
అమెరికాలో రోడ్డు ప్రమాదం : తెలుగు మహిళ మృతి
అట్లాంటా : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు మహిళ నాగమణి మృతిచెందారు. వివరాలు.. అట్లాంటాలోని న్యూటన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమణి తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన పీడ్‌మోన్ట్ న్యూటన్ ఆసుపత్రికి ఆమెని తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే నాగమణి మృతిచెందారు. హెన్రీ కౌంటీలో నాగమణి టీచర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త శంభు ప్రసాద్ తనికెళ్ల ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కుమారుడు భరద్వాజ అట్లాంటాకు బయలుదేరారు.
ఆటా టీం ఘటనా స్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టింది. కరుణ్ ఆసిరెడ్డి, శివకుమార్, అనిల్ బోడిరెడ్డిలు ఆటా నుంచి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.