'హోదా' భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు..
హార్ట్ఫోర్డ్ :
ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు దండుకున్నారని అమెరికాలోని కనెక్టికట్ స్టేట్ ఎన్ఆర్ఐలు మండిపడ్డారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీలు గుప్పించారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ చాలు అంటూ మాట మారుస్తున్నారని..ఇది సిగ్గుమాలిన చర్య అని ఎన్ఆర్ఐలు ధ్వజమెత్తారు.
ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదా పోరాటానికి ఎన్ఆర్ఐల సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మోదీ, చంద్రబాబునాయుడు మాట మార్చినందుకుగానూ హార్ట్పోర్డ్లోని ఎన్ఆర్ఐలు ఫ్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, జితేందర్, హరిపెరుగు, శ్రినిను వాసిరెడ్డిలతోపాటూ మరికొందరు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
'ప్రత్యేక హోదా భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు'..
'ప్రత్యేక హోదా రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?..' అంటూ ప్రత్యేక హోదాకు మద్దతుగా ఎన్ఆర్ఐలు నినదించారు.