1000 పవర్ టిల్లర్లు మంజూరు
Published Sun, Aug 14 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
జెడ్పీ చైర్మన్ నామన
పి.గన్నవరం :
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాకు వెయ్యి పవర్‌టిల్లర్లు మంజూరు అయ్యాయని జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు వెల్లడించారు. వీటిని వ్యవసాయ అధికారులు రాయితీపై రైతులకు పంపిణీ చేస్తారని చెప్పారు. ఆదివారం ఆయన పి.గన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు వ్యవసాయ యాంత్రీకరణ వైపు దృష్టిసారించి సాగు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధించడంతో పాటు, ప్రతి అంగుళం భూమిని సద్వినియోగం చేసుకుంటూ అదనపు ఆదాయాన్ని సాధించే మార్గాలను అవలంబించాలని సూచించారు. జిల్లాలో 2.33 లక్షల హెక్టార్లకుగాను ఇంతవరకూ 1,90,500 హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యాయని చెప్పారు. రైతులకు మరిన్ని సేవలందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలో 74 మంది ఎంపీఈఓలను నియమిస్తున్నదని నామన చెప్పారు.
Advertisement
Advertisement