న సామాజిక సవాళ్లు, వాటిపరిష్కారాలు' అనే అంశం మీద 6 నిమిషాలలోపు నిడివిగల షార్ట్పిల్మ్ పోటీల్లో గెలుపొందినవారికి లక్షరూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. -
అధికారుల నిర్వాకం వల్లే..!
- ‘ఫోర్జరీ’ కేసులో కొత్తకోణం - వెలుగులోకి జోనల్ కార్యాలయ అధికారుల చేతివాటం? కుత్బుల్లాపూర్: ఫోర్జరీ పనుల కేసులో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. చేయని పనులకు సంబంధిత కాంట్రాక్టర్లు బిల్లులు డ్రా చేసే విషయంలో సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని ఆడిట్, ఎగ్జామినర్, ఫైనాన్స్ అడ్వైజరీ (ఎఫ్ఏ) విభాగాల్లో పనిచేసే అధికారులు సహకరించారని విచారణలో వెలుగు చూసింది. జగద్గిరిగుట్టకు చెందిన కాంట్రాక్టర్ లక్ష్మణ్‌రాజు ఈ తతంగానికి తెర లేపారు. వీరికి ఔట్సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న ఉపేందర్‌రెడ్డి సహకరించినట్లు విచారణలో తేలింది. మూడు బృందాలుగా సీఐ చంద్రశేఖర్, ఎస్సై లింగ్యానాయక్‌లు చేపట్టిన విచారణలో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేసే అధికారుల నిర్వాకం వల్లే ఈ ఫోర్జరీ పనుల బాగోతం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంట్రాక్టర్లకు 60 (రూ.24 లక్షలు) శాతం, అధికారులకు 40(రూ.16 లక్షలు) శాతం సొమ్ము ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని, వీరికి మధ్యవర్తిగా ఔట్సోర్సింగ్ సిబ్బంది వ్యవహరించారని తెలుస్తోంది. తెలియక తప్పు చేశాం.. డబ్బులు వెనక్కి ఇస్తాం ఫోర్జరీ బాగోతంపై అధికారులు ఆరుగురు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్ (నిషేధిత జాబితా)లో చేర్చడంతో పాటు డ్రా చేసిన మొత్తాన్ని వెంటనే వాపస్ చేయాలని ఈ నెల 6 న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన నలుగురు కాంట్రాక్టర్లు తాము చేసింది తప్పేనంటూ, డబ్బులు వాపస్ ఇస్తామని తాజాగా శనివారం ఇన్‌వార్డు సెక్షన్లో లిఖిత పూర్వకంగా లేఖలు అందజేశారు. మరో ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రం తాము ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. ఫోర్జరీ సృష్టికర్త లక్ష్మణ్‌రాజు 2012-14 సంవత్సరాల్లో చేసిన పనుల్లో కూడా అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. కాగా కాంట్రాక్టర్లు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ముందస్తు బెయిల్ కోసం కోర్టుచుట్టూ చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది. వర్క్ఇన్స్పెక్టర్ల బదిలీ ఫోర్జరీ పనుల బాగోతంపై స్పందించిన జోనల్ కమిషనర్ హరిచందన..ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను సికింద్రాబాద్, అల్వాల్, మల్కాజ్గిరి ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే 14 మంది కంప్యూటర్ ఆపరేటర్లను అల్వాల్, మల్కాజ్గిరి లకు బదిలీ చేయగా తాజాగా 16 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు.