గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడిలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడిలో గ్రామ శివారులో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న 170 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రేపల్లె సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు రహదారిపై కాపు కాసిన పోలీసులు రేషన్ బియ్యం లోడుతో భీమవరం వైపు వెళ్తున్న లారీని పట్టుకున్నారు. లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.