ఫూలే సేవలు ఆదర్శం
Published Tue, Nov 29 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
ఎల్‌బీనగర్: మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం బీఎన్ రెడ్డినగర్‌లో ఫూలే వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు, ఆడపిల్లల చదువు కోసం జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి ఎంతో కృషి చేశారని అన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా ఫూలే జీవితాంతం పోరాడారని తెలిపారు. ఫూలే కల లు కన్న రాజ్యం రావాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం పూలే చేసిన త్యాగాలను మననం చేసుకుంటూ వారి బాటలో నడవాలని అన్నారు. అనంతరం పలువురికి జ్యోతిరావు పూలే మెమోరియల్ అవార్డులను ప్రదానం చేశారు. బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ రఘురాం నేత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు టి.వీరేందర్‌గౌడ్, కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న, నాయకులు కె.లక్ష్మ య్య, బాబూరావు, హరికృష్ణ, సత్యనారాయణ, జగన్నాథం, రాము నేత, చామకూర రాజు, సంజయ్‌కుమార్, రాములు, నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ పూలే వర్ధంతిని నిర్వహించారు.
Advertisement