‘సరైనోడు’ బ్లాక్ టికెట్లు: వ్యక్తి అరెస్ట్ | 1 arrested -for-selling-black-tickets-for sarainodu movie | Sakshi
Sakshi News home page

‘సరైనోడు’ బ్లాక్ టికెట్లు: వ్యక్తి అరెస్ట్

Published Fri, Apr 22 2016 2:00 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

1 arrested -for-selling-black-tickets-for sarainodu movie

కీసర(రంగారెడ్డి): స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పవర్‌ఫుల్ డెరైక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు సినిమా శుక్రవారం విడుదలైంది. మొదటి ఆట నుంచే సినిమా చూడాలని అభిమానులు ఎగబడుతుండటంతో.. టిక్కట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా భావించిన కొందరు బ్లాక్ టికెట్ల అమ్మకం మొదలు పెట్టారు. ఒక్కో టికెట్ రూ. 500కు అమ్ముతుండటంతో.. ప్రేక్షకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్న నాగరాజు అనే యువకుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కొంత నగదుతో పాటు 9 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలోని కృష్ణా థియేటర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement